ఆకాశంపై ఉమ్మేయొద్దు : విజయసాయిరెడ్డి | Vijayasai reddy fires on Chandrababu | Sakshi
Sakshi News home page

ఆకాశంపై ఉమ్మేయొద్దు : విజయసాయిరెడ్డి

Published Tue, Apr 21 2020 12:48 PM | Last Updated on Tue, Apr 21 2020 12:52 PM

Vijayasai reddy fires on Chandrababu - Sakshi

సాక్షి, అమరావతి : ర్యాపిడ్ టెస్టింగ్ కిట్ల గురించి రాళ్లేయాల్సిన సమయమేనా ఇది అని ఏప్రీ ప్రతిపక్షనేత చంద్రబాబు నాయుడుపై వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి మండిపడ్డారు. చం‍ద్రబాబు జమానాలోలాగా కమీషన్లకు కక్కుర్తి పడే ప్రభుత్వం కాదిది అని ట్విటర్‌లో పేర్కొన్నారు. ప్రజల ప్రాణాలు ముఖ్యం అని, కరోనాను నియంత్రించాలంటే పరీక్షలు పెంచడం తప్పనిసరి అని స్పష్టం చేశారు. బాబు, అతని బానిసలు గోతికాడి నక్కల్లా ఊళలు పెడుతున్నారని ధ్వజమెత్తారు. ఆకాశంపై ఉమ్మేయొద్దని సూచించారు. (‘అసత్య ఆరోపణలు చేయలేదు. అవినీతికి పాల్పడలేదు’)

కరోనా సంక్షోభ సమయంలో ఎర్రని ఎండలను లెక్కచేయకుండా ఇంటింటికి వెళ్లి రోగులను గుర్తించే పనిలో ఉన్న ఆశా సిస్టర్లు, కమ్యూనిటీ హెల్త్ వర్కర్ల సేవలు మర్చిపోలేనివని విజయసాయిరెడ్డి కొనియాడారు. అత్యంత సురక్షిత ప్రాంతంగా రాష్ట్రానికి గుర్తింపు తేవాలన్న ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి ఆశయానికి మీ తోడ్పాటు తప్పనిసరి అని మరో ట్వీట్‌లో పేర్కొన్నారు.
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement