పాలకొల్లు, న్యూస్‌లైన్: తెలంగాణ ఉద్యమం కేసీఆర్‌లాంటి స్వార్థ రాజ కీయ నాయకుల నుంచి వచ్చిందని, ఎలాంటి స్వార్థం లేని సమైక్యాంధ్ర ఉద్యమాన్ని ఎవరూ ఆపలేరని ఎమ్మె ల్సీ మేకా శేషుబాబు, మాజీ ఎమ్మెల్యే అల్లు వెంకట సత్యనారాయణ, సమై క్యాంధ్ర పరిరక్షణ సమితి నాయ కులు డాక్టర్ కేఎస్‌పీఎన్‌వర్మ, కొప్పు సత్యనారాయణ, ముచ్చర్ల శ్రీరామ్ స్పష్టం చేశారు. పట్టణంలోని 930 డ్వాక్రాగ్రూపు సంఘ మహిళలు పట్ట ణంలో భారీ ర్యాలీ, 24, 25, 26 వార్డులకు చెందిన ప్రజలు వంటా వార్పు కార్యక్రమం నిర్వహించారు. ముస్లీం సోదరులు గాంధీబొమ్మల సెంటర్‌లోని రహదారిపై ప్రత్యేక ప్రార్ధనలు చేశారు. నాయకులు వారు మాట్లాడుతూ సీమాంధ్ర ప్రజ ల మనో భావాలకు అను గుణంగా రాష్ట్ర విభజన ప్రక్రియను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు.
ఎమ్మెల్యే బంగారు ఉషా రాణి, ఎమ్మె ల్సీ అంగర రామమోహన్, మాజీ ఎమ్మెల్యే డాక్టర్ బాబ్జి, వైఎస్సార్‌సీపీ నాయకులు గుణ్ణం నాగబాబు, యడ్ల తాతాజీ, సంగినీడి సూరి బా బు, చీకట్ల వరహాలు, ఇజ్జాడ చిన బాబు, కంది రామచంద్రరావు, గిం జాల సత్యశ్రీను, నడపన గోవింద రాజులు నాయుడు, రాజేష్‌కన్నా, పొట్నూరి శ్రీను, సత్తిబాబు, రావూరి పాల్గొన్నారు.