కర్నూలు: ప్రేమ పేరుతో వంచనకు గురైన ఓ యువతి జీవితంపై విరక్తి చెంది పురుగుల మందు తాగి కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కోలుకోలేక మృతి చెందింది. ఆత్మకూరు మండలం కొత్తరామాపురం గ్రామానికి చెందిన కల్యాణ్‌కు ముగ్గురు సంతానం, రెండో సంతానం శేషమ్మ ఇంటర్ వరకు చదువుకుంది. ఏడాదిన్నర్ర కాలంగా హైదరాబాద్ జూబ్లీహీల్స్‌లోని మోర్ సూపర్‌మార్కెట్లో సేల్స్‌గర్ల్‌గా పని చేస్తుంది. ఈ నేపథ్యంలో హైదరాబాద్ నగరానికి చెందిన సన్ని అనే యువకునితో పరిచయం ఏర్పడింది. కొంతకాలానికి అది ప్రేమగా మారింది. పెళ్లి చేసుకుంటానని సహజీవనం చేసి మొహం చాటేయడంతో యువతి గత నెల 24వ తేదీన మోర్ మార్కెట్లోనే పురుగుల మందుతాగి ఆత్మహత్యా యత్నానికి పాల్పడింది.
మోర్ మార్కెట్ నిర్వాహకులు వెంటనే ఆమెను ఆస్పత్రికి తరలించి వైద్య చికిత్సలు చేయించి 25వ తేదీ కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించారు. ఆరోజు నుంచి కోమాలోనే వైద్య చికిత్సలు పొందుతూ కోలుకోలేక గురువారం తెల్లవారుజామున మృతి చెందింది. సన్ని అనే యువకుడు తన కూతురును ప్రేమించి మోసం చేశాడని, తండ్రి కల్యాణ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు మూడో పట్టణ సీఐ తెలిపారు.
ప్రేమ పేరుతో వంచన.. యువతి ఆత్మహత్య
Published Fri, Mar 4 2016 2:42 AM | Last Updated on Tue, Nov 6 2018 7:56 PM
Advertisement
Advertisement