Rural people
-
నాలుక్కర్చుకున్న ఇండియాటుడే– యాక్సిస్ మై ఇండియా
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికలపై వెల్లడించిన ఎగ్జిట్ పోల్స్‌పై ఇండియాటుడే–యాక్సిస్ మై ఇండియా నాలుక్కర్చుకుంది. యాక్సిస్ మై ఇండియా నిర్వహించిన ఎగ్జిట్ పోల్స్‌ను ఇండియాటుడే శనివారం ప్రసారం చేసింది. ఈ సర్వేపై దేశ వ్యాప్తంగా రాజకీయ విశ్లేషకులు విస్మయం వ్యక్తం చేయడంతో.. ఆదివారం ఇండియాటుడే టీవీలో చర్చ చేపట్టింది. ‘ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్సార్సీపీ ప్రభుత్వం అద్భుతంగా పనిచేసింది. ఐదేళ్లలో విద్య, వైద్య రంగాల్లో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చింది. ప్రభుత్వ పాఠశాలలు, ఆస్పత్రుల రూపురేఖలు మారిపోయాయి.డీబీటీ పథకాల ద్వారా రూ.2.70 లక్షల కోట్ల లబ్ది పేదలకు నేరుగా చేరాయి. జగన్ ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాల పట్ల గ్రామీణ ప్రజలు..ముఖ్యంగా మహిళలు ఎక్కువగా ఆకర్షితులయ్యారు. వారంతా ఈ ఎన్నికల్లో జగన్‌కు అండగా నిలిచారని అంచనా వేస్తున్నాం’ అని ఇండియా టుడే కన్సలి్టంగ్ ఎడిటర్ రాజీదీప్ సర్దేశాయ్ అన్నారు. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఎగ్జిట్‌పోల్స్‌పై ఆదివారం జరిగిన చర్చలో ఆయన మాట్లాడుతూ ఏపీలో జరిగిన మార్పును నేను స్వయంగా చూసాను. పాఠశాలలు, ఆస్పత్రుల్లోచాలా మార్పు కన్పించిందన్నారు. ఈ నేపథ్యంలో మీరు చేసిన సర్వే సహేతుకంగా లేదన్నది స్పష్టమవుతోందంటూ యాక్సిస్ మై ఇండియా అధినేత ప్రదీప్ గుప్తాకు రాజ్‌దీప్ సర్దేశాయ్ చురకలంటించారు.స్కిల్ స్కామ్‌లో చంద్రబాబును అరెస్టు చేయడం వల్ల ప్రజల్లో సానుభూతి.. దక్షిణాది రాష్ట్రాల్లో ఐదేళ్లకు ఓ సారి ప్రభుత్వాన్ని మార్చే సాంప్రదాయం ఉండటం ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీ–జనసేన–బీజేపీ కూటమికి అనుకూలించిందని ప్రదీప్ గుప్తా చెప్పారు. దీనిపై యాంకర్ రాహుల్ కన్వల్ స్పందిస్తూ.. కేజ్రివాల్ అరెస్టు వల్ల ఢిల్లీ, పంజాబ్‌ల్లో.. హేమంత్ సోరేన్ అరెస్టు వల్ల జార్ఖండ్‌లో ప్రజల్లో సానుభూతి రాలేదా.. అక్కడ ఎగ్జిట్ పోల్స్‌లో అది ప్రతిబింబించలేదేం అంటూ ప్రదీప్ గుప్తాను నిలదీశారు. తమిళనాడులో జయలలిత.. తెలంగాణలో కేసీఆర్ వరుసగా రెండు సార్లు విజయం సాధించారని ఎత్తిచూపారు.వీటిని పరిశీలిస్తే.. మీ సర్వేలో శాస్త్రీయంగా లేదేమోనని అనుమానాలు వ్యక్తం చేయడంతో ప్రదీప్‌గుప్తా నీళ్లు నమిలారు. ఇండియాటుడే–యాక్సిస్ మై ఇండియా ఎగ్జిట్ పోల్స్ 2021లో పశ్చిమ్ బంగాలోనూ అంచనాలు తప్పాయి. అక్కడ బీజేపీ విజయం సాధిస్తుందని తేల్చిచెప్పగా.. టీఎంసీ ఘనవిజయం సాధించింది. ఇక గతేడాది నవంబర్‌లో ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధిస్తుందని ఆ సంస్థ ఎగ్జిట్ పోల్స్‌లో వెల్లడించింది. కానీ.. రెండు రాష్ట్రాల్లోనూ బీజేపీ ఘనవిజయం సాధించి, అధికారంలోకి వచ్చింది. -
ఆర్టీసీ ప్రయాణికులకు శుభవార్త.. వారికోసం ‘టీ-9 టికెట్’.. ప్రయోజనాలివే
సాక్షి, హైదరాబాద్: గ్రామీణ, పట్టణ ప్రయాణికులకు ఆర్థికభారం తగ్గించేందుకు తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(టీఎస్ఆర్టీసీ) కీలక నిర్ణయం తీసుకుంది. పల్లె వెలుగు బస్సులో ప్రయాణించే మహిళలు, సీనియర్ సిటీజన్ల కోసం ‘టీ-9 టీకెట్’ అందుబాటులోకి తెచ్చింది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో టీ-24, టీ-6, ఎఫ్-24 టీకెట్లను ఇప్పటీకే అందిస్తోన్న సంస్థ.. తొలిసారిగా గ్రామీణ, పట్టణ ప్రయాణికుల సౌకర్యార్థం టీ-9 టీకెట్ ను అందుబాటులోకి తీసుకురావాలని నిర్ణయించింది. హైదరాబాద్‌లోని బస్ భవన్లో శుక్రవారం ‘టీ-9 టీకెట్’ పోస్టర్‌ను టీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనర్, ఐపీఎస్ ఆవిష్కరించారు. ఈ టీకెట్ ఈ నెల 18(ఆదివారం) నుంచి పల్లె వెలుగు బస్సుల్లో కండక్టర్ల వద్ద అందుబాటులో ఉంటాయని ఆయన తెలిపారు. ►‘టీ-9 టీకెట్’ పల్లె వెలుగు బస్సుల్లో ప్రయాణించే మహిళలు, సీనియర్ సిటీజన్స్‌కు వర్తిస్తుంది. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు మాత్రమే ఈ టీకెట్ చెల్లుబాటు అవుతుంది. ►ఈ టీకెట్ ద్వారా 60 కిలోమీటర్ల పరిధిలో ఒక్కసారి రానూపోను ప్రయాణం చెయొచ్చు. ► ‘టీ-9 టీకెట్’ కు రూ.100 ధరగా టీఎస్ఆర్టీసీ యాజమాన్యం నిర్ణయించింది. టోల్ గేట్ చార్జీలపైన మినహాయింపు ఇచ్చింది. దీంతో ఈ టీకెట్ ద్వారా ఒక్కోక్కరికి రూ.20 నుంచి రూ.40 వరకు ఆదా అవుతుందని సంస్థ ప్రకటీంచింది. ►60 ఏళ్లు పైబడిన సీనియర్ సిటీజన్లు వయసు ధృవీకరణ కోసం తమ ఆధార్ కార్డును కండక్టర్లకు చూపించి టీ-9 టీకెట్ పొందవచ్చు. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు మాత్రమే ఈ టీకెట్లను కండక్టర్లు ఇస్తారు. ►తెలంగాణ రాష్ట్ర పరిధిలోనే ఈ టీకెట్ చెల్లుబాటు అవుతుంది. చదవండి: Hyderabad: నేడు, రేపు ట్రాఫిక్ ఆంక్షలు.. ఆ రూట్లో వెళ్లకండి! ‘పల్లె వెలుగు బస్సుల్లో ప్రతి రోజు సగటున 15 లక్షల మంది ప్రయాణిస్తున్నారు. అందులో మహిళలు, సీనియర్ సిటీజన్లు ఎక్కువగా ఉన్నారు. వారికి ఆర్థికభారం తగ్గించాలనే ఉద్దేశంతోనే పల్లెవెలుగు బస్సుల్లో ‘టీ-9 టీకెట్’కు టీఎస్ఆర్టీసీ యాజమాన్యం శ్రీకారం చుట్టీంది. ఈ టీకెట్ తో రూ.100 చెల్లించి 60 కిలోమీటర్ల పరిధిలో రానూపోను ప్రయాణించవచ్చు. గ్రామీణ, పట్టణ ప్రయాణికులు ఈ సదుపాయాన్ని వినియోగించుకుని సంస్థను ఆదరించాలి’ అని టీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనర్ కోరారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఇప్పటీకే టీ-24, టీ-6, ఎఫ్-24 టీకెట్లను అందుబాటులోకి తెచ్చామని, వాటీకి ప్రయాణికుల నుంచి అనూహ్య స్పందన వస్తోందని గుర్తు చేశారు. ఆ టీకెట్లకు మంచి స్పందన వస్తుండటంతో తొలిసారిగా గ్రామీణ, పట్టణ ప్రయాణికుల కోసం ‘టీ-9 టీకెట్’ను తీసుకువచ్చామని చెప్పారు. ఈ టీకెట్ కు సంబంధించిన పూర్తి వివరాలకు టీఎస్ఆర్టీసీ కాల్ సెంటర్ నంబర్లు 040-69440000, 040-23450033ను సంప్రదించాలని సూచించారు. ‘టీ-9 టీకెట్’ పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమంలో సంస్థ చీఫ్ ఆపరేటీంగ్ ఆఫీసర్(సీవోవో) డాక్టర్ వి.రవిందర్, జాయింట్ డైరెక్టర్ డాక్టర్ సంగ్రామ్ సింగ్ జీ పాటీల్, ఎగ్జిక్యూటీవ్ డైరెక్టర్(ఈడీ)లు, పీవీ ముని శేఖర్, పురుషోత్తం, కృష్ణ కాంత్, సీటీఎం జీవన్ ప్రసాద్, సీఎంఈ రఘునాథరావు, సీఈఐటీ రాజశేఖర్, సీఎఫ్ఎం విజయపుష్ఫ, తదితరులు పాల్గొన్నారు. -
స్వచ్ఛ జల్ సే సురక్ష.. దేశంలోనే రెండో స్థానంలో నిలిచిన ఏపీ
సాక్షి, అమరావతి: గ్రామీణ ప్రజలకు సురక్షిత తాగునీటి సరఫరా కోసం తీసుకుంటున్న చర్యల ద్వారా ఆంధ్రప్రదేశ్ దేశంలోనే టాప్‌లో నిలిచింది. కేంద్ర జలశక్తి శాఖ ఈ విషయాన్ని వెల్లడించింది. ‘స్వచ్ఛ జల్ సే సురక్ష’ పేరుతో గతేడాది అక్టోబర్ 2 నుంచి ఈ ఏడాది జనవరి 26 వరకు కేంద్ర జలశక్తి శాఖ ప్రత్యేక కార్యక్రమాన్ని చేపట్టింది. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంతో దేశంలోని అన్ని గ్రామాల్లో సురక్షిత నీటి వాడకంపై ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తోంది. అలాగే రాష్ట్రాల్లో రక్షిత తాగునీటి సరఫరాకు తీసుకుంటున్న చర్యలను పరిశీలించి మార్కులు కేటాయించింది. గ్రామీణ ప్రాంతాల్లోని తాగునీటి వనరులు(రక్షిత మంచినీటి పథకాలు, బోర్లు, బావులు తదితరాలు) వద్ద నీటి నాణ్యత పరీక్షల నిర్వహణను కేంద్ర జల శక్తి శాఖ పరిశీలించింది. అలాగే నీటిలో ఫ్లోరైడ్, నైట్రేట్ తదితర రసాయనాలతో పాటు ఈ–కోలి తదితర బ్యాక్టీరియా కారకాలను గుర్తించినప్పుడు ప్రభుత్వాలు తీసుకుంటున్న చర్యలను పరిగణనలోకి తీసుకుంది. వర్షాకాలం ముందు, తర్వాత నిర్వహించిన నీటి నాణ్యత పరీక్షల సంఖ్యను.. స్కూళ్లు, అంగన్వాడీ కేంద్రాల్లో తాగునీటి వసతి సౌకర్యాలను, నాణ్యత పరీక్షల నిర్వహణకున్న వసతులు, అందులో స్థానిక మహిళలకు తగిన శిక్షణ కార్యక్రమాల నిర్వహణ తదితర అంశాలను కూడా కేంద్ర జల శక్తి శాఖ పరిశీలించింది. వీటన్నింటి ఆధారంగా 900 మార్కులకు గాను రాష్ట్రాలకు మార్కులు కేటాయించింది. ఈసారి 900 మార్కులకు గాను 598 మార్కులతో తమిళనాడు మొదటి స్థానంలో నిలవగా.. ఆంధ్రప్రదేశ్ 568 మార్కులతో రెండో స్థానం దక్కించుకుంది. 96% నీటి వనరుల వద్ద నాణ్యత పరీక్షలు.. ఏపీలో 87 శాతానికి పైగా గ్రామాల్లో స్థానికంగానే తాగునీటి నాణ్యత పరీక్షల నిర్వహణకు అవసరమైన కిట్లను రాష్ట్ర ప్రభుత్వం అందుబాటులో ఉంచినట్లు కేంద్ర జలశక్తి శాఖ గణాంకాల్లో తేలింది. 18,393 గ్రామాలుండగా, 96 శాతానికి పైగా అంటే 17,772 గ్రామాల్లోని వనరుల వద్ద రెండు విడతల పాటు పరీక్షలు నిర్వహించినట్టు వెల్లడించింది. గ్రామీణ ప్రాంతాల్లో 1.64 లక్షల తాగునీటి వనరుల వద్ద పరీక్షలు నిర్వహించగా, 21,193 చోట్ల వివిధ రకాల కాలుష్య కారకాలను గుర్తించారని తెలిపింది. అందులో 20,739 చోట్ల ఏపీ ప్రభుత్వం అప్పటికప్పుడే ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా రక్షిత మంచినీటి వనరులు కల్పించినట్టు కేంద్ర జలశక్తి శాఖ పేర్కొంది. -
పల్లె సేవకు వేగంగా సిద్ధమవుతున్న భవనాలు
సాక్షి, అమరావతి: పల్లెటూళ్లలోని ప్రజలకు కనీస సౌకర్యాలు అందుబాటులో ఉండేలా.. సొంత ఊరిలోనే సేవలన్నీ అందేలా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలకు సంబంధించిన భవనాల నిర్మాణం పనులు చకచకా జరుగుతున్నాయి. రూ. 40 లక్షలతో గ్రామ సచివాలయం, రైతులకు వ్యవసాయ సంబంధిత సహాయం, సలహాల కోసం రూ. 21.80 లక్షలతో రైతు భరోసా కేంద్రం, గ్రామంలోనే వైద్య సదుపాయం అందుబాటులో ఉండేలా రూ. 17.50 లక్షలతో హెల్త్ క్లినిక్ నిర్మాణం పనులకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతి తెలిపిన విషయం తెలిసిందే. దాదాపు రూ. 12 వేల కోట్ల ఖర్చుతో 36,708 శాశ్వత భవన నిర్మాణాలను ఈ ప్రభుత్వం వచ్చాక మొదలుపెట్టగా.. ఇప్పటి వరకూ 9,628 భవనాలు పూర్తయ్యాయి. మరో 4,757 భవన నిర్మాణ పనులు పైకప్పు కూడా అయిపోయి దాదాపు పూర్తయ్యే దశలో ఉన్నాయి. అన్ని భవనాల నిర్మాణం ఈ ఏడాది అక్టోబర్ నెలాఖరు కల్లా పూర్తి చేయాలని అధికారులకు ప్రభుత్వం లక్ష్యంగా పెట్టింది. ఈ నేపథ్యంలో నిర్మాణ పనులకు సంబంధించిన బిల్లులను ఏమాత్రం ఆలస్యం లేకుండా చెల్లిస్తోంది. వేగంగా పనులు.. అనంతపురం జిల్లా శింగనమల నియోజకవర్గ పరిధిలోని పుట్లూరు మండల కేంద్రంలో గ్రామ సచివాలయ భవనం, రైతు భరోసా కేంద్రం నిర్మాణం ఇటీవలే పూర్తయింది. కర్నూలు జిల్లా ఉయ్యాలవాడ మండలం మాయలూరు గ్రామ సచివాలయం భవన నిర్మాణం పూర్తయింది. ప్రస్తుతం రంగులు వేసే పనులు కొనసాగుతున్నాయి. మంత్రాలయం మండలం చిట్నహళ్లి గ్రామంలో హెల్త్ క్లినిక్ భవనం ప్రస్తుతం బేస్మెంట్, ఫిల్లర్ల నిర్మాణం పూర్తయి గోడల నిర్మాణం దశలో ఉంది. ఇలా రాష్ట్ర వ్యాప్తంగా భవనాల నిర్మాణం పనులు వేగంగా సాగుతూ వివిధ దశల్లో ఉన్నాయి. సత్వరం బిల్లులు చెల్లింపు.. ఇప్పటిదాకా పూర్తయిన, పురోగతిలో ఉన్న భవన నిర్మాణ పనులకు సంబంధించిన బిల్లులు ప్రభుత్వం ఇప్పటికే పూర్తిగా చెల్లించిందని గ్రామీణాభివృద్ది శాఖ అధికారులు వెల్లడించారు. రానున్న రోజుల్లోనూ నిర్మాణ పనులను అనుసరించి ఒక్కో దశ పూర్తయిన వెంటనే ఆ దశకు సంబంధించి బిల్లులు చెల్లించేలా ప్రభుత్వం ముందస్తు కార్యచరణ సిద్ధం చేసినట్టు అధికారులు వెల్లడించారు. బిల్లులు పెండింగ్ లేకుండా చూడటంతో పాటు నిర్దేశించిన గడువులోగా భవన నిర్మాణాలు పూర్తికి వీలుగా గ్రామీణాభివృద్ది శాఖ ముఖ్యకార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది, కమిషనర్ కోన శశిధర్ ప్రతి వారం జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహిస్తూ పురోగతిని సమీక్షిస్తున్నారు. సిమెంట్ ధరల వల్ల పనులకు ఆటంకం కలగకూడదనే ఉద్దేశంతో ప్రభుత్వమే కంపెనీలతో మాట్లాడి తక్కువ ధరకు సిమెంట్‌ను కూడా సరఫరా చేయిస్తోంది. ముఖ్యమంత్రి కార్యాలయంలోని ప్రభుత్వ ప్రత్యేక కార్యదర్శి జవహర్‌రెడ్డి సైతం వారం వారం ఉన్నతాధికారులతోనూ, జిల్లాల కలెక్టర్లతోనూ సమీక్షలు నిర్వహిస్తున్నారు. ఇలా పైనుంచి కింది స్థాయి సచివాలయం ఇంజనీరింగ్ అసిస్టెంట్ వరకూ నిరంతరం శ్రమిస్తు.. పనుల్లో రాజీ పడకుండా నిర్మాణ పనులు కొనసాగేలా చూస్తున్నారు. -
'పల్లె నాడి పట్టే మెడికో'.. ఎన్ఎంసీ వినూత్న ఆలోచన
వారు వైద్య విద్యార్థులు.. రెండు వారాలకోసారి మీ ఊరిలో నేరుగా మీ ఇంటికి వస్తారు. మీతో, మీ ఇంట్లో వారితో మాట్లాడుతారు. అందరి ఆరోగ్యం ఎలా ఉందో పరిశీలిస్తారు. ఏదైనా సమస్య ఉంటే తగిన సూచనలు చేస్తారు. మీ ఆరోగ్య సమస్యకు కారణాలను గుర్తించి పరిష్కారాలను సూచిస్తారు. మంచి అలవాట్లు, పరిశుభ్రత కోసం ఏం చేయాలో చెప్తారు. అదే సమయంలో వైద్యం, ఆరోగ్యంపై తామూ కొంత నేర్చుకుంటారు. జాతీయ వైద్య కమిషన్ (ఎన్ఎంసీ) చేసిన సిఫార్సులు అమల్లోకి వస్తే.. ఇది అమల్లోకి రానుంది. సాక్షి, హైదరాబాద్: ఎంబీబీఎస్ కోర్సులో గ్రామాలు/ప్రజల దత్తత కార్యక్రమాన్ని పాఠ్యాంశంగా ప్రవేశపెట్టాలని జాతీయ వైద్య కమిషన్ (ఎన్ఎంసీ) సిఫా ర్సు చేసింది. గ్రామీణ ప్రాంతాల్లో వైద్యారోగ్య సౌకర్యాలను మరింతగా అందుబాటులోకి తీసుకురావ డం, అదే సమయంలో వైద్య విద్యార్థుల్లో వివిధ వ్యాధులు, క్షేత్రస్థాయి అంశాలపై అవగాహన కల్పించడం ఈ కార్యక్రమం ప్రధాన లక్ష్యమని పేర్కొంది. సమాజంలో ఆరోగ్య ప్రమాణాలను మెరుగుపర్చడానికి ఇది తోడ్పడుతుందని స్పష్టం చేసింది. ఈ అంశంపై ఎన్ఎంసీకి చెందిన యూజీ మెడికల్ ఎడ్యుకేషన్ బోర్డ్ (యూజీఎంఈడీ) ఒక నివేదికను రూపొందించింది. అందులో కీలక సిఫార్సులు చేసింది. కేంద్ర ప్రభుత్వం దీనిని ఆమోదిస్తే త్వరలోనే అమల్లోకి వచ్చే అవకాశం ఉండనుంది. క్షేత్రస్థాయికి వెళ్లేలా.. ఎన్ఎంసీ సిఫార్సుల ప్రకారం.. ఒక్కో బ్యాచ్ ఎంబీ బీఎస్ విద్యార్థులు ఒక గ్రామాన్ని దత్తత తీసుకోవా లి. బ్యాచ్‌లోని ఒక్కో విద్యార్థికి ఐదు నుంచి ఏడు కుటుంబాలను కేటాయిస్తారు. వారు ఆ కుటుంబా ల్లోని వారి ఆరోగ్య పరిస్థితులను గుర్తించి, ఏవైనా సమస్యలు వస్తే ప్రాథమిక సలహా ఇవ్వాలి. ప్రతి 25 మంది విద్యార్థుల బృందాన్ని పర్యవేక్షించడానికి ఒక అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉంటారు. వారికి స్థానిక ఆశా కార్యకర్తల సాయం అందించేలా ఏర్పాటు చేస్తారు. విద్యార్థులు రెండు వారాలకోసారి ఆయా గ్రామాలకు వెళ్లాల్సి ఉంటుంది. కోర్సు తొలి ఏడాదిలో కనీసం 10 సార్లయినా గ్రామాలను సందర్శించాలి. వారు గ్రామా ల్లో గడిపే సమయాన్ని కోర్సులో భాగంగానే పరిగణిస్తారు. విద్యార్థులకు ఆచరణాత్మక శిక్షణ అందేలా పాఠ్యాంశాలు, సిలబస్‌ను రూపొందిస్తారు. ఇక ఈ దత్తత కార్యక్రమంతో విద్యార్థులు క్షేత్రస్థాయికి వెళతారు. ఎంబీబీఎస్ తొలి ఏడాది కోర్సు నుంచే ప్రజలతో మమేకమవుతారు. గ్రామాల ఆరోగ్యానికి.. గ్రామాలను దత్తత తీసుకోవడం వల్ల ఎంబీబీఎస్ విద్యార్థులు క్షేత్రస్థాయిలో స్వయంగా ప్రజల ఆరో గ్య సమస్యలు, వారి సామాజిక ఆర్థిక స్థితిగతులు తెలుసుకోవడానికి వీలుంటుంది. ఇదివారిలో సామాజిక బాధ్యత, అవగాహన పెరగడానికి తోడ్పడనుంది. సరైన ఆహార అలవాట్లు, వ్యక్తిగత పరిశుభ్రత, అనారోగ్యం బారినపడకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రజలకు అవగాహన కల్పించే వీలు కలుగుతుంది. ఒక్కో విద్యార్థికి ఏడు కుటుంబాల వరకు బాధ్యత ఇవ్వడం వల్ల.. ఆయా కుటుంబాల్లోని వారిలో ఎవరికైనా, ఏదైనా అనారోగ్య సమస్య వస్తే.. తక్షణమే టెలి మెడిసిన్ పద్ధతిలో అవసరమైన వైద్య సలహాలు, సూచనలు ఇవ్వొచ్చు. అవసరమైతే తాము చదివే మెడికల్ కాలేజీకి రమ్మనడానికి, ఏదైనా ఆస్పత్రికి రిఫర్ చేయడానికి వీలుంటుంది. ఇలా మరెన్నో ప్రయోజనాలు ఉంటాయని వైద్య నిపుణులు స్పష్టం చేస్తున్నారు. దత్తత తీసుకున్న గ్రామాలకు పదుల సంఖ్యలో వైద్య విద్యార్థులు వచ్చిపోవడం, సలహాలు సూచనలు ఇవ్వడం వల్ల ఆయా గ్రామాలు ఆరోగ్యంగా మారుతాయని చెప్తున్నారు. 33 కాలేజీలు.. 20 వేల మంది విద్యార్థులు రాష్ట్రంలో ప్రస్తుతం 10 ప్రభుత్వ, 23 ప్రైవేట్ మెడికల్ కాలేజీలు ఉన్నాయి. మొత్తంగా 165 బ్యాచ్‌ల్లో కలిపి దాదాపు 20 వేల మంది ఎంబీబీఎస్ విద్యార్థులు ఉంటారు. వీరితోపాటు ఆయుష్, డెంటల్ విద్యార్థులకు కూడా ఇలాంటి కార్యక్రమాన్ని ప్రవేశపెడితే మరో ఐదారు వేల మంది అవుతారు. ఇంతమందికి గ్రామాల దత్తత బాధ్యత ఇస్తే ప్రజలకు మంచి ఆరోగ్య సేవలు అందుతాయని.. విడతల వారీగా కొత్త గ్రామాల్లోనూ వైద్య చైతన్యం వస్తుందని నిపుణులు చెప్తున్నారు. పల్లెల్లో ఏం చేయాలంటే? ►తమకు కేటాయించిన ఐదు నుంచి ఏడు కుటుంబాల ఆరోగ్య రికార్డులను తయారు చేయాలి. ►కుటుంబాల్లోని వారు ఎటువంటి జబ్బులతో బాధపడుతున్నారో గుర్తించి నోట్ చేసుకోవాలి. ► ఏదైనా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వారుంటే.. అవసరమైన వైద్య సలహాలు ఇవ్వాలి. ► ప్రజల సామాజిక, ఆర్థిక పరిస్థితులను పరిగణనలోకి తీసుకోవాలి. ► రోజువారీ ఆహారపు అలవాట్లు, వ్యసనాలు వంటివి గుర్తించాలి. ► రోగాలు రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై తగిన సూచనలు చేయాలి. ► సమీపంలోని ప్రభుత్వ డయాగ్నొస్టిక్ సెంటర్లలో వారికి బీపీ, షుగర్, ఇతర పరీక్షలు చేయించాలి. ► కేన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు, కిడ్నీ, లివర్ ఫంక్షనింగ్ టెస్టులు చేయించాలి. ఈ మేరకు వారిని ప్రోత్సహించాలి. ► పిల్లలకు వ్యాక్సిన్లు, గర్భిణులకు ఇతర చెకప్‌లు చేయించుకోవాల్సిందిగా సూచించాలి. ► అవసరమైనప్పుడు ఫోన్లో అందుబాటులో ఉంటూ.. వైద్య సలహాలు ఇవ్వాలి. -
చెల్లిని మోసుకుంటూ వాగు దాటిన అన్న
చెన్నూర్ రూరల్: సరైన దారిలేక.. వర్షాకాలం లో వాగులు దాటలేక గ్రామీణ ప్రాంత ప్రజలు అల్లాడిపోతున్నారు. ఈ సమస్యతో ఒక్కోసారి ప్రాణాలూ కోల్పోతున్నారు. మంచిర్యాల జిల్లా చెన్నూర్ మండలం నారాయణపూర్‌కు చెందిన నిట్టూరి ప్రవళికకు శనివారం ఫిట్స్ వచ్చాయి. ఆమెను ఆస్పత్రికి తరలించేందుకు కుటుంబసభ్యులు తీవ్ర అవస్థలు పడ్డారు. ఇంటి నుంచి స్కూటీపై తీసుకొచ్చినా.. గ్రామ సమీపంలోని సుబ్బరాంపల్లి వాగుపై వంతెన లేక దాటడం కష్టంగా మారింది. అప్పటికే 108 అంబులెన్స్‌కు సమాచారం అందించగా.. వాగు అవతలి ఒడ్డు వరకు వచ్చింది. ప్రవళికను ఆమె అన్న ప్రభాకర్ మోసుకుంటూ వాగు దాటి అంబులెన్స్ ఎక్కించాడు. చెన్నూర్ ప్రభుత్వ ఆసు పత్రికి తరలించగా చికిత్స పొందుతోంది. -
పల్లెల్లో వైఎస్సార్సీపీ ప్రభంజ
-
పల్లెల్లో వైఎస్సార్సీపీ ప్రభంజనం
సాక్షి, అమరావతి: పాలనను పల్లెకు చేర్చిన విప్లవాత్మక మార్పునకు ప్రజలు ఓటేశారు. సంక్షేమ పథకాలను సంతృప్త స్థాయిలో అమలు చేస్తున్న విధానానికి పల్లె ప్రజలు జై కొట్టారు. పార్టీ రహితంగా జరుగుతున్న గ్రామ పంచాయతీ ఎన్నికల్లో రెండో విడత కూడా వైఎస్సార్సీపీ అభిమానులు విజయబావుటా ఎగుర వేశారు. భారీ సంఖ్యలో సర్పంచ్ స్థానాలను కైవసం చేసుకున్నారు. శనివారం అర్ధరాత్రి దాటిన తర్వాత కూడా సర్పంచ్ ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగింది. ఎన్నికల ఫలితాల సరళి పూర్తిగా ఏకపక్షంగానే సాగింది. దాదాపు 80.4 శాతం గ్రామాల్లో వైఎస్సార్సీపీ అభిమానులు విజయ దుందుభి మోగించారు. గ్రామ సచివాలయాల ద్వారా 524 రకాల ప్రభుత్వ సేవలను మారుమూల పల్లెల్లో సైతం అందుబాటులోకి తీసుకు రావడం ద్వారా అర్హులందరికీ సంతృప్త స్థాయిలో ప్రభుత్వ పథకాలను అందించిన వైఎస్ జగన్ పాలన తీరుకు పూర్తి మద్దతు తెలుపుతున్నారన్నట్టు ప్రజా తీర్పు వెలువడింది. రెండో విడతలో 3,328 గ్రామ పంచాయతీల్లో ఎన్నికలకు నోటిఫికేషన్ ఇవ్వగా, 539 చోట్ల సర్పంచి స్థానాలు ఏకగ్రీవం అయ్యాయి. శ్రీకాకుళం, నెల్లూరు, కర్నూలు జిల్లాల్లో ఒక్కొక్కటి చొప్పున మూడు చోట్ల సర్పంచ్, వార్డు సభ్యుల పదవులకు ఏ ఒక్కరూ నామినేషన్లు దాఖలు చేయనందున అక్కడ ఎన్నికలు జరగలేదు. మిగిలిన 2,786 సర్పంచ్ స్థానాలకు శనివారం పోలింగ్, కౌంటింగ్ జరిగింది. వైఎస్సార్సీపీ అభిమానులు విజయపథాన దూసుకెళుతున్న సరళి విస్పష్టంగా కనిపిస్తుండటంతో ఆ పార్టీ కేంద్ర కార్యాలయం వద్ద పార్టీ శ్రేణులు సంబరాలు చేసుకున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఆ పార్టీ కార్యాలయాల వద్ద ఇదే వాతావరణం నెలకొంది. 81.61 శాతం పోలింగ్ రెండో విడత ఎన్నికల్లోనూ ఓటర్లు పోటెత్తారు. ఉదయం నుంచే పోలింగ్ కేంద్రాలకు వచ్చి ఓటు హక్కును వినియోగించుకున్నారు. 81.61 శాతం ఓటర్లు ఓటు వినియోగించుకున్నారని రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. శనివారం ఉదయం 6.30 గంటలకు పోలింగ్ మొదలై సాయంత్రం 3.30 గంటల వరకు కొనసాగింది. తూర్పు, పశ్చిమ గోదావరి, విశాఖపట్నం, విజయనగరం జిల్లాల్లోని మావోయిస్టు ప్రభావం ఉంటుందని భావించిన దాదాపు 200 గ్రామాల్లో మధ్యాహ్నం 1.30 గంటల వరకే పోలింగ్ జరిగింది. ప్రకాశం జిల్లాలో అత్యధికంగా 86.60 శాతం దాకా ఓట్లు పోలయ్యాయి. శ్రీకాకుళం, నెల్లూరు, చిత్తూరు జిల్లాలు మినహా మిగిలిన 10 జిల్లాల్లో 80 శాతానికి పైగా ఓటు హక్కు వినియోగించుకున్నారు. అత్యధిక గ్రామాల్లో ఉదయమే ఎక్కువ సంఖ్యలో పోలింగ్ జరగగా.. ఆఖరి గంట 2.30 గంటల నుంచి 3.30 గంటల వరకు కేవలం ఐదు శాతం ఓట్లు నమోదు కావడం గమనార్హం. చాలా పోలింగ్ కేంద్రాల్లో మధ్యాహ్నం ఒంటి గంట తర్వాత ఓటు వేసిన వారు చాలా కొద్ది మందేనని పోలింగ్ పర్యవేక్షణ అధికారులు వెల్లడించారు. పోలింగ్ దాదాపు ప్రశాంతం గుంటూరు, ప్రకాశం, విజయనగరం జిల్లాలో ఒకట్రెండు స్వల్ప సంఘటనలు మినహా 13 జిల్లాల పరిధిలో పోలింగ్ ప్రక్రియ పూర్తి ప్రశాంతంగా జరిగినట్టు అధికార వర్గాలు వెల్లడించాయి. గుంటూరు జిల్లా వినుకొండ మండలం నడిగడ్డ గ్రామంలో పోలింగ్‌కు ముందు కొందరు వ్యక్తులు బ్యాలెట్ పేపర్లును అపహరించుకుపోయారు. దీంతో అధికారులు అప్పటికప్పుడు అదనంగా బ్యాలెట్ పేపర్లను ముద్రించి.. తెప్పించడంతో అక్కడ ఎన్నిక సజావుగా కొనసాగింది. గుంటూరు జిల్లాలో తెలుగుదేశం పార్టీకి చెందిన వినుకొండ మాజీ ఎమ్మెల్యే సొంత గ్రామం ఇనిమెళ్లలో కొందరు రిగ్గింగ్ చేసేందుకు ప్రయత్నించగా, అధికారులు సమర్థవంతంగా అడ్డుకొని ఎన్నికల ప్రక్రియను సజావుగా నిర్వహించినట్టు అధికార వర్గాలు తెలిపాయి. విజయనగరం జిల్లా పార్వతీపురం క్రిష్టాపల్లి గ్రామంలో మాజీ ఎమ్మెల్యే చిరంజీవులు పొలింగ్ బూత్‌లోకి చొరబడేందుకు ప్రయత్నించగా, అధికారులు అడ్డుకొని ఎన్నికను సజావుగా నిర్వహించారు. సమస్యాత్మక, అత్యంత సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలుగా గుర్తించిన 9,661 చోట్ల పంచాయతీరాజ్ శాఖ కమిషనర్ కార్యాలయం నుంచి గిరిజాశంకర్ తదితర అధికారులు పోలింగ్ జరుగుతున్న తీరును వెబ్ కెమెరాల ద్వారా నిరంతరం పరిశీలించారు. పోలింగ్ ముగిసిన రెండున్నర గంటల లోపే ఓట్ల లెక్కింపు కూడా ప్రారంభమైంది. ఒట్ల లెక్కింపులో మొత్తం 48,929 మంది సిబ్బందిని వినియోగించినట్టు అధికారులు తెలిపారు. కౌంటింగ్ కేంద్రాల్లో సీసీ కెమెరాలకు ఆదేశం ఓట్ల లెక్కింపు జరిగే కేంద్రాలలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి, కౌంటింగ్ ప్రక్రియను పూర్తిగా రికార్డు చేయాలంటూ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ శనివారం మధ్యాహ్నం జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేశారు. ఆయా గ్రామాల్లో అప్పటికే పొలింగ్ జరుగుతుండడం, కౌంటింగ్‌కు కూడా కేవలం రెండు మూడు గంటల వ్యవధి మాత్రమే మిగిలి ఉన్నప్పుడు ఆ ఆదేశాలు జారీ చేశారు. పలు చోట్ల రిటర్నింగ్ అధికారులు హడావుడి పడుతూ ఆ ఏర్పాట్లు చేసేందుకు ప్రయత్నాలు సాగించారు. -
ఇంకా కట్టెల పొయ్యిలే..
సాక్షి, హైదరాబాద్: దేశంలోని గ్రామీణ ప్రాంత కుటుంబాలు ఇంకా కట్టెల పొయ్యిల పైనే వంట చేస్తున్నాయి. వాతావరణ కాలుష్యం అధిగమించేందుకు చేపడుతున్న కార్యక్రమాల ఫలితాలు ఆశించినంతగా లేవు. దేశంలో ఉన్న హౌస్‌హోల్డ్స్‌కు పూర్తిస్థాయిలో ఎల్పీజీ గ్యాస్ సరఫరా చేసే సామర్థ్యం ఉన్నప్పటికీ.. పంపిణీ ప్రక్రియలో లోపాలు, శుద్ధ ఇంధన వాడకంపై అవగాహన కల్పించడంలో వెనుకబాటుతో ఈ పరిస్థితి ఏర్పడుతోంది. పట్టణ ప్రాంతాల్లోనే ఎక్కువగా వంటకు శుద్ధ ఇంధనాన్ని విని యోగిస్తున్నారు. దేశంలోని 15 రాష్ట్రాలకు సంబంధించి శుద్ధ ఇంధన వాడకంపై నీతి ఆయోగ్ నివేదికను రూపొందించింది. ఇందులో ఆరు రాష్ట్రాల్లోని గ్రామీణ ప్రాంతాల్లో కేవలం 33% మాత్రమే ఎల్పీజీ సిలిం డర్ల ద్వారా వంట చేస్తున్నట్లు తేలింది. దేశంలో ఉన్న శుద్ధ ఇంధన విని యోగంలో అధికంగా ఎల్పీజీ (లిక్విఫైడ్ పెట్రోలియం గ్యాస్) కనెక్షన్లే ఎక్కువగా ఉన్నాయి. గ్రామీణ ప్రభావం ఎక్కువగా ఉన్న ఉత్త రాది రాష్ట్రాలతో పాటు పట్టణ నేపథ్యమున్న దక్షిణాది రాష్ట్రాల్లో పరిస్థితులను పరి శీలిస్తూ వివరాలను నీతి ఆయోగ్ రిపోర్టులో పేర్కొంది. శుద్ధ ఇంధన వినియోగానికి తీసుకోవాల్సిన చర్యలను సూచించింది. మూడింట ఒక వంతే.. దక్షిణాది రాష్ట్రాలతో పోలిస్తే ఉత్తరాది రాష్ట్రాల్లోని గ్రామాల్లోనే వంటచెరకు వినియోగం ఎక్కువగా ఉంది. ముఖ్యంగా బిహార్, జార్ఖండ్, మధ్యప్రదేశ్, ఒడిశా, ఉత్తరప్రదేశ్, పశ్చిమబెంగాల్ రాష్ట్రాల్లో మూడింట ఒక వంతు మాత్రమే శుద్ధ ఇంధనాన్ని వాడుతున్నారు. కేవలం 33% మాత్రమే గ్యాస్ సిలిండర్లు వినియోగిస్తున్నారు. వంటచెరకు లభ్యత ఎక్కువగా ఉండటంతో వినియోగశాతం పెరిగినప్పటికీ.. క్రమంగా ఆ ప్రభావం పర్యావరణంపై పడుతోంది. కొన్నిచోట్ల వంటచెరకుతో పాటు వంటచెరకు వ్యర్థాలు, ఇతర వ్యర్థాలను వినియోగిస్తున్నట్లు పరిశీలనలో తేలింది. ప్రధాన మంత్రి ఉజ్వల యోజన (పీఎంయూవై) లాంటి కార్యక్రమాల ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో ఎల్పీజీ కనెక్షన్లు ఇస్తున్నప్ప టికీ.. లబ్ధిదారులంతా వీటిని తక్కువ సందర్భా ల్లోనే వినియోగిస్తున్నారు. దక్షిణాది రాష్ట్రాల్లో శుద్ధ ఇంధన వినియోగం సంతృప్తికరంగా ఉంది. దేశంలో శుద్ధ ఇంధన వినియోగంలో తెలంగాణ ఆరో స్థానంలో ఉంది. మొదటి స్థానంలో గోవా, రెండో స్థానంలో పంజాబ్, ఆ తర్వాతి స్థానాల్లో ఢిల్లీ, హరియాణా, జమ్ము కశ్మీర్ రాష్ట్రాలున్నాయి. రాష్ట్రంలో గృహాలకు మించి కనెక్షన్లు.. కొన్ని రాష్ట్రాల్లో గ్యాస్ కనెక్షన్లు గృహాల సంఖ్యకు మించి ఉన్నాయి. రాష్ట్రంలో 91.46 లక్షల గృహాలున్నట్లు ప్రభుత్వ గణాంకాలు చెబుతుండగా.. అందులో 1.01 కోట్ల ఎల్పీజీ కనెక్షన్లున్నాయి. పట్టణ ప్రాంతాలు అధికంగా ఉన్న రాష్ట్రాల్లో గృహాల సంఖ్యకు మించి కనెక్షన్లున్నాయి. ఒక్కో గృహంలో ఒకటి, అంతకు మించి కనెక్షన్లున్నాయి. ఎల్పీజీ సరఫరా, అందుబాటులో ఉన్న డీలర్లు, నివాస ప్రాంతం మారడంతో కొత్త కనెక్షన్లు తీసుకోవడం లాంటి కారణాలతో కనెక్షన్లు పెరిగినట్లు తెలుస్తోంది. విస్తృత అవగాహన కల్పించాలి.. శుద్ధ ఇంధన వినియోగాన్ని విస్తృతం చేయాలంటే నిర్దిష్టమైన ప్రణాళికను అమలు చేయాల్సిన అవసరముందని నీతి అయోగ్ పేర్కొంది. ఆ మేరకు రాష్ట్రాలకు దిశానిర్దేశం చేసింది. ‘గ్రామీణ ప్రాంతాల్లో శుద్ధ ఇంధన వాడకంపై విస్తృత అవగాహన కల్పించాలి. ప్రభుత్వం అమలు చేస్తున్న కార్యక్రమాలను క్షేత్రస్థాయిలోకి తీసుకెళ్లాలి. అర్హులందరికీ లబ్ధి కలిగేలా చూడాలి. అవసరమైనంత మేర ఎల్పీజీ సిలిండర్లు తక్కువ వ్యవధిలో సరఫరా చేసే వెసులుబాటు కల్పించాలి. విద్యుత్ సరఫరాకు వైర్లను వినియోగిస్తున్నట్లుగా గ్యాస్ సరఫరాకు పైప్లైన్లు ఏర్పాటు చేయాలి..’అని సూచించింది. -
ఊరు వలసబాట..
సాక్షి, వేమనపల్లి: ఉన్న భూములు అటవీ వివాదంలో ఉన్నాయి.. చేద్దామంటే పనులు లేవు.. తిందామంటే తిండికి లేదు,. వారికి వేరే ఉపాధి లేక రాజారం ఊరు వలస బాట పట్టింది. అందురు పనుల కోసం పట్నం బోతే ఇంటివద్ద ఉన్నోళ్లు చీపుర్ల కోసం అడవిబాట పడుతున్నారు. అక్కడ దొరికే చీపురు పుల్లలను సేకరించి, చీçపుర్లను తయారు చేసి వాటిని విక్రయించిన డబ్బులతోనే జీవనం సాగిస్తున్నారు. రాజారం గ్రామంలో మొ త్తం 88 కుటుంబాలున్నాయి. వీటిలో 56 కుటుంబాలు గత 15 రోజుల నుంచి మంచిర్యాలకు వలస వెళ్తూనే ఉన్నారు. ఇక ఇంటి వద్ద ఉండే ముసలివారు చీపురు పుల్లల సేకరణను ఉపాధిగా ఎంచుకున్నారు. వరి కోతలు, పత్తి తీయడం పనులు మొదలయ్యేదాక వీరికి ఈ పనే ఆధారం. తెల్లవారకముందే సద్ది మూట పట్టుకుని అడవిబాట పడుతారు. వన్యమృగాల భయాన్ని లెక్క చేయకుండా చెట్టూ పుట్టా తిరిగి చీపురు పుల్లలు సేకరిస్తున్నారు. వాటిని ఇంటికి తెచ్చి ఎండలో ఆరబెట్టి వాటిని కట్టలుగా కడుతారు. సమీప గ్రామాల్లో తిరిగి రూ.20 లకు కట్ట చొప్పన అమ్మి జీవనం సాగిస్తున్నారు. పొద్దంతా కష్టపడి చీపురు పుల్లలు ఏరినా.. సరైన కూలీ లభించడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తేలని భూవివాదం.. రాజారం గిరిజనులు భూముల్లేని పేదలు కాదు. చీపురు సేకరణ, వలసలు వెళ్లటమే వీరికి ప్రధానాధారం కాదు. గోదుంపేట శివారులో ఉన్న వీరి భూములు అటవీ వివాదంతో తుడిచిపెట్టుకు పోయాయి. ఈ శివారులో 54 కుటుంబాలకు సాగు భూములున్నాయి. గత 20 ఏండ్ల క్రితమే ప్రభుత్వం పట్టాలిచ్చింది. ఐటీడీఏ సహకారంతో బోర్లు వేసి మామిడి చెట్లు పెంచి ఉపాధి చూపింది. గత 8 సం.లుగా ఆ భూమిపై అటవీ అధికారుల బెదిరింపులు మొదలయ్యాయి. దీం తో భూములను వదిలిపెట్టడంతో వీరు ఉపాధి కోల్పొయి కూలీలుగా మారారు. గత మూడు నెలల క్రితం మా భూములు మాగ్గావాలని గిరిజనులు ఉద్యమానికి సిద్దమయ్యారు. భూముల వద్దకు వెళ్లి సాగు చేసేందుకు అరకలు కట్టారు. దీంతో అటవీ, పోలీస్ అధికారులు 9 మందిపై కేసులు నమోదు చేశారు. ఎన్నికలు పూర్తయ్యేవరకు ఆగాలని స్వయంగా జిల్లా కలెక్టర్ సూచించడంతో గిరిజను లు శాంతించారు. పల్లెల్లో వరి కోతలు, పత్తి సేకర ణ పనులు ప్రారంభం కాకపోవడంతొ కడుపు నిండే మార్గం లేక మంచిర్యాలలోని పలు ప్రాం తాలకు ఇటుక పనికి వెళ్తున్నారు. ఇంటి వద్ద ఉన్న వారు చీపుర్లను అమ్ముకుంటు ఉపాధి పొందుతున్నారు. మేం బతుకుడెట్ల.. మాకు గోదుంపేట శివారులో భూములు ఉన్నా యి. కానీ అటవీఅధికారులు సాగు చేయకుండా బెదిరిస్తున్నారు. ఇగ మేం బతుకుడెట్ల. అందరం మంచిర్యాల ఇటుక ప నులకు పోతె ఇంటి కాడున్నోళ్లు చీపురు ఏరేందుకు పోతాండ్లు. – బుర్సమాంతయ్య రాజారం ఊళ్లో ఉపాధి లేదు.. మాకు ఊళ్ల వేరే ఉపాధి లేదు. ఇగ ఏం పనిజేసుడు. మేమంతా ఇటుక పనికి పోతె ఇంటి కావలికి ముసులోళ్లు ఉంటుర్రు. ఆళ్లకు బువ్వ ఎట్ల, ఉపాసం ఉండలేక చీపురుపుల్లలు ఏరేందుకు పోతుల్లు. వాటితో వచ్చిన పైసలతోని బియ్యం, సామాన్లు కొనుక్కొని జీవనం సాగిస్తున్నారు. – నాయిని చంద్రు -
కదులుతున్న పల్లెలు
ప్రజా సంకల్పయాత్ర నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి: పాదయాత్ర ద్వారా తమ మధ్యకొచ్చిన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డికి జనం తమ సమస్యలను చెప్పుకుంటున్నారు. ప్రభుత్వం చేస్తున్న మోసాలను వివరిస్తూ బోరుమంటున్నారు. ఉండడానికి ఇల్లు లేదు, బతకడానికి పింఛన్ రాదు.. ఏం చేయాలయ్యా, ఎలా బతకాలయ్యా? అంటూ కన్నీటి పర్యంతమవుతున్నారు. బడుగులు, మహిళలు, యువత, కార్మికులు, రైతాంగం... ఇలా అన్ని వర్గాల ప్రజలు తమ ఆవేదనను జగన్‌తో పంచుకుంటున్నారు. కష్టాలను ఎకరవు పెడుతున్నారు. వినతిపత్రాలు సమర్పిస్తున్నారు. వారు చెప్పేది జగన్ ఓపిగ్గా వింటున్నారు. ఆందోళన వద్దంటూ ఊరడిస్తున్నారు. కొన్నాళ్లు ఓపిక పడితే మంచి రోజులు వస్తాయంటూ బతుకులపై భరోసా కల్పిస్తున్నారు. నేనున్నా... అంటూ బాధితుల్లో ధైర్యం నూరిపోస్తున్నారు. పల్లె సీమలు జగన్‌తో కలిసి అడుగులో అడుగు వేస్తున్నాయి. బాబు మోసాలపై రగిలిపోతున్న జనం అలవికాని హామీలిచ్చి చంద్రబాబు మోసం చేశారని పేదలు రగిలిపోతున్నారు. కుడి ఎడమల దగా, దగా అంటూ ఘోషిస్తున్నారు. రైతన్నలకు రుణమాఫీ మాయ, ఫీజు రీయింబర్స్మెంట్ మాయ, ప్రత్యేక హోదా మాయ, రాజధాని మాయ... పోలవరం మాయ... పొదుపు సంఘాలకు రుణమాఫీ మాయ... ఇలా ఏది చూసినా మోసం, దగాలతో సాగుతున్న చంద్రబాబు పాలనపై పేదలు సమర శంఖం పూరిస్తున్నారు. జన్మభూమి కమిటీల అరాచకాలపై దుమ్మెత్తి పోస్తున్నారు. అన్ని వర్గాల వారూ.. మీరే ఆదుకోవాలయ్యా అంటూ జగన్‌ను అర్థిస్తున్నారు. గనిలో, పనిలో, పొలంలో, కార్ఖానాల్లో, కర్మాగారాల్లో... ఇలా పని ప్రదేశాల నుంచి పరిగెత్తుకు వచ్చి తమ గోడు చెప్పుకుంటున్నారు. దారి పొడవునా వినతులు వెల్లువెత్తుతున్నాయి. కిరికిరి కమిటీల పీడ విరగడ చేయండి పల్లె కన్నీరు పెడుతుందో... కనిపించని కుట్రల... అని ఓ కవి అంటే చంద్రబాబు పాలనలో కనిపిస్తున్న కుట్రలతోనే పల్లెలు కంటనీరు పెడుతున్నాయి. చంద్రబాబు అధికారంలోకి వచ్చీ రాగానే నియమించిన జన్మభూమి గ్రామ కమిటీలు అరాచకాలకు, అవినీతికి ఆలవాలంగా మారాయి. మాయకు మారుపేరుగా నిలిచాయి. పసుపు చొక్కాలతో నిండిన ఈ కమిటీలు ఆడిందే ఆట, పాడిందే పాటగా తయారైంది. వీటి సిఫార్సు లేనిదే ఊళ్లల్లో పచ్చి మంచినీళ్లు పుట్టని పరిస్థితి దాపురించింది. పెన్షన్ కావాలన్నా, ఊళ్లకు రోడ్లు కావాలన్నా, రేషన్ దొరకాలన్నా, ఇంటి జాగా మంజూరు కావాలన్నా, ఉపాధి హామీ కార్డు పుట్టాలన్నా... ఇలా ఒకటేమిటి ప్రభుత్వం ప్రకటించిన ఏ సంక్షేమానికైనా ఈ కిరికిరి కమిటీల మాటే వేదవాక్కు. సమాంతర ప్రభుత్వంగా మారిన ఈ దిక్కుమాలిన కమిటీల చేత చిక్కి బడుగులు, ప్రత్యర్థి పార్టీల కార్యకర్తలు పడుతున్న పాట్లు అన్నీ ఇన్ని కాదు. అధికార యంత్రాంగం వీరికే వంత పాడుతోంది. జన్మభూమి కమిటీల అనుమతి లేనిదే ఏ ఒక్క పనీ జరగడం లేదు. చివరకు అరకొరగా అమలవుతున్న రుణమాఫీలోనూ ఈ కమిటీలు చేతి వాటం చూపుతున్నాయి. ప్రాథమిక సహకార బ్యాంకులకు జమ చేసే మొత్తంలోనూ ఈ కమిటీలు ఒక్కో లబ్ధిదారుని నుంచి ఐదారు వేలు నొక్కేస్తున్నాయి. ఈ పీడ విరగడయ్యే మార్గం చూపమని పల్లెలు వైఎస్ జగన్మోహన్రెడ్డిని అడుగడుగునా అభ్యర్థిస్తున్నాయి. జగన్‌ను కలవనున్న రైతులు జాతీయ రైతు దినోత్సవం సందర్భంగా శనివారం అన్నదాతలు వైఎస్ జగన్మోహన్రెడ్డిని కలిసి తమ సమస్యలను విన్నవించాలని నిర్ణయించారు. చంద్రబాబు నాలుగేళ్ల పాలనలో తాము పడుతున్న ఇక్కట్ల గురించి, రుణమాఫీ విషయంలో తామెలా మోసపోయిందీ రైతులు వివరించనున్నారు. మాజీ ప్రధానమంత్రి చరణ్ సింగ్ జయంతిని రైతు దినోత్సవంగా పాటిస్తున్నారు. రైతే దేశానికి వెన్నుముక అని కల్లబొల్లి కబుర్లు చెబుతూనే చంద్రబాబు తమ వెన్ను ఎలా విరుస్తున్నారో రైతులు వైఎస్ జగన్మోహన్రెడ్డికి వివరించనున్నారు. కదిరిలో నేడు భారీ బహిరంగ సభ ప్రజా సంకల్ప యాత్ర శనివారం అనంతపురం జిల్లా కదిరి నియోజకవర్గంలో సాగనుంది. ఈ సందర్భంగా కదిరి ఇందిర సర్కిల్లో బహిరంగ సభ ఏర్పాటు చేశారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గుర్తుపై గెలిచి ఆ తర్వాత అధికార పార్టీ ప్రలోభాలకు అమ్ముడు పోయిన వ్యక్తుల్లో కదిరి ఎమ్మెల్యే ఒకరు. -
బతుకు ఛిద్రం
► అమాయకులపై ‘ల్యాంకో’ కక్ష సాధింపు ► టోల్‌ప్లాజాపై దాడి కేసులో మొదలైన వేధింపులు ► పోలీసులకు భయపడి గ్రామాలను వీడుతున్న యువకులు ► వేధింపులు ఆపకపోతే ఆత్మహత్యలు తప్పవంటున్న మహిళలు కృష్ణరాజపురం : ల్యాంకో సంస్థ చర్యలతో గ్రామీణ ప్రజలు భయభ్రాంతులకు లోనవుతున్నారు. పోలీసులను అడ్డుపెట్టుకుని వేధింపులు సాగిస్తుండడంతో గ్రామాలను వీడి మరో ప్రాంతానికి తరలి వెళుతున్నారు. దీంతో తమ బతుకు ఛిద్రమవుతోందని, ఈ వేధిం పులు ఇలాగే కొనసాగితే తమకు ఆత్మహత్య తప్ప మరో మార్గం లేదంటూ మహిళలు వాపోతున్నారు. వివరాల్లోకి వెళితే... హొసకోటె సమీపంలో మం డూరు గ్రామం వద్ద జాతీయ రహదారిపై ల్యాంక్ సంస్థ టోల్‌ప్లాజా ఉంది. ఇటీవల మండూరుకు చెందిన మంజునాథ్ సొంత పనిపై వెళుతుండగా టోల్‌ప్లాజాలో రుసుం చెల్లించాలని సిబ్బంది అడ్డుకున్నారు. ఆ సమయంలో వాగ్వాదం చోటు చేసుకోవడంతో మంజునాథ్‌ను సిబ్బం ది గదిలోకి లాక్కెళ్లి దారుణంగా చితకబాదారు. అంతకు ముందు కూడా ఇలాంటి ఘటనలతోనే విసుగు చెందిన గ్రామస్తుల్లో ఈ సంఘటన రెచ్చిపోయేలా చేసింది. దీంతో టోల్‌ప్లాజా సమీప ప్రాంతాల్లోని పలు గ్రామాలకు చెందిన ప్రజలు మూకుమ్మడిగా టోల్‌ప్లాజాపై దాడి చేశారు. ఈ ఘటనకు సంబంధించి కేసు నమోదు చేసిన పోలీసులు... రామపుర, ఆదూరు, జోడి హుస్కూరు, బొ మ్మనహళ్లి, హిరండహళ్లి, చీమసంద్ర, కాటంనల్లూరికి చెందిన కొందరిని అదుపులోకి తీసుకున్నారు. పోలీసుల చర్యలతో భయపడిన పలువురు ఇళ్లను వదిలి వెళ/్లపోయారు. తప్పు చేసిన వారిపై కాకుండా అమాయకులపై పోలీసులు విరుచుకుపడుతుండడంతో పిల్లలు, మహిళ లు భయాందోళన మధ్య జీవనం సాగిస్తున్నారు. అర్ధరా త్రి సమయంలో ఇళ్ల తలుపులు తట్టి పోలీసులు దౌర్జన్యంగా వ్యవహరిస్తుండడంతో మహిళలు తీవ్ర ఇబ్బం దులు ఎదుర్కొంటున్నారు. రౌడీల్లా వ్యవహరిస్తున్న టోల్ సిబ్బంది టోల్ గేట్ వద్ద సిబ్బంది రౌడీల్లా వ్యవహరిస్తూ దౌర్జన్యాలకు పాల్పడుతోందని తిగళ క్షత్రియ మహాసభ యువ వేదిక రాష్ట్ర అధ్యక్షుడు హొడి విజయ్‌కుమార్ ఆరోపించారు. విధుల నిర్వహణలో భాగంగా రుసుం చేయాల్సిన టోల్ ప్లాజా సిబ్బంది అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తోందని తెలిపారు. తొలుత స్థానికుడిపై దాడికి పాల్పడిన టోల్‌ప్లాజా సిబ్బందిపై పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం అనుమానాలకు తావిస్తోందని అన్నారు. టోల్‌ప్లాజాపై గ్రామస్తులు దాడి చేసిన సీసీ కె మెరాల పుటేజీలను పోలీసులకు ఇచ్చిన ప్లాజా యాజ మాన్యం... అదే మంజునాథ్‌పై సిబ్బంది దాడి చేసిన సమయంలో ఫుటేజీలను క్షుణ్ణంగా పరిశీలిస్తే దౌర్జన్యాలకు ప్పాలడుతున్నది ఎవరనేది స్పష్టంగా తేలుతుందని బిదరహళ్లికి చెందిన రైతు సంఘం అధ్యక్షుడు ఎం.శాంతకుమార్ అన్నారు. ప్రజల కోసం పనిచేయాల్సిన పోలీసులు పెట్టుబడిదారుడికి దాసోహమంటున్నారని వందేమాతరం రాష్ట్ర అధ్యక్షుడు దేవరాజు ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామస్తుల్లో అంత పెద్ద ఎత్తున వ్యతిరేకత ఎందుకు వచ్చిందో ఒకసారి పోలీసులూ ఆలోచించాలని, నిరంతరం టోల్‌ప్లాజా వద్ద సిబ్బంది సాగిస్తున్న దౌర్జన్యాలతో విసుగుచెందిన ప్రజలు వచ్చిన అవకాశాన్ని వదులుకోకుండా అన్యాయాలపై తిరగబడ్డారని విశ్రాంత పోలీస్ అధికారి సుబ్బణ్ణ వివరించారు. పోలీసులు గ్రామాల్లో శాంతియుత వాతావరణం నెలకొనేందుకు చర్యలు చేపట్టాలని పలువురు సూచిస్తున్నారు. -
నీరు మీది..పేరు మాది..
సాక్షి, కాకినాడ : గ్రామీణ ప్రాంతాల్లో ప్రతి కుటుంబానికి రెండు రూపాయలకే 20 లీటర్ల మినరల్ వాటర్ అందిస్తామని చంద్రబాబు ఎన్నికల్లో ఇచ్చిన హామీల్లో ప్రధాన మైంది. పగ్గాలు చేపట్టిన వెంటనే ఎన్టీఆర్ సుజల స్రవంతి పేరిట ఈ పథకాన్ని అమలు చేయనున్నట్టుగా ఆర్భాటంగా ప్రకటించారు. దీంతో గుక్కెడు నీళ్ల కోసం తల్లడిల్లే పరిస్థితి ఇక ఉండబోదని గ్రామీణ ప్రజలు సంబరపడ్డారు. రూపాయి కూడా నిధులు విదల్చకుండానే చంద్రబాబు ఈ పథకాన్ని అమలు చేయాలని చూస్తున్నారు. ఖజానాలో సొమ్ముల్లేవంటూ.. పథకాల భారాన్ని ఇతరులపై వేయాలని చూస్తున్నారు. ‘ఎన్నికల్లో నేను హామీ ఇచ్చేశాను. దాని అమలు బాధ్యత మీదే’ అంటూ అధికారుల మెడపై కత్తి పెడుతున్నారు. ‘నేను రూపాయి విదల్చను. దండుకొని వచ్చిన సొమ్ముతోనే పథకాలు అమలు చేయండి’ అంటూ ఆదేశాలు జారీ చేస్తున్నారు. కేవలం ప్లాంట్ ఏర్పాటుకు అవసరమైన భవనంతో పాటు మంచినీటి, విద్యుత్ సదుపాయాలను మాత్రమే కల్పించనున్నారు. నిర్వహణలో రోజువారీ వచ్చే విద్యుత్ బిల్లులను కూడా ఆయా సంస్థలే భరించాల్సి ఉంటుంది. నెలకొల్పే ప్లాంట్లలో 30 శాతం వాటి నిర్వహణను డ్వాక్రా సంఘాలకు అప్పగించనున్నారు. మిగిలిన వాటిని ప్లాంట్లు ఏర్పాటుచేసే దాతలే నిర్వహించాల్సి ఉంటుంది. తొలి విడతలో 612 గ్రామాల గుర్తింపు గాంధీజీ జయంతి రోజైన అక్టోబర్ 2 నుంచి ఈ పథకాన్ని అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ర్టంలో తొలిదశలో 5 వేల గ్రామాల్లో ఆర్వో ప్లాంట్లను ఏర్పాటు చేయడం ద్వారా గ్రామీణ ప్రజలకు రూ.2కే 20 లీటర్ల మినరల్ వాటర్ అందించాలని లక్ష్యంగా నిర్ణయించారు. ఇప్పటికే ఈ పథకం అమలుకు సంబంధించిన మార్గదర్శకాల రూపకల్పనపై కసరత్తు జరుగుతోంది. జనాభా ప్రాతిపదిన ఒక్కొక్క ప్లాంట్‌కు రూ.2 లక్షల (1000లోపు జనాభా) నుంచి రూ.4 లక్షల (3 వేల లోపు జనాభా) వరకు ఖర్చవుతుందని అంచనా. మన జిల్లాలో వెయ్యికి పైగా పంచాయతీలు ఉండగా, వాటి పరిధిలో 2290 ఆవాస ప్రాంతాలు (హేబిటేషన్లు) ఉన్నాయి. తొలిదశలో 612 గ్రామాలను జిల్లా యంత్రాంగం గుర్తించింది. వీటిలో కనీసం 400 గ్రామాల్లో శ్రీకారం చుట్టాలని సంకల్పించింది. ప్లాంట్లు ఏర్పాటు చేయాల్సిందే : కలెక్టర్ ప్రభుత్వం నుంచి నిధులొచ్చే అవకాశం లేకపోవడంతో పారిశ్రామిక వేత్తలు, దాతల సహకారం కోసం మంగళవారం కలెక్టరేట్లో కలెక్టర్ నీతూ ప్రసాద్ ప్రత్యేక సమావేశ ం నిర్వహించారు. ఇప్పటికే కంపెనీ సోషల్ రెస్పాన్సిబులిటీ స్కీమ్ కింద ఇప్పటికే కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తున్నా, ఈ భారం మోయలేమని కార్పొరేట్ సంస్థలు విజ్ఞప్తి చేసినా, సీఎస్ఆర్ ఫండ్స్‌తో ముడిపెట్టవద్దంటూ కలెక్టర్ వారికి క్లాస్ తీసుకున్నారు. ‘ఇవి ప్రభు త్వ ఆదేశాలు, అందరూ పాటించాల్సిందే, ముందుకొ చ్చి ఈ ప్లాంట్లన్నీ మీరే ఏర్పాటు చేయాలి, నిర్వహణ కూ డా మీరే చూడాలి’ అంటూ కలెక్టర్ హుకుం జారీ చేశారు. వారు పూర్తి స్థాయిలో అంగీకారం తెలియజేయకున్నప్పటికీ ఒక్కొక్క సంస్థకు పది నుంచి పాతిక ప్లాంట్లు ఏర్పాటు చేయాలని కలెక్టర్ లక్ష్యాలను నిర్దేశించారు. దీంతో ఏం చేయాలో తెలియక బిక్కముఖం పెట్టి ఆయా సంస్థల ప్రతినిధులు కలెక్టర్ ఆదేశాలకు ‘జీ హుజూర్’ అంటూ అంగీకరించారు. ఇలా జిల్లాలో 225 గ్రామాల్లో ప్లాంట్ల ఏర్పాటుకు 14 సంస్థలు ముందుకొచ్చాయి. -
చుక్క నీటి కోసం చుక్కలు చూడాల్సి ...
హాలహర్వి: పల్లె గొంతెండుతోంది. చుక్క నీటి కోసం చుక్కలు చూడాల్సి వస్తోంది. వర్షం జాడ లేకపోవడం.. కురిసినా అరకొరే కావడంతో గ్రామీణ ప్రజలు దాహంతో అల్లాడిపోతున్నారు. అధికారుల నిర్లక్ష్యం కారణంగా రిజర్వాయర్లు నిండుకోవడంతో నీటి కోసం జనం పాట్లు వర్ణనాతీతంగా ఉంటున్నాయి. నెల రోజులకోసారి తాగునీటి సరఫరా జరుగుతున్న తీరు పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. మండల పరిధిలోని బాపురం రిజర్వాయర్ నుంచి 36 గ్రామాలకు.. చింతకుంట రిజర్వాయర్ నుంచి 17 గ్రామాలకు తాగునీరు అందాల్సి ఉంది. ఎల్ఎల్సీలో నీరు పారుతుండగా రిజర్వాయర్లలో నిల్వ చేసుకోవడంలో అధికారులు నిర్లక్ష్యం వహించారు. ఫలితంగా నీటి సమస్య జటిలమైంది. ఇదే సమయంలో పూడిక పేరుకుపోవడం ఆందోళన కలిగిస్తోంది. చింతకుంట రిజర్వాయర్ ఒట్టిపోవడంతో దీని పరిధిలోని 17 గ్రామాలతో పాటు చిప్పగిరి మండలం డేగులపాడు, కాజీపురం, గుమ్మనూరు గ్రామాల్లోనూ నీటి ఇక్కట్లు తీవ్రరూపం దాల్చాయి. నెల రోజులుగా నీటి సరఫరా నిలిచిపోవడంతో ఆయా ప్రాంతాల్లోని ప్రజలు నీటి కోసం కిలోమీటర్ల దూరం ప్రయాణించాల్సి వస్తోంది. ఎల్ఎల్సీకి నీరు విడుదలైతే తప్ప సమస్య పరిష్కారమయ్యే పరిస్థితి లేదు. గత ఏడాది జూలై 10లోగా కాలువకు నీరు విడుదలైంది. ఈ సంవత్సరం కర్ణాటకలో వర్షాలు లేకపోవడంతో తుంగభద్ర డ్యాంలో నీటి మట్టం అడుగంటింది. కాలువకు నీరు ఎప్పుడు విడుదలవుతుందో.. తమ దాహం ఎప్పుడు తీరుతుందో తెలియక పల్లె ప్రజలు గగ్గోలు పెడుతున్నారు. ఇక బాపురం రిజర్వాయర్‌లోని అరకొర నీరు రంగు మారి కలుషితమైంది. ఫిల్టర్ చేయకుండా నేరుగా కుళాయిలకు సరఫరా చేస్తుండటంతో ప్రజలు అనారోగ్యం పాలవుతున్నారు. నీరు ఆశించిన స్థాయిలో లేకపోవడంతో హాలహర్వి, మాచనూరు, బల్లూరు గ్రామాలకు 15 రోజులకోసారి నీటి సరఫరా జరుగుతోంది. ఈ పరిస్థితుల్లో ఆయా గ్రామాల ప్రజలు చెలమలు, పైపులైన్ లీకేజీ నీటితో గొంతు తడుపుకుంటున్నారు. విడుదలవుతుందో.. తమ దాహం ఎప్పుడు తీరుతుందో తెలియక పల్లె ప్రజలు గగ్గోలు పెడుతున్నారు. ఇక బాపురం రిజర్వాయర్‌లోని అరకొర నీరు రంగు మారి కలుషితమైంది. ఫిల్టర్ చేయకుండా నేరుగా కుళాయిలకు సరఫరా చేస్తుండటంతో ప్రజలు అనారోగ్యం పాలవుతున్నారు. నీరు ఆశించిన స్థాయిలో లేకపోవడంతో హాలహర్వి, మాచనూరు, బల్లూరు గ్రామాలకు 15 రోజులకోసారి నీటి సరఫరా జరుగుతోంది. ఈ పరిస్థితుల్లో ఆయా గ్రామాల ప్రజలు చెలమలు, పైపులైన్ లీకేజీ నీటితో గొంతు తడుపుకుంటున్నారు. -
పల్లె క‘న్నీరు’
గుక్కెడు నీటి కోసం పల్లె కన్నీరుపెడుతోంది. భూగర్భజలాలు అడుగంటడంతో కిలోమీటర్ల కొద్దీ వెళ్లి పల్లె ప్రజలు నీళ్లు తెచ్చుకుంటున్నారు. ఎడ్లబండ్లు, సైకిళ్లు, కాలినడకన నీటి కోసం పాట్లు పడుతున్నారు. మైదానం, అటవీప్రాంతం అనే తేడాలేకుండా జిల్లావ్యాప్తంగా పలుచోట్ల ఇదే పరిస్థితి నెలకొంది. నీళ్లు లేనిచోట లేకపోగా..ఉన్నచోట నిర్లక్ష్యం వెంటాడుతోంది. చేతిపంపులు, ట్యాంకులు, పైపులైన్లకు మరమ్మతులు చేయించడంలో ఆర్డబ్ల్యూఎస్, పంచాయతీ అధికారులు పూర్తిగా విఫలమయ్యారు. పంపు ఆపరేటర్ల అలసత్వం..విద్యుత్ సక్రమంగా లేకపోవడంతో మైదాన ప్రజల నోళ్లు ఎండుతున్నాయి. పక్కనే గోదావరి ఉన్నా చెలమల నీళ్లే అడవి బిడ్డలకు దిక్కయ్యాయి. వెరసి పల్లె క‘న్నీటి’ గోడు ఎవరికీ పట్టడంలేదనేందుకు ఈ కథనాలే నిదర్శనం... వేలేరుపాడు, న్యూస్‌లైన్: దాహం దాహం అంటూ గుక్కెడు నీటికోసం పల్లె ప్రజలు అల్లాడుతున్నారు. మండు వేసవిలో గొంతు తడుపుకోవడానికి నానా కష్టాలు పడుతున్నారు. మండలంలోని ఎర్రతోగు, రామవరం ఊటగుంపు, ఉదయ్‌నగర్, పాతరెడ్డిగూడెం, ఒంటిబండ, బోళ్లపల్లి, మేడేపల్లి, బుర్రెడ్డిగూడెం, చింతలపాడు తదితర గ్రామాల్లో ఉన్న తాగునీటి పథకాలు, చేతి పంపులు చెడిపోయి నెలలు దాటుతుతోంది. కొన్ని చోట్ల చేతిపంపులు కూడా లేకపోవడంతో వాగులు, కాల్వలు, చెలమల నీరుతాగాల్సి వస్తోంది. ఎర్రతోగు గ్రామంలో ఉన్న ఏకైక చేతిపంపు చెడిపోయి నాలుగునెలలు కావస్తున్నా మరమ్మత్తులు చేపట్టడం లేదు. ఇక్కడ మొత్తం 55 కొండరెడ్ల కుటుంబాలున్నాయి. ఈ గ్రామస్తులు తాగునీటి కోసం నానా ఇబ్బందులు పడుతున్నారు. వీరంతా అరకిలోమీటరు దూరంలోని ఎర్రకాల్వ వద్ద చెలమల నీరు తెచ్చుకొని తాగుతున్నారు. ఈ కలుషిత నీటిని తాగుతూ వ్యాధుల బారిన పడుతున్నారు. 80 కుటుంబాలున్న బోళ్ళపల్లి గ్రామంలో రక్షిత మంచినీటి పథకం చెడిపోయి ఏడునెలలు అవుతుంది. గ్రామంలో ఉన్న ఏకైక చేతిపంపే దిక్కైంది. పాతరెడ్డిగూడెం గ్రామంలో మంచినీటి పథకం చెడిపోయి పదిరోజులకు పైగా అవుతుంది. ఈ గ్రామస్తులు అరకిలోమీటరు దూరంలోని పెదవాగు నుంచి నీళ్లు తెచ్చుకుని వాడుకుంటున్నారు. ఒంటిబండ గ్రామంలోనూ పథకం మరమ్మతులకు గురై వారం దాటుతున్నా ఎవరూ పట్టించుకోవడం లేదు. మేడేపల్లిలో తాగునీటి పథకం సక్రమంగా పనిచేయడం లేదు. పైప్‌లైన్ నీరు ట్యాంక్ ఉన్న ప్రాంతంలోని కొన్ని ఇళ్ళకు మాత్రమే అందుతున్నాయి. పాఠశాల ఉన్న గుంపునకు అసలు నీళ్ళురావడం లేదు. ఈ ప్రాంత గిరిజనులు చేతిపంపును ఆశ్రయిస్తున్నారు. మరికొందరు పెదవాగు నుంచి నీళ్లు తెచ్చుకుంటున్నారు. రామవరం ఊటగుంపు, ఉదయ్‌నగర్ గ్రామాల్లో చేతిపంపులు పనిచేయకపోవడంతో పెదవాగు, లోతువాగు చెలమల నీరు తాగుతున్నారు. అధికారులు స్పందించి ఆయా గ్రామాల్లో మంచినీటి పథకాలకు మరమ్మతులు చేయించి సక్రమంగా నీరందేలా చర్యలు తీసుకోవాలని మండలవాసులు కోరుతున్నారు. మణుగూరు,న్యూస్‌లైన్: మండలంలోని సమితిసింగారం పంచాయతీలో సర్వయ్యగుంపు వలస గిరిజనులకు తోగునీరే తాగునీరవుతోంది. ఐదేళ్ల క్రితం ఛత్తీస్‌గఢ్ నుంచి వలస వచ్చిన సుమారు 32 కుటుంబాల వలస గిరిజనులు రేగలగండి చెరువు సమీపంలో నివాసం ఉంటున్నారు. జనావాసాలకు దూరంగా ఉంటున్న ఈ గిరిజనులకు ఎటువంటి సౌకర్యాలు లేవు. వీరికి కనీసం తాగునీటి సౌకర్యం కూడా లేదు. వీరి నివాసప్రాంతానికి సమీపంలోని రేగులగండి చెరువుకు వెళ్లే తోగునీటినే తాగునీరుగా వాడుతున్నారు. గ్రామానికి కిలోమీటర్ దూరంలోని తోగులో నుంచి నీటిని తెచ్చుకుంటున్నారు. అత్యంత మురికిగా ఉన్న ఆ నీటిని తాగడం వల్ల గ్రామస్తులు అనారోగ్యానికి గురవుతున్నారు. గ్రామంలో ఓ చేతిపంపును నిర్మించాలని, విద్యుత్ సౌకర్యం కల్పించాలని గుంపువాసులు కోరుతున్నారు. తిరుమలాయపాలెం, న్యూస్‌లైన్ : మండలంలోని పలు గ్రామాల ప్రజలు తాగునీటి కోసం అల్లాడుతున్నారు. కొన్ని గ్రామాలలో నీటి వసతి లేక, మరికొన్ని గ్రామాలలో నీరున్నా విద్యుత్ కొరత, పంచాయతీ సిబ్బంది నిర్లక్ష్యంతో ఇబ్బందులు తప్పడం లేదు. మండలంలోని తిరుమలాయపాలెం, పాతర్లపాడు, మేకలతండా, జింకలగూడెం, మహ్మదాపురం శివారు బోడా తండా తదితర గ్రామాలలో తాగునీటి సమస్య వేధిస్తోంది. పాతర్లపాడు తదితర గ్రామాలలో తాగునీటి వనరులు ఉన్నప్పటికీ సకాలంలో నీరు సరఫరా కావడం లేదు. పంచాయతీ సిబ్బందని ప్రశ్నిస్తే విద్యుత్ కొరతతో సరఫరా చేయలేకపోతున్నామని సాకులు చెపుతున్నారు. తమ గ్రామంలో రెండురోజులకు ఒకసారి నీరు సరఫరా చేసేవారని, ఇటీవలి కాలంలో అది కూడా సక్రమంగా రావడం లేదని స్థానికులు చెప్పారు. ఉన్నతాధికారులు స్పందించి తాగునీటి సమస్య పరిష్కరించాలని ఆయా గ్రామాల ప్రజలు కోరుతున్నారు. -
నీటి కోసం..జాగారం
కల్వకుర్తి, న్యూస్‌లైన్: గ్రామాల్లో ప్రజలు తాగునీటి కోసం తల్లడిల్లుతున్నారు. నియోజకవర్గంలోని గ్రామాల్లో తాగునీటి సమస్య తీవ్రమైంది. దీంతో మహిళలు పొలానికి వెళ్లి పనిచేయడం మాని ప్రత్యేకంగా తాగునీటి కోసం వేచి ఉండే పరిస్థితి నెలకొంది. వ్యవసాయ పనులతో బిజీబిజీగా ఉండే గ్రామీణ ప్రజలు తాగునీటి కోసమే ఎక్కువ సమయం కేటాయించే దుస్థితి నెలకొంది. దీనికి తోడు విద్యుత్ కోతలు తీవ్రం కావడంతో, ఉన్న కొద్ది పాటి నీటిని కరెంట్ వచ్చినపుడే సరఫరా చేస్తున్నారు. దీంతో మహిళలు రాత్రిళ్లు జాగారం చేస్తూ నీటికోసం పాట్లు పడుతున్నారు. నీళ్లున్నా..తప్పని తిప్పలు కొన్ని గ్రామాల్లోని బోర్లలో సరపడా నీళ్లున్నా నిర్వహణ లోపం, బోరుమోటార్లకు మరమ్మతు లు చేయించ కపోవడంతో సమస్యలు మరింత తీవ్రమవుతున్నారు. స్థానిక ఎన్నికల నిర్వహణ లేకపోవడంతో ఇతర ప్రాంతాల్లో ఉండే అధికారులకు సమాచారం చేరడం, వారి స్పందించి తీరిక సమయంలో గ్రామానికి చేరుకొని మోటార్లను బాగుచేయించే నాటికి వారం, పది రోజులు పడుతోంది. బారులుతీరుతున్న జనం.. వర్షాభావ పరిస్థితులతో భూగర్భ జలాలు అడుగంటడంతో ఇప్పటికే కొన్ని బోర్లు అడుగంటే స్థితికి చేరుకున్నాయి. గతంలో పదుల సంఖ్యలో ఉండి, కాలనీలన్నింటికీ నీరందించే చేతిప ంపులు ప్రస్తుతం దిష్టిబొమ్మల్లా మారాయి. మరికొన్ని గ్రామాల్లో వచ్చే కొద్దిపాటి కోసం గంటల కొద్ది పడిగాపులు కాస్తున్నారు. తాగేందుకే నీరు సరిపడా ఉండటంలేదని, దీనికి తోడు కుంటలు, చెరువులు ఎప్పుడో ఎండిపోవడంతో మేకలు, పశువులకు తాగునీరులేక అల్లాడుతున్నాయని గ్రామీణ ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.వేళాపాలా లేకుండా విద్యుత్ అధికారులు కోతలు విధిస్తుండటంతో తాగునీటి సమస్య మరింత తీవ్రమైంది. -
పల్లెల్లో గుర్రాల రేసులు
చోడవరం రూరల్, న్యూస్‌లైన్ : కనుమరుగయ్యాయనుకుం టున్న గుర్రపు పందాలు మళ్లీ ఇప్పుడిప్పుడే ఊపందుకుం టున్నాయి. ఇంతకాలం తీర్థ మహోత్సవాల్లో ఎడ్ల పరుగు పందాలు ప్రజలకు ఉత్సాహం కలిగిస్తుండగా తాజాగా గుర్రం పందాలు కూడా వినోదాన్ని పంచుతున్నాయి. తీర్థాలు, తిరునాళ్ల సందర్భం గా నిర్వహిస్తున్న గుర్రం పరుగు పం దాలు గ్రామీణ ప్రజలను ఆకట్టుకుంటున్నాయి. గతేడాది కూడా కొన్ని గ్రా మాల్లో వీటిని నిర్వహించగా, ఈ ఏడా ది పలు గ్రామాల్లో వీటి కోసం ఏర్పా ట్లు చేశారు. విశాఖపట్నం, అచ్యుతాపురం మండలం రామయ్యపేట, రావి కమతం మండలం కొత్తకోట, టి.అర్జాపురం, దొండపూడి, నాతవరం మండ లం బెన్నవరం తదితర గ్రామాల్లో ఈ గుర్రాలు ఉన్నాయి. పరుగు పందాలకు వస్తున్న గుర్రాల్లో ఎత్తై, బలిష్టమైన జాతి గుర్రాలతోబాటు సాధారణ గుర్రాలు కూడా ఉంటున్నాయి. ఇటీవలే మండలంలోని నర్సయ్యపేటకు చెందిన ముమ్మిన రామకృష్ణ సుమారు రూ.80 వేలతో కొత్తగా గు ర్రాన్ని కొనుగోలు చేశాడు. కేవలం పందాల కోసమే గుర్రాలను కొనుగో లు చేస్తుండడం విశేషం. విశాఖపట్నానికి చెందిన గుర్రం యజమానులు త మ గుర్రాలకు అబ్బాస్, బ్లాకీ, మూనీ, రాణా గుర్రాలుగా పేర్లు పెట్టి పలు పోటీలలో నిలుపుతున్నారు. గుర్రపు పోటీల విజేతలకు వేలాది రూపాయల నగదు బహుమతులను అందచేస్తున్నారు. అలాగే పోటీల్లో పాల్గొనే ప్రతి ఒక్కరికి కొంత మొత్తాన్ని ప్రోత్సాహకంగానూ ఇస్తున్నారు. దీంతో ఈ పోటీలకు వచ్చే గుర్రాల సంఖ్య పెరుగుతోంది. ఔత్సాహికుల్లో ఆసక్తి కూడా అధికమవుతోంది.