
పవన్‌కుమార్ మృతదేహం
బంజారాహిల్స్: తనతో సహజీవనం చేస్తున్న ప్రియురాలు తాను అడగగానే సెల్‌ఫోన్ ఇవ్వలేదని మనస్తాపానికిలోనైన ఓ యువకుడు ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన జూబ్లీహిల్స్ పోలీస్‌స్టేషన్ పరిధిలో గురువారం చోటుచేసుకుంది. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. ఒడిశాకు చెందిన చెందిన పవన్‌కుమార్(21) జూబ్లీహిల్స్‌లోని బై ద బాటిల్ పబ్‌లో చెఫ్‌గా పనిచేస్తున్నాడు. గత కొంతకాలంగా అతను సమీపంలోని ఖవానా రెస్టారెంట్‌లో పనిచేస్తున్నాడు.
పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్న వీరు వెంకటగిరిలో గది అద్దెకు తీసుకొని సహజీవనం చేస్తున్నారు. బుధవారం రాత్రి ఇద్దరూ డ్యూటీ నుంచి గదికి తిరిగి వచ్చారు. ఫోన్ ఇవ్వాల్సిందిగాకోరగా అందుకు ఆమె నిరాకరించడంతో మనస్తాపానికిలోనైన పవన్‌కుమార్ ఆమె నిద్రలో ఉండగానే తెల్లవారుజామున అదే గదిలో ఫ్యానుకు ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతుడి తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.