సాక్షి, అమరావతి: గత కొద్దిరోజులుగా చంద్రబాబు ప్రవర్తిస్తున్న తీరుపై వైఎస్సార్‌సీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి ట్విటర్ వేదికగా ధ్వజమెత్తారు. 'కండిషన్ అదుపు తప్పుతోంది. ఇక గొలుసులతో కట్టేయాల్సిందే. మొన్న కరోనా వైరస్‌కు చికిత్స చేయడానికి ఇక్కడి డాక్టర్లకేం తెలుసని పేలాడు. జ్ఞానిని, నాకే అంతుబట్టడం లేదు స్టైరీన్ గ్యాసేమిటో, ఐఏఎస్ లకు ఏం తెలుసని అంటున్నాడు. బాధితుల ట్రీట్మెంటుకు బయటి నుంచి నిపుణులను రప్పించాలట!' అంటూ విజయసాయి రెడ్డి తన ట్వీట్‌లో పేర్కొన్నారు. చదవండి: కోవిడ్: 75శాతం కేసులు అలాంటివే..!
కాగా మరో ట్వీట్‌లో.. 'జనం జేబులు కొట్టడమే జీవిత లక్ష్యమైన బాబు జమానాలో ప్రజల రక్తం స్ట్రా వేసుకు తాగిన జన్మభూమి కమిటీలు వికటాట్టహాసం చేస్తే-ప్రజాశ్రేయమే ప్రమాణమైన సీఎం జగన్ ఏలుబడిలో జనంకోసం రక్తం ధారవోయడానికీ వెనకాడని గ్రామ వాలంటీర్లు కథానాయకులవుతున్నారు! ఎంత తేడా!' అని ఆయన కొనియాడారు. చదవండి: 'ప్రభుత్వంపై బురద జల్లడమే బాబు పని'
Comments
Please login to add a commentAdd a comment