పల్లెల్లో గుర్రాల రేసులు
చోడవరం రూరల్, న్యూస్‌లైన్ : కనుమరుగయ్యాయనుకుం టున్న గుర్రపు పందాలు మళ్లీ ఇప్పుడిప్పుడే ఊపందుకుం టున్నాయి. ఇంతకాలం తీర్థ మహోత్సవాల్లో ఎడ్ల పరుగు పందాలు ప్రజలకు ఉత్సాహం కలిగిస్తుండగా తాజాగా గుర్రం పందాలు కూడా వినోదాన్ని పంచుతున్నాయి. తీర్థాలు, తిరునాళ్ల సందర్భం గా నిర్వహిస్తున్న గుర్రం పరుగు పం దాలు గ్రామీణ ప్రజలను ఆకట్టుకుంటున్నాయి.
గతేడాది కూడా కొన్ని గ్రా మాల్లో వీటిని నిర్వహించగా, ఈ ఏడా ది పలు గ్రామాల్లో వీటి కోసం ఏర్పా ట్లు చేశారు. విశాఖపట్నం, అచ్యుతాపురం మండలం రామయ్యపేట, రావి కమతం మండలం కొత్తకోట, టి.అర్జాపురం, దొండపూడి, నాతవరం మండ లం బెన్నవరం తదితర గ్రామాల్లో ఈ గుర్రాలు ఉన్నాయి. పరుగు పందాలకు వస్తున్న గుర్రాల్లో ఎత్తై, బలిష్టమైన జాతి గుర్రాలతోబాటు సాధారణ గుర్రాలు కూడా ఉంటున్నాయి.
ఇటీవలే మండలంలోని నర్సయ్యపేటకు చెందిన ముమ్మిన రామకృష్ణ సుమారు రూ.80 వేలతో కొత్తగా గు ర్రాన్ని కొనుగోలు చేశాడు. కేవలం పందాల కోసమే గుర్రాలను కొనుగో లు చేస్తుండడం విశేషం. విశాఖపట్నానికి చెందిన గుర్రం యజమానులు త మ గుర్రాలకు అబ్బాస్, బ్లాకీ, మూనీ, రాణా గుర్రాలుగా పేర్లు పెట్టి పలు పోటీలలో నిలుపుతున్నారు. గుర్రపు పోటీల విజేతలకు వేలాది రూపాయల నగదు బహుమతులను అందచేస్తున్నారు. అలాగే పోటీల్లో పాల్గొనే ప్రతి ఒక్కరికి కొంత మొత్తాన్ని ప్రోత్సాహకంగానూ ఇస్తున్నారు. దీంతో ఈ పోటీలకు వచ్చే గుర్రాల సంఖ్య పెరుగుతోంది. ఔత్సాహికుల్లో ఆసక్తి కూడా అధికమవుతోంది.