హాలహర్వి: పల్లె గొంతెండుతోంది. చుక్క నీటి కోసం చుక్కలు చూడాల్సి వస్తోంది. వర్షం జాడ లేకపోవడం.. కురిసినా అరకొరే కావడంతో గ్రామీణ ప్రజలు దాహంతో అల్లాడిపోతున్నారు. అధికారుల నిర్లక్ష్యం కారణంగా రిజర్వాయర్లు నిండుకోవడంతో నీటి కోసం జనం పాట్లు వర్ణనాతీతంగా ఉంటున్నాయి. నెల రోజులకోసారి తాగునీటి సరఫరా జరుగుతున్న తీరు పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. మండల పరిధిలోని బాపురం రిజర్వాయర్ నుంచి 36 గ్రామాలకు.. చింతకుంట రిజర్వాయర్ నుంచి 17 గ్రామాలకు తాగునీరు అందాల్సి ఉంది. ఎల్‌ఎల్‌సీలో నీరు పారుతుండగా రిజర్వాయర్లలో నిల్వ చేసుకోవడంలో అధికారులు నిర్లక్ష్యం వహించారు. ఫలితంగా నీటి సమస్య జటిలమైంది.
ఇదే సమయంలో పూడిక పేరుకుపోవడం ఆందోళన కలిగిస్తోంది. చింతకుంట రిజర్వాయర్ ఒట్టిపోవడంతో దీని పరిధిలోని 17 గ్రామాలతో పాటు చిప్పగిరి మండలం డేగులపాడు, కాజీపురం, గుమ్మనూరు గ్రామాల్లోనూ నీటి ఇక్కట్లు తీవ్రరూపం దాల్చాయి. నెల రోజులుగా నీటి సరఫరా నిలిచిపోవడంతో ఆయా ప్రాంతాల్లోని ప్రజలు నీటి కోసం కిలోమీటర్ల దూరం ప్రయాణించాల్సి వస్తోంది. ఎల్‌ఎల్‌సీకి నీరు విడుదలైతే తప్ప సమస్య పరిష్కారమయ్యే పరిస్థితి లేదు. గత ఏడాది జూలై 10లోగా కాలువకు నీరు విడుదలైంది. ఈ సంవత్సరం కర్ణాటకలో వర్షాలు లేకపోవడంతో తుంగభద్ర డ్యాంలో నీటి మట్టం అడుగంటింది.
కాలువకు నీరు ఎప్పుడు విడుదలవుతుందో.. తమ దాహం ఎప్పుడు తీరుతుందో తెలియక పల్లె ప్రజలు గగ్గోలు పెడుతున్నారు. ఇక బాపురం రిజర్వాయర్‌లోని అరకొర నీరు రంగు మారి కలుషితమైంది. ఫిల్టర్ చేయకుండా నేరుగా కుళాయిలకు సరఫరా చేస్తుండటంతో ప్రజలు అనారోగ్యం పాలవుతున్నారు. నీరు ఆశించిన స్థాయిలో లేకపోవడంతో హాలహర్వి, మాచనూరు, బల్లూరు గ్రామాలకు 15 రోజులకోసారి నీటి సరఫరా జరుగుతోంది. ఈ పరిస్థితుల్లో ఆయా గ్రామాల ప్రజలు చెలమలు, పైపులైన్ లీకేజీ నీటితో గొంతు తడుపుకుంటున్నారు.
విడుదలవుతుందో.. తమ దాహం ఎప్పుడు తీరుతుందో తెలియక పల్లె ప్రజలు గగ్గోలు పెడుతున్నారు. ఇక బాపురం రిజర్వాయర్‌లోని అరకొర నీరు రంగు మారి కలుషితమైంది. ఫిల్టర్ చేయకుండా నేరుగా కుళాయిలకు సరఫరా చేస్తుండటంతో ప్రజలు అనారోగ్యం పాలవుతున్నారు. నీరు ఆశించిన స్థాయిలో లేకపోవడంతో హాలహర్వి, మాచనూరు, బల్లూరు గ్రామాలకు 15 రోజులకోసారి నీటి సరఫరా జరుగుతోంది. ఈ పరిస్థితుల్లో ఆయా గ్రామాల ప్రజలు చెలమలు, పైపులైన్ లీకేజీ నీటితో గొంతు తడుపుకుంటున్నారు.
చుక్క నీటి కోసం చుక్కలు చూడాల్సి ...
Published Mon, Jul 14 2014 1:01 AM | Last Updated on Thu, Oct 4 2018 4:40 PM
Advertisement
Advertisement