100 % లవ్
ప్రేమ.. ఇష్క్.. లవ్..
రెండక్షరాల కావ్య గీతిక
రెండు మనసుల కలరుుక
మనసెరిగి.. మనువుతో ముడివేసి.. మరణం వరకు వీడిపోని అనుబంధాల దీపిక
జీవితం ఎన్నో బంధాల సమాహారమైతే..
అన్నింటిలోనూ అపురూపం ప్రేమబంధం..
మాటలకందని అనురాగ చిహ్నం.. మమతానురాగాల తారకమంత్రం..
మనసును ఊహల లోకంలోకి తీసుకెళ్లి కలకాలం.. చిరకాలం..
చిరస్మరణీయంగా నిలిపేదే ప్రేమ ప్రపంచం..
నేడు (శనివారం) ప్రేమికుల దినోత్సవం సందర్భంగా మనజిల్లాలో
ప్రేమకు పట్టాభిషేకం చేసిన ప్రేమ పక్షులపై స్పెషల్ ఫీచర్..
పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకున్నాం
‘మేమిద్దరం ప్రేమించుకున్నాం.. పెళ్లి విషయం పెద్దలకు చెప్పాం.. మొదట్లో కాదన్నా తరువాత ఒప్పించాం.. వారే దగ్గరుండి మావివాహం జరిపించారు..’ అంటూ సెంట్రల్ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు, సుజాత దంపతులు ‘సాక్షి’తో తమ ప్రేమబంధాన్ని పంచుకున్నారు.
1993 మే ఒకటో తేదీన మా వివాహం జరిగింది. కులాంతర వివాహం. 22ఏళ్లుగా సుఖసంతోషాలతో జీవిస్తున్నాం. మాకు ఇద్దరు పిల్లలు సిద్థార్థ, రవితేజ. ప్రేమ వివాహాలు బాధ్యతతో కూడినవి. ఏ సమస్య వచ్చినా స్వయంగా పరిష్కరించుకోవాలి. పెద్దల సహకారం ఉండదు. రక్షణ ఉండదు. ఒకరినొకరు అర్థం చేసుకుంటే జీవితం సాఫీగా సాగుతుంది. ప్రేమ తప్పంటూ తల్లిదండ్రులు తమ అభిప్రాయాలను పిల్లలపై రుద్దడం మంచిది కాదు. ప్రేమికులు కూడా తల్లిదండ్రులను కన్వీన్స్ చేయాలి. ప్రేమను నిరాకరించిందని ప్రేయసిపై దాడులు చేయడం అవివేకం. ప్రేమ పెళ్లయినా, పెద్దలు కుదిర్చిన పెళ్లయినా పరస్పర అవగాహన లేకపోతే ఎక్కువ కాలం నిలవవు. కొన్ని సమయాల్లో సర్దుకుపోవాలి. అప్పుడే ప్రేమ వివాహం సాఫీగా జీవితాంతం సాగుతుంది.. అని ఆ జంట పేర్కొంది. ‘ప్రజాప్రతినిధి కావడంతో ఎక్కువ సమయం కుటుంబసభ్యులతో గడపలేని పరిస్థితి..’ అని ఉమా అంటే.. ‘పరిస్థితి తెలుసు కదా. అర్థం చేసుకుంటా..’ అంటూ సుజాత చెప్పి అన్యోన్య దాంపత్యానికి అర్థంగా నిలిచారు. - గాంధీనగర్
ఇది ప్రేమ విజయం
ప్రేమ ఒక్కటే కాదు.. ప్రేమతో పాటు అనుబంధాలు కూడా ముఖ్యమేనని నిరూపించారు మధురానగర్‌కు చెందిన గంటా కరుణ్‌కుమార్, రేవతి దంపతులు. 2007లో మొదలైన వీరి ప్రేమకు మొదట్లో ఎన్నో అవాంతరాలు ఎదురయ్యూరుు. కులాలు వేరు కావడంతో వివాహానికి పెద్దలు ఒప్పుకోలేదు. ‘నా’ అన్న వారిని బాధపెట్టి సుఖంగా ఉండలేమనుకున్న వారిద్దరూ పెద్దలను ఒప్పించాకే ఒక్కటవ్వాలని నిర్ణరుుంచుకున్నారు. అందుకు రెండేళ్ల పాటు కష్టపడ్డారు. చివరికి ప్రేమే విజయం సాధించింది. కరుణ్, రేవతి శ్రమ ఫలించి పెద్దలు అంగీకారం తెలిపి వారికి ఘనంగా వివాహం జరిపించారు. ప్రేమికుల దినోత్సవం సందర్భంగా వారిద్దరూ ‘సాక్షి’తో మాట్లాడుతూ ‘మా దృష్టిలో ప్రేమకు, కుటుంబ సభ్యులకు, పెద్దలకు ప్రాధాన్యం ఒక్కటే. ప్రేమించిన తరువాత పెద్దవాళ్లను ఒప్పించి వివాహం చేసుకోవడమే ముఖ్యం.’
- మధురానగర్
వైకల్యాన్ని ఎదిరించిన మనసులు
ప్రేమకు పేదరికమే కాదు అంగవైకల్యం కూడా అడ్డుకాదని నిరూపించారు కొండపల్లికి చెందిన పఠాన్ షబ్బీర్‌ఖాన్, సనాభీతూన్. అందరూ ఖాన్‌లోని లోపాన్నే చూస్తే సన మాత్రం ఆయన మంచి మనసును ప్రేమించింది. రెండు కాళ్లు చచ్చుబడి నడవలేని స్థితిలో ఉన్న ఖాన్‌కు అండగా నిలిచింది. వీరి పెళ్లికి సన బంధువులు అడ్డుచెప్పినా ఎదిరించి 2010లో వివాహం చేసుకుంది. తరువాత కొద్దిరోజులకు ఖాన్, సన అన్యోన్య దాంపత్యానికి ముగ్ధులైన బంధువులు మనస్పర్థలు పక్కనపెట్టి కలిసిపోయూరు. ఇప్పుడు వారి ప్రేమకు గుర్తుగా కలిగిన ఇద్దరు మగపిల్లలతో సంతోషంగా బతుకుతున్నారు. - కొండపల్లి (ఇబ్రహీంపట్నం)
విలువలు కలిగిన ప్రేమ అవసరం
ప్రతి ఒక్కరూ విలువలతో కూడిన ప్రేమ కలిగి ఉండాలి. తల్లిదండ్రులను గౌరవిస్తూ, సమాజాన్ని అర్థం చేసుకోగల పరిణితి ఉన్నవారే ప్రేమలో విజయం సాధిస్తారు. ప్రేమ పేరుతో చిన్న వయసులోనే వ్యామోహంలో పడకుండా తొలుత చదువుపై దృష్టిపెట్టాలి. 18 సంవత్సరాలు దాటే వరకు ఆ ఆలోచన రాకూడదు. సరిగా అర్థం చేసుకునే యుక్త వయసులోని ప్రేమ మాత్రమే పరిపూర్ణమవుతుంది. ప్రేమిస్తే.. తల్లి దండ్రులకు చెప్పి ఒప్పించగలిగే ధైర్యం ఉండాలి. కులమతాలకతీతంగా ప్రేమ ఉండాలి. ఒకరినొకరు అర్థం చేసుకోవడంతో పాటు త్యాగం, సెల్ఫ్ డిసిప్లేన్ ప్రేమికులకు అవసరం.
- పర్వతనేని కృష్ణమోహన్,
మానసిక వైద్య నిపుణుడు
మనసున మనసై.. బతుకున బతుకై..
ప్రేమలో ఆనందపు జల్లులే కాదు.. కష్టాల కడగండ్లు కూడా ఉంటారుు. నగరంలోని 51వ డివిజన్ కార్పొరేటర్ కోటిబోరుున దుర్గా భవానీ, మహేశ్‌ల ప్రేమకథ ఇందుకు మినహారుుంపేమీ కాదు. పెద్దలను ఎదిరించి కులాంతర వివాహం చేసుకున్న వీరు మొదట్లో ఆర్థికంగా ఎన్నో ఇబ్బందులు పడ్డారు. అలుపెరగక శ్రమించిన ఈ జంట చివరకు విజయతీరాలకు చేరుకుంది. కులాలు ఒక్కటి కాకపోవడంతో వారిద్దరి ప్రేమను పెద్దవారు అంగీకరించలేదు. వారిని కాదని బయటకు రావడంతో ఆర్థికంగా ఆదుకునేవారే కరువయ్యూరు. బొమ్మల వ్యాపారం చేసినా అంతంత మాత్రంగానే సాగింది. అరుునా ఏమాత్రం నిరుత్సాహ పడకుండా మహేష్ తన భార్య దుర్గాభవానీని డిగ్రీ, పీజీ చదివించడంతో పాటు సివిల్స్‌కు ప్రిపేర్ అయ్యేలా ప్రోత్సహించారు. ఒకరికి ఒకరు సహకరించుకుని రాత్రనక, పగలనక కష్టపడి వ్యాపారం చేసి ఆర్థికంగా స్థిరపడ్డారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో దుర్గాభవానీ కార్పొరేటర్‌గా ఎన్నికయ్యూరు.
- మధురానగర్