తిరుపతి, న్యూస్‌లైన్: ‘‘మాది ఒకటే లక్ష్యం.. ఒకటే గమ్యం. అదే సమైక్యాంధ్ర. లక్ష్యం సాధించే వరకు, గమ్యం చేరే వరకు విశ్రమించేది లేదు. మా పోరాటం ఆగదు. పంతాలు, పట్టింపులు వద్దు. భవిష్యత్ తరాల కోసం విభజన ప్రకటనను వెనక్కు తీసుకోండి. అదే మా డిమాండ్.’’ అంటూ సమైక్యవాదులు సోమవారం తమ ఉద్యమాన్ని తీవ్రతరం చేశారు.
జిల్లాలో మొదలైన సమైక్య ఉద్యమం 34 రోజులు గడిచినా నిరసనలు వెల్లువెత్తుతున్నా యి. చిత్తూరులో డీఆర్‌డీఏ, డ్వామా ప్రాజెక్ట్ డెరైక్టర్లు అనిల్‌కుమార్‌రెడ్డి, చంద్రమౌళి ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్షలు జరిగాయి. జిల్లాలోని ఐకేపీ సంఘాల సిబ్బంది పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. సమైక్యాంధ్ర పరిరక్షణ వేదిక సభ్యులు ఎమ్మెల్యే సీకే.బాబు ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. న్యాయశాఖ ఉద్యోగులు వెనక్కు నడిచి నిరసన తెలిపారు. నాయీ బ్రాహ్మణులు మేళతాళాలతో నిరసన ప్రదర్శన చేశారు.
మదనపల్లెలో టమాట మండీ వ్యాపారులు వాహనాలతో భారీ ర్యాలీ నిర్వహించా రు. ప్రెస్‌క్లబ్ ఆధ్వర్యంలో జర్నలిస్టులు బైక్ ర్యాలీ నిర్వహించారు. ఆదాయపు పన్ను శాఖ, వాణిజ్యపన్ను శాఖ అధికారులు వంటావార్పు చేపట్టారు. పలమనేరులో జేఏసీ ఆధ్వర్యంలో చెవిలో పూలు, తలపై కుర్చీలతో నిరసన తెలి పారు. విద్యార్థి జేఏసీ కార్యకర్తలు పట్టణంలోని కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలను మూసివేయించారు. వీ.కోటలో విద్యార్థులు రెండు కిలోమీటర్లు మానవహారం నిర్మించి రాస్తారోకో చేపట్టారు.
గంగవరం, పెద్దపంజాణి మండలా ల్లో జేఏసీ ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమా లు కొనసాగాయి. సమైక్యవాదులు రహదారుల ను దిగ్బంధించారు. రామకుప్పంలో విద్యార్థు లు, ఉపాధ్యాయులు మానవహారం చేపట్టారు. వరదయ్యపాళెంలో వైఎస్‌ఆర్‌సీపీ పిలుపు మేర కు 48 గంటల బంద్ కొనసాగుతోంది. శ్రీకాళహస్తిలో ఉపాధ్యాయ జేఏసీ ఆధ్వర్యంలో నడిరోడ్డుపై ఆట, పాట కార్యక్రమం జరిగింది. పెళ్లిమండపం వద్ద రిలే నిరాహార దీక్షలో వివిధ ప్రభుత్వ శాఖల ఉద్యోగులు పాల్గొన్నారు.
సత్యవేడులో ఉపాధ్యాయ జేఏసీ భారీ ర్యాలీ నిర్వహించింది. తిరుపతిలో ఉద్యోగ ఐక్యకార్యాచరణ సమితి ఆధ్వర్యంలో ఆర్టీసీ బస్టాండ్ వద్ద ధర్నా జరిగింది. మబ్బు చెంగారెడ్డి ఆధ్వర్యం లో ఓల్వో బస్సులతో ర్యాలీ నిర్వహించారు. పుత్తూరులో ఎన్జీఓవోల జేఏసీ ఆధ్వర్యంలో దీక్షలు కొనసాగాయి. బీ.కొత్తకోటలో 800 అడుగుల జాతీయ పతాకాన్ని ప్రదర్శించారు.
ఒకటే లక్ష్యం.. ఒకటే గమ్యం
Published Tue, Sep 3 2013 2:47 AM | Last Updated on Thu, Oct 4 2018 5:34 PM
Advertisement
Advertisement