
సాక్షి, విశాఖపట్నం : కరోనా విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై జరుగుతున్న దుష్ప్రచారాన్ని వైఎస్సార్‌సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ఖండించారు. చంద్రబాబు హయాంలో మంత్రులుగా ఉన్నవాళ్లు కరోనాపై కనీసం అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. కావాలంటే కరోనా గురించి ట్యూషన్ పెట్టించుకునైనా తెలివి పెంచుకోవాలని ఎద్దేవా చేశారు. ఈ మేరకు ఆయన మంగళవారం ట్విటర్‌లో ఓ పోస్ట్ చేశారు. ‘అజ్ఞానం, మూర్ఖత్వం ఆవహించిన వీళ్లు మంత్రులుగా.. చంద్రబాబు హయాంలో మేధావులమని బిల్డప్ ఇచ్చేవారు. కరోనాపై కనీస అవగాహన లేకుండా మాట్లాడుతున్నారు. టెస్టులు ఎక్కువగా చేసి చూపిండమేంటి?. వ్యాధి విస్తరణకు ప్రభుత్వం కారణమవడమేంటి?. కరోనా గురించి ట్యూషన్ పెట్టించుకునైనా తెలివి పెంచుకోండయ్యా!’ అని విజయసాయిరెడ్డి పేర్కొన్నారు.