బతుకు ఛిద్రం | "Lanco" vengeance on innocent and common people | Sakshi
Sakshi News home page

బతుకు ఛిద్రం

Published Mon, Apr 27 2015 3:39 AM | Last Updated on Wed, Aug 1 2018 2:36 PM

"Lanco" vengeance on innocent and common people

అమాయకులపై ‘ల్యాంకో’ కక్ష సాధింపు
టోల్‌ప్లాజాపై దాడి కేసులో మొదలైన వేధింపులు
పోలీసులకు భయపడి గ్రామాలను వీడుతున్న యువకులు
వేధింపులు ఆపకపోతే ఆత్మహత్యలు తప్పవంటున్న మహిళలు

 
కృష్ణరాజపురం : ల్యాంకో సంస్థ చర్యలతో గ్రామీణ ప్రజలు భయభ్రాంతులకు లోనవుతున్నారు. పోలీసులను అడ్డుపెట్టుకుని వేధింపులు సాగిస్తుండడంతో గ్రామాలను వీడి మరో ప్రాంతానికి తరలి వెళుతున్నారు. దీంతో తమ బతుకు ఛిద్రమవుతోందని, ఈ వేధిం పులు ఇలాగే కొనసాగితే తమకు ఆత్మహత్య తప్ప మరో మార్గం లేదంటూ మహిళలు వాపోతున్నారు. వివరాల్లోకి వెళితే... హొసకోటె సమీపంలో మం డూరు గ్రామం వద్ద జాతీయ రహదారిపై ల్యాంక్ సంస్థ టోల్‌ప్లాజా ఉంది. ఇటీవల మండూరుకు చెందిన మంజునాథ్ సొంత పనిపై వెళుతుండగా టోల్‌ప్లాజాలో రుసుం చెల్లించాలని సిబ్బంది అడ్డుకున్నారు.

ఆ సమయంలో వాగ్వాదం చోటు చేసుకోవడంతో మంజునాథ్‌ను సిబ్బం ది గదిలోకి లాక్కెళ్లి దారుణంగా చితకబాదారు. అంతకు ముందు కూడా ఇలాంటి ఘటనలతోనే విసుగు చెందిన గ్రామస్తుల్లో ఈ సంఘటన రెచ్చిపోయేలా చేసింది. దీంతో టోల్‌ప్లాజా సమీప ప్రాంతాల్లోని పలు గ్రామాలకు చెందిన ప్రజలు మూకుమ్మడిగా టోల్‌ప్లాజాపై దాడి చేశారు. ఈ ఘటనకు సంబంధించి కేసు నమోదు చేసిన పోలీసులు... రామపుర, ఆదూరు, జోడి హుస్కూరు, బొ మ్మనహళ్లి, హిరండహళ్లి, చీమసంద్ర, కాటంనల్లూరికి చెందిన కొందరిని అదుపులోకి తీసుకున్నారు.

పోలీసుల చర్యలతో భయపడిన పలువురు ఇళ్లను వదిలి వెళ/్లపోయారు. తప్పు చేసిన వారిపై కాకుండా అమాయకులపై పోలీసులు విరుచుకుపడుతుండడంతో  పిల్లలు, మహిళ లు భయాందోళన మధ్య జీవనం సాగిస్తున్నారు. అర్ధరా త్రి సమయంలో ఇళ్ల తలుపులు తట్టి పోలీసులు దౌర్జన్యంగా వ్యవహరిస్తుండడంతో మహిళలు తీవ్ర ఇబ్బం దులు ఎదుర్కొంటున్నారు.

రౌడీల్లా వ్యవహరిస్తున్న టోల్ సిబ్బంది
టోల్ గేట్ వద్ద సిబ్బంది రౌడీల్లా వ్యవహరిస్తూ దౌర్జన్యాలకు పాల్పడుతోందని తిగళ క్షత్రియ మహాసభ యువ వేదిక రాష్ట్ర అధ్యక్షుడు హొడి విజయ్‌కుమార్ ఆరోపించారు. విధుల నిర్వహణలో భాగంగా రుసుం చేయాల్సిన టోల్ ప్లాజా సిబ్బంది  అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తోందని తెలిపారు. తొలుత స్థానికుడిపై దాడికి పాల్పడిన టోల్‌ప్లాజా సిబ్బందిపై పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం అనుమానాలకు తావిస్తోందని అన్నారు.

టోల్‌ప్లాజాపై గ్రామస్తులు దాడి చేసిన సీసీ కె మెరాల పుటేజీలను పోలీసులకు ఇచ్చిన ప్లాజా యాజ మాన్యం... అదే మంజునాథ్‌పై సిబ్బంది దాడి చేసిన సమయంలో  ఫుటేజీలను క్షుణ్ణంగా పరిశీలిస్తే దౌర్జన్యాలకు ప్పాలడుతున్నది ఎవరనేది స్పష్టంగా తేలుతుందని  బిదరహళ్లికి చెందిన రైతు సంఘం అధ్యక్షుడు ఎం.శాంతకుమార్ అన్నారు. ప్రజల కోసం పనిచేయాల్సిన పోలీసులు పెట్టుబడిదారుడికి దాసోహమంటున్నారని వందేమాతరం రాష్ట్ర అధ్యక్షుడు దేవరాజు ఆవేదన వ్యక్తం చేశారు.

గ్రామస్తుల్లో అంత పెద్ద ఎత్తున వ్యతిరేకత ఎందుకు వచ్చిందో ఒకసారి పోలీసులూ ఆలోచించాలని, నిరంతరం టోల్‌ప్లాజా వద్ద సిబ్బంది సాగిస్తున్న దౌర్జన్యాలతో విసుగుచెందిన ప్రజలు వచ్చిన అవకాశాన్ని వదులుకోకుండా అన్యాయాలపై తిరగబడ్డారని విశ్రాంత పోలీస్ అధికారి సుబ్బణ్ణ వివరించారు. పోలీసులు  గ్రామాల్లో శాంతియుత వాతావరణం నెలకొనేందుకు చర్యలు చేపట్టాలని పలువురు సూచిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement