samaikyavadulu
-
బీజేపీ నేతలపై దాడి
అనకాపల్లి, న్యూస్‌లైన్: ఊహించని పరిణామాన్ని బీజేపీ నేతలు ఎదుర్కొన్నారు. ఉద్యమం ఉధృతి సమయంలో విభజనకు కట్టుబడిన పార్టీగా ముద్రపడినందున సమైక్య వాదుల ఆగ్రహానికి గురయ్యారు. స్థానిక వివేకానంద ఛారిటబుల్ ట్రస్టు ఆవరణలో శుక్రవారం బీజేపీ జిల్లాస్థాయి కార్యవర్గ సమావేశం ప్రశాంతంగా మొదలయింది. మూడునెలలకొకసారి నిర్వహించాలి. విభజన ఆందోళన నేపథ్యంలో ఐదు నెలలు విరామం అనంతరం తప్పనిసరి పరిస్థితుల్లో సమావేశం ఏర్పాటు చేశారు. ఇందులో ఉత్తరాంధ్ర వెనుకుబాటుతో పాటు సమైక్యాంధ్ర ఉద్యమ తీవ్రతను చర్చించి అధిష్టానానికి తెలియపరిచేందుకు నిర్ణయించామని ఆ పార్టీ నాయకులు తెలిపారు. కాగా బీజేపీ సమావేశం జరుగుతున్నదని తెలుసుకున్న ఉపాధ్యాయ జేఏసీ సభ్యులు అక్కడికి వెళ్లి సమైక్యాంధ్రకు మద్దతు పలకాలని డిమాండ్ చేశారు. సమావేశ మందిరంలోని కొందరి పోకడతో బీజేపీ నాయకులు, ఉపాధ్యాయ జేఏసీ నాయకుల మధ్య వాదోపవాదం,తోపులాట చోటుచేసుకుంది. ఇది తెలుసుకున్న పట్టణంలోని సమైక్యాంధ్ర పరిరక్షణ సమితి సభ్యులు పెద్ద ఎత్తున సమావేశ మందిరంలోకి దూసుకువెళ్లారు. తక్షణం బీజేపీ నాయకులు సమైక్యాంధ్రకు మద్దతు పలకాలని, ఉపాధ్యాయ జేఏసీ సభ్యులపై దాడి చేసినందుకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. పరిస్థితి అదుపుతప్పడంతో పట్టణ సీఐ శ్రీనివాసరావు నేతృత్వంలో పోలీసులు వచ్చి ఆందోళనకారులను శాంతింపజేసేందుకు ప్రయత్నించారు. అయినా కుదుట పడలేదు. ఉద్రిక్తంగా మారింది. కంభంపాటి హరిబాబు సన్నిహితులతో మాట్లాడుతూ పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడి తన్నులు తినడానికైనా సిద్ధమేనని అన్నారు. దీంతో ఆందోళనకారులు రెచ్చిపోయి బీజేపీ డౌన్ డౌన్ .. హరిబాబు గో బ్యాక్.. అంటూ నినాదాలు చేశారు. పరిస్థితి చేయిదాటిపోతోందని అవగతం చేసుకున్న పోలీసులు హరిబాబుతో పాటు ఇతర నాయకులను సమావేశ మందిరం నుంచి కిందకు తీసుకువచ్చారు. రెచ్చిపోయిన సమైక్యవాదులు కోడిగుడ్లు విసిరి వాహనాలకు అడ్డుగా నిలిచారు. పోలీసులు లాఠీచార్జి చేసి నిరసనకారులను చెదరగొట్టారు. నిరసనకారులు రాళ్లు రువ్వడంతో హరిబాబు కారు అద్దాలు పగిలాయి. అర్ధంతరంగా సమావేశం ముగిసింది. ఎటువంటి తీర్మానాలు లేకుండానే అంతా వెళ్లిపోయారు. ఈ సమావేశానికి పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యుడు సోమా వీర్రాజు, రాష్ట్ర ఉపాధ్యక్షుడు బండారు రంగమోహన్, జిల్లా ఇన్చార్జి మళ్ల వెంకటరావు, జిల్లా పార్టీ అధ్యక్షుడు బండారు సన్యాసినాయుడు, కార్యదర్శి గొంతిన భక్తసాయిరామ్, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రాజకుమారి, పుట్టా గంగయ్యతో పాటు గోవిందరావు, కొణతాల అప్పలరాజు తదితరులు పాల్గొని చేదు అనుభవాన్ని ఎదుర్కొన్నారు. ఆందోళనలో ఎన్జీవోల అధ్యక్షుడు మాదేటి పరమేశ్వరరావు, ఉపాధ్యాయులు కె.ఎన్.వి.సత్యనారాయణ, బుద్ద కాశీ, పీలా రవి, దూలం గోపీ, పి.వి.రమణ, దాడి జయవీర్, మర్రాశేఖర్, శంకర్‌బాబు, సిరసపల్లికాశీ, మళ్ల అబ్బాయినాయుడు, ఎస్..ఎల్.టి. రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. -
సమైక్యంగా ఉంచు..గణనాయకా.!
రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచు గణనాయకా.. విభజన విఘ్నాలు తొలగించు వినాయకా.. అంటూ సమైక్యవాదులు విఘ్నేశ్వరుడికి ఆదివారం పూజలు చేశారు. సమైక్యాంధ్ర పరిరక్షణ ఉద్యమంలో భాగంగా వినూత్న కార్యక్రమాలతో నిరసనలు చేపట్టారు. మైలవరం, కూచిపూడి తదితర ప్రాంతాల్లో సమైక్యాంధ్రకు మద్దతు హోమాలు నిర్వహించారు. మానవహారాలు, రాస్తారోకోలు, దిష్టిబొమ్మ దహనం కార్యక్రమాలు కొనసాగాయి. సాక్షి , విజయవాడ : రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని కోరుతూ జిల్లా ప్రజలు వినాయకునికి పూజలు మొదలుపెట్టారు. పలుచోట్ల సమైక్య వినాయకుని ప్రతిరూపాలను ఏర్పాటు చేస్తున్నారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని కోరుతూ ఏపీ ఎన్జీవోల ఆధ్వర్యంలో వినాయకుని మట్టిప్రతిమలను భక్తులకు పంచిపెట్టారు. మచిలీపట్నంలో న్యాయశాఖ జేఏసీ ఆధ్వర్యంలో జిల్లా కోర్టు సమీపంలోని వినాయకుడి ఆలయంలో పూజలు నిర్వహించారు. అనంతరం గార్మి షరీఫ్ దర్గాలో ప్రార్థనలు చేశారు. హైదరాబాద్‌లో శనివారం జరిగిన సేవ్ ఆంధ్రప్రదేశ్ సభకు వెళ్లి తిరిగివస్తున్న సీమాంధ్ర బస్సులపై, ఉద్యోగులపై తెలంగాణవాదులు దాడికి పాల్పడటాన్ని నిరసిస్తూ జగ్గయ్యపేట మున్సిపల్ సెంటర్లో జేఏసీ, ఉద్యోగ సంఘాలు, వివిధ పార్టీల నాయకులు రాస్తారోకో నిర్వహించారు. కుంటముక్కలలో వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో జాతీయ రహదారిపై ఆదివారం రాస్తారోకో చేశారు. జి.కొండూరు పొలిటికల్ జేఏసీ ఆధ్వర్యంలో స్థానిక పులివాగు వంతెన సమీపంలో చేపడుతున్న రిలే నిరాహార దీక్షలు 14వ రోజుకు చేరాయి. విస్సన్నపేటలో నిర్వహిస్తున్న రిలే దీక్ష 12వ రోజుకు చేరింది. కొండపల్లిలో ఎన్టీటీపీఎస్ గేటు వద్ద జేఏసీ ఆధ్వర్యంలో విద్యుత్ ఉద్యోగులు చేస్తున్న రిలే దీక్షలు ఏడోరోజుకు చేరాయి. మైలవరంలో బ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో అర్చకులు శాంతిహోమం, లక్ష్మీగణపతి హోమం, నవగ్రహ హోమం, పూర్ణాహుతి కార్యక్రమాలు నిర్వహించారు. మొవ్వ మండలం కూచిపూడిలో అర్చక సమాఖ్య ఆధ్వర్యంలో హోమం జరిపారు. ఈస్ట్ కృష్ణా జేఏసీ ఆధ్వర్యంలో మచిలీపట్నం కోనేరుసెంటరులో తలపెట్టిన రిలే నిరాహారదీక్షా శిబిరానికి సమైక్య రాష్ట్ర పరిరక్షణ వేదిక కోచైర్మన్ మత్తి కమలాకరరావు సంఘీభావం తెలిపారు. చల్లపల్లిలో వినూత్న నిరసన చల్లపల్లిలో వినూత్న నిరసన చేపట్టారు. కొంతమందిని కేసీఆర్, కోదండరామ్, తెలంగాణ వాదులుగా పోల్చి సమైక్యాంధ్ర మేకను వారు బలిచ్చేందుకు సిద్ధపడగా సమైక్యాంధ్రవాదులుగా జేఏసీ నాయకులు ఆ మేకను రక్షించి విముక్తి కల్పించారు. ఘంటసాల మండల పరిధిలోని చిట్టూర్పులో సమైక్యాంధ్రకు మద్ధతుగా రహదారిపై వంటావార్పు నిర్వహించారు. అనంతరం రహదారి పైనే భోజనాలు చేశారు. కైకలూరు వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో వె నక్కి నడుస్తూ నిరసన తెలిపారు. గాంధీబొమ్మ సెంటర్ వద్ద మానవహారంగా ఏర్పడ్డారు. కలిదిండి సెంటరులో సమైక్యాంధ్రకు మద్దతుగా చేపట్టిన దీక్షలు 38వ రోజుకు చేరాయి. సోనియా దిష్టిబొమ్మను దహనం చేశారు. కంభంపాడులో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో చేస్తున్న రిలే నిరాహార దీక్షలు ఐదోరోజుకు చేరాయి. జగ్గయ్యపేట మున్సిపల్ సెంటర్లో పేట జేఏసీ ఆధ్వర్యంలో జరుగుతున్న 20వ రోజు దీక్షల్లో పట్టణ ఆర్యవైశ్య సంఘ నాయకులు కూర్చున్నారు. హనుమాన్‌జంక్షన్‌లో రాజకీయేతర జేఏసీ ఆధ్వర్యంలో చేపట్టిన రిలే దీక్షలు 36వ రోజుకు చేరాయి. మాలమహానాడు ఆధ్వర్యంలో తీన్మార్ డప్పు వాయిద్యాలతో జంక్షన్ సెంటర్లో నిరసన ప్రదర్శన చేశారు. జాతీయ రహదారిపై కర్రసాము ప్రదర్శించి వినూత్నరీతిలో నిరసన తెలిపారు. గుడివాడలో జేఏసీ ఆధ్వర్యంలో కొనసాగుతున్న రిలే దీక్షలు 37వ రోజుకు చేరాయి. కాపవరం సర్పంచ్, పాలకవర్గ సభ్యులు గ్రామస్తులు సమైక్యాంధ్రకు మద్దతుగా పామర్రులో జరుగుతున్న రిలేదీక్షలలో పాల్గొన్నారు. జనార్ధనపురం శివారు టెలిఫోన్‌నగర్ కాలనీలో సమైక్యాంధ్రకు మద్దతుగా ఉపాధ్యాయ జేఏసీ నిర్వహిస్తున్న రిలేదీక్షలు ఎనిమిదో రోజుకు చేరాయి. తిరువూరు బోసుబొమ్మ సెంటర్లో విద్యార్థులు వివిధ రకాల విన్యాసాలు ప్రదర్శించారు. ఉపాధ్యాయ సంఘాల ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ ఆందోళనలో హర్ష కరాటే స్కూల్ విద్యార్థులు సమైక్య నినాదాలు చేస్తూ కరాటే, పిరమిడ్లు వంటి విన్యాసాలతో నిరసన తెలిపారు. మట్టి వినాయక విగ్రహాలు పంపిణీ చేసి.. సమైక్యాంధ్రకు మద్దతుగా వైఎస్సార్సీపీ పెనమలూరు నియోజకవర్గ సమన్వయకర్త తాతినేని పద్మావతి ఆధ్వర్యంలో మట్టి వినాయకుడి విగ్రహాలు భక్తులకు ఉచితంగా పంపిణీ చేశారు. వీరంకిలాకులో రోడ్డుపై యువకులు కబడ్డీ ఆడుతూ నిరసన తెలిపారు. పెడన పట్టణంలో ఎంఎస్హెచ్ఎఫ్ కమిటీ బైలం సాహేబ్ మహేల పెద్దలు బ్రహ్మపురం రైల్వే గేటు సెంటర్ నుంచి ర్యాలీ నిర్వహించారు. పెడనలో వీవీఆర్ ఆధ్వర్యంలో రిలే దీక్ష శిబిరం కొనసాగింది. వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో నూజివీడు జంక్షన్‌రోడ్డులో నిర్వహిస్తున్న రిలేదీక్షలు 13వ రోజుకు చేరుకున్నాయి. చనుబండలో ఆటో వర్కర్ల యూనియన్ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించి రాస్తారోకో చేశారు. నందిగామ గాంధీసెంటర్‌లో వైఎస్సార్ సీపీ ఆధ్వర్యంలో రిలేదీక్షలు కొనసాగాయి. -
జన ఉప్పెన
రాష్ట్రవిభజనకు వ్యతిరేకంగా సమైక్యవాదులు గర్జిస్తున్నారు. సమైక్యాంధ్ర పరిరక్షణకు అన్ని గళాలూ ఏకమవుతున్నాయి. పట్టణాలే కాదు పల్లెల్లోనూ జనం వేలాదిగా స్వచ్ఛందంగా తరలివస్తున్నారు. దీంతో రోడ్లన్నీ జనసంద్రాలవుతున్నాయి. విజయవాడ, జగ్గయ్యపేట, నూజివీడు, ఉయ్యూరు తర్వాత గురువారం చల్లపల్లిలో జనం కదలివచ్చారు. లక్షగళ గర్జనను విజయవంతం చేశారు. సాక్షి, విజయవాడ : నగరాలు, పట్టణాలే కాదు పల్లెల్లో కూడా జనం కదం తొక్కుతున్నారు. లక్షగళ గర్జనలతో సమైక్యాంధ్రకు మద్దతును బలంగా చాటుతున్నారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని కోరుతూ గురువారం చల్లపల్లిలో నిర్వహించిన లక్షగళ గర్జనతో రోడ్లు జనంతో నిండిపోయాయి. సన్‌ఫ్లవర్ విద్యాసంస్థలు, జేఏసీ, మీడియా ఫోరం సంయుక్త ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. ఈ నెల ఆరో తేదీ నుంచి వారం రోజులపాటు నిర్వహించనున్న కార్యాచరణకు జిల్లా సమైక్యాంధ్ర జేఏసీ పిలుపునిచ్చింది. 11, 12 తేదీలలో 48 గంటల బంద్ జరుగుతుందని తెలిపింది. ఈ బంద్‌లో ప్రైవేట్ ట్రావెల్స్, కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలు, బ్యాంకులు, విద్యా సంస్థలు, ఆటో వర్కర్స్, ఓనర్స్ యూనియన్లు పాల్గొనాలని కోరింది. మచిలీపట్నం కోనేరుసెంటరులో ఏర్పాటుచేసిన రిలే దీక్ష శిబిరాన్ని మాజీ ఎమ్మెల్యే పేర్ని నాని సందర్శించి సంఘీభావం తెలిపారు. రిలేదీక్ష శిబిరంలోనే గురుపూజోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు. మచిలీపట్నం జిల్లా ప్రభుత్వాస్పత్రి వైద్యులు, సిబ్బంది తాడు లాగుడు ఆట ఆడి నిరసన తెలిపారు. సెయింట్ ప్రాన్సిస్ ఉన్నత పాఠశాల విద్యార్థులు ర్యాలీ జరిపి, మాక్ అసెంబ్లీ నిర్వహించారు. జగ్గయ్యపేటలో జాతీయ జెండాతో నిరసన జగ్గయ్యపేటలోని ఇరిగేషన్, రెవెన్యూ, ఆర్టీసీ ఉద్యోగ సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో 200 మీటర్ల జాతీయజెండాతో భారీ నిరసన ప్రదర్శన చేశారు. ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులు కళ్లకు గంతలు కట్టుకుని చేసిన బైక్ ర్యాలీకి స్థానిక న్యాయవాదులు సంఘీభావం తెలిపారు. శ్రావణమాసం ముగింపును పురస్కరించుకొని పట్టణంలోని ముత్యాలమ్మ అమ్మవారి ఆలయం నుంచి పలువురు భక్తులు సమైక్యాంధ్రకు మద్దతుగా పట్టణంలో రథోత్సవం నిర్వహించారు. వత్సవాయిలో జాతీయ రహదారిపై ఉపాధ్యాయులు గురుపూజోత్సవం జరిపారు. నూజివీడులో వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో చేపట్టిన దీక్షలు పదోరోజుకు చేరాయి. జేఏసీ ఆధ్వర్యంలో 29వ రోజు, న్యాయవాదుల ఆధ్వర్యంలో 18వ రోజు దీక్షలు కొనసాగాయి. తిరువూరులో ఆర్టీసీ ఉద్యోగులు భిక్షాటన చేసి నిరసన తెలిపారు. ప్రైవేట్ విద్యా సంస్థల ఆధ్వర్యంలో నందిగామ గాంధీ సెంటర్లో ఏర్పాటుచేసిన రిలే దీక్షా శిబిరం కొనసాగింది. కైకలూరులో 30వ రోజుకు చేరిన దీక్షలు.. కైకలూరు వైఎస్సార్ సీపీ కార్యాలయం వద్ద పార్టీ నియోజకవర్గ సమన్వయకర్త దూలం నాగేశ్వరరావు ఆధ్వర్యంలో కొనసాగుతున్న దీక్షలు గురువారానికి 30వ రోజుకు చేరాయి. కైకలూరు తాలూకా సెంటర్లో ఎన్జీవో దీక్షలు 23వ రోజూ కొనసాగాయి. ఉపాధ్యాయులు రిలే దీక్షలలో కూర్చున్నారు. పాత్రికేయులు పలువురు ఉపాధ్యాయులకు టీచర్స్‌డే సందర్భంగా రోడ్డుపై సన్మానం చేశారు. కలిదిండి మండలంలో తాపీ వర్కర్లు దీక్షలు చేశారు. ముదినేపల్లిలో ఉపాధ్యాయులు రిలే దీక్షలు జరిపారు. మండవల్లిలో టీచర్స్ జేఏసీ ఆధ్వర్యంలో వంటావార్పూ, రిలే దీక్షలు, ర్యాలీలు నిర్వహించారు. గుడివాడలో పట్టణంలోని ప్రైవేటు పాఠశాలల విద్యార్థులు స్థానిక నెహ్రూచౌక్ వద్ద భారీ ధర్నా జరిపారు. ది గుడివాడ పెయింటర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో పెయింటర్లు పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించి పొట్టి శ్రీరాములు విగ్రహానికి నివాళులర్పించారు. అనంతరం స్థానిక నెహ్రూచౌక్‌లో జై..సమైక్యాంధ్ర అంటూ పెయింట్లు వేస్తూ తమ నిరసన వ్యక్తం చేశారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచకపోతే సీమాంధ్ర ప్రజల జీవితాలు కొడిగట్టిన దీపాలుగా మారతాయని వైఎస్సార్ సీపీ నేత బేతపూడి నవరత్నరాజు అన్నారు. జనార్ధనపురం శివారు టెలిఫోన్‌నగర్‌లో ఉపాధ్యాయ జేఏసీ నిర్వహిస్తున్న రిలేనిరాహారదీక్ష కార్యక్రమంలో డప్పు వాయిద్యాల మధ్య నృత్యాలు చేశారు. ఏపీ ఎన్జీవోల సంఘం కంచికచర్ల తాలూకా యూనిట్ ఉద్యోగులు జాతీయ రహదారిపై ప్రదర్శనలు, మానవహారాలు నిర్వహించారు. ఆకట్టుకున్న కళాకారుల నిరసన.. కంచికచర్ల, వీరులపాడు మండలాల కళాకారుల ఆధ్వర్యంలో అల్లూరి సీతారామరాజు, శ్రీకృష్ణదేవరాయలు, తెలుగుతల్లి వేషధారణలతోపాటు పలు రకాల వేషాలతో ట్రాక్టర్లపై ఊరేగుతూ విభజన నిర్ణయానికి వ్యతిరేకంగా నిరసన ప్రదర్శన నిర్వహించారు. బాపులపాడు మండలం వీరవల్లి గ్రామ శాలివాహన కాలనీ జేఏసీ ఆధ్వర్యంలో చెన్నై-కోల్‌కతా జాతీయరహదారిపై సారెలు ఏర్పాటు చేసి కుండలు తయారుచేస్తూ రాష్ట్ర విభజన నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ నిరసన ప్రదర్శన చేపట్టారు. జీ.కొండూరులో రిలే దీక్షలు 11వ రోజుకు చేరుకున్నాయి. ఇబ్రహీంపట్నంలో వీటీపీఎస్ గేటు వద్ద ఉద్యోగులు ఆటలతో నిరసన తెలిపారు. విజయవాడలో 500 బైక్‌లతో ర్యాలీ రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా ది విజయవాడ వెహికల్ డీలర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కేసరపల్లి నుంచి విజయవాడకు 500 మోటారు బైక్‌లతో ఏలూరు రోడ్డు మీదుగా నగరంలో ర్యాలీ నిర్వహించారు. ఆంధ్ర రాష్ట్రం విడిపోతే సీమాంధ్ర ఎలా ఉంటుందో బ్యానర్లు ప్రదర్శిస్తూ విజయవాడలో ప్రభుత్వాస్పత్రి వైద్యులు ర్యాలీ జరిపారు. -
ఒకటే లక్ష్యం.. ఒకటే గమ్యం
తిరుపతి, న్యూస్‌లైన్: ‘‘మాది ఒకటే లక్ష్యం.. ఒకటే గమ్యం. అదే సమైక్యాంధ్ర. లక్ష్యం సాధించే వరకు, గమ్యం చేరే వరకు విశ్రమించేది లేదు. మా పోరాటం ఆగదు. పంతాలు, పట్టింపులు వద్దు. భవిష్యత్ తరాల కోసం విభజన ప్రకటనను వెనక్కు తీసుకోండి. అదే మా డిమాండ్.’’ అంటూ సమైక్యవాదులు సోమవారం తమ ఉద్యమాన్ని తీవ్రతరం చేశారు. జిల్లాలో మొదలైన సమైక్య ఉద్యమం 34 రోజులు గడిచినా నిరసనలు వెల్లువెత్తుతున్నా యి. చిత్తూరులో డీఆర్డీఏ, డ్వామా ప్రాజెక్ట్ డెరైక్టర్లు అనిల్‌కుమార్‌రెడ్డి, చంద్రమౌళి ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్షలు జరిగాయి. జిల్లాలోని ఐకేపీ సంఘాల సిబ్బంది పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. సమైక్యాంధ్ర పరిరక్షణ వేదిక సభ్యులు ఎమ్మెల్యే సీకే.బాబు ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. న్యాయశాఖ ఉద్యోగులు వెనక్కు నడిచి నిరసన తెలిపారు. నాయీ బ్రాహ్మణులు మేళతాళాలతో నిరసన ప్రదర్శన చేశారు. మదనపల్లెలో టమాట మండీ వ్యాపారులు వాహనాలతో భారీ ర్యాలీ నిర్వహించా రు. ప్రెస్‌క్లబ్ ఆధ్వర్యంలో జర్నలిస్టులు బైక్ ర్యాలీ నిర్వహించారు. ఆదాయపు పన్ను శాఖ, వాణిజ్యపన్ను శాఖ అధికారులు వంటావార్పు చేపట్టారు. పలమనేరులో జేఏసీ ఆధ్వర్యంలో చెవిలో పూలు, తలపై కుర్చీలతో నిరసన తెలి పారు. విద్యార్థి జేఏసీ కార్యకర్తలు పట్టణంలోని కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలను మూసివేయించారు. వీ.కోటలో విద్యార్థులు రెండు కిలోమీటర్లు మానవహారం నిర్మించి రాస్తారోకో చేపట్టారు. గంగవరం, పెద్దపంజాణి మండలా ల్లో జేఏసీ ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమా లు కొనసాగాయి. సమైక్యవాదులు రహదారుల ను దిగ్బంధించారు. రామకుప్పంలో విద్యార్థు లు, ఉపాధ్యాయులు మానవహారం చేపట్టారు. వరదయ్యపాళెంలో వైఎస్ఆర్సీపీ పిలుపు మేర కు 48 గంటల బంద్ కొనసాగుతోంది. శ్రీకాళహస్తిలో ఉపాధ్యాయ జేఏసీ ఆధ్వర్యంలో నడిరోడ్డుపై ఆట, పాట కార్యక్రమం జరిగింది. పెళ్లిమండపం వద్ద రిలే నిరాహార దీక్షలో వివిధ ప్రభుత్వ శాఖల ఉద్యోగులు పాల్గొన్నారు. సత్యవేడులో ఉపాధ్యాయ జేఏసీ భారీ ర్యాలీ నిర్వహించింది. తిరుపతిలో ఉద్యోగ ఐక్యకార్యాచరణ సమితి ఆధ్వర్యంలో ఆర్టీసీ బస్టాండ్ వద్ద ధర్నా జరిగింది. మబ్బు చెంగారెడ్డి ఆధ్వర్యం లో ఓల్వో బస్సులతో ర్యాలీ నిర్వహించారు. పుత్తూరులో ఎన్జీఓవోల జేఏసీ ఆధ్వర్యంలో దీక్షలు కొనసాగాయి. బీ.కొత్తకోటలో 800 అడుగుల జాతీయ పతాకాన్ని ప్రదర్శించారు.