కాసుల వేటలో అడవి ఖాళీ | wood smuggling | Sakshi
Sakshi News home page

కాసుల వేటలో అడవి ఖాళీ

Published Fri, Dec 27 2013 5:03 AM | Last Updated on Wed, Oct 3 2018 5:26 PM

wood smuggling

వినాయక్‌నగర్,న్యూస్‌లైన్:  కలప వ్యాపారుల స్వార్థానికి పచ్చని చెట్లు బలవుతున్నాయి. కాసుల కోసం కలప స్మగ్లర్లు పచ్చని చెట్లు నరికి వేయడంతో రోజురోజుకు అటవీ సంపద అంతరించిపోతోంది. దీంతో పెద్దపెద్ద వృక్షాలు కనుమరుగవుతున్నాయి. పర్యావరణ పరిరక్షణకు చర్యలు చేపట్టాల్సిన అధికారులు చూసిచూడనట్లుగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు ఉన్నా యి. దీంతో కలప స్మగ్లర్లు అడిందె ఆట పాడిందె పాట గా తయారైంది.అటవీశాఖలో క్షేత్రస్థాయి సిబ్బందితో చేతులు కలిపిన కలప స్మగ్లర్లు.. విలువైన టేకు,జిట్రేగి,వేప, తుమ్మ, వంటచెరుకు నరికి నగరాలకు తరలించి సొమ్ము చేసుకుం టున్నారు. అటవీశాఖ అధికారుల పర్యవేక్షణలో కలప దొరి కిన స్మగ్లర్లు మాత్రం పారిపోవడం పరిపాటుగా మా రింది. పలుమార్లు రిక్షాలు,సైకిళ్లు, ఆటోలు,లారీలు, అక్రమ కలప తో పట్టుబడ్డా.. నిందితులు మాత్రం పారిపోయారు.
 కేసులేవీ...
 ఈ మధ్యకాలంలో జిల్లాకేంద్రంలో పలుచోట్ల అక్రమంగా నిల్వచేసిన టేకు, కలప దుంగలు దొరికాయి. అయితే పట్టుబడ్డ కలప, కలప పట్టుబడిన స్థలం, ఇల్లు ఎవరిదని దర్యాప్తు చేసి కేసులు నమోదు చేసిన  దాఖలాలు మాత్రం కనబడవు. నిందితులను పట్టుకొని ఫారెస్టు యాక్టు కింద కేసులు నమోదు చేసి కోర్టులో హాజరు పరిచిన దాఖలాలను వేళ్లమీద లె క్కేయవ చ్చు. దీంతో అటవీ సంపదను దర్జాగా కొల్లగొట్టి స్మగ్లర్లు లక్షల్లో సంపాదిస్తున్నారు. బుధవారం నగరంలోని ముజాహిద్‌నగర్‌లో ఓపాత ఇంట్లో *80 వేల విలువ చేసే అక్రమంగా నిల్వచేసిన 22 టేకు దుంగలను అటవీశాఖ అధికారులు పక్కా సమాచారంతో పట్టుకున్నట్టు ప్రకటన  చేశారు. కలప ఎవరిది, ఇల్లు ఎవరిది అనేది మాత్రం దర్యాప్తు చేయక పోవడం శోచనీయం.  
 నిత్యం అక్రమ రవాణా...
 నిత్యం నగరానికి కాల్పోల్ గ్రామం వైపు నుంచి రిక్షాల్లో, ఆటోల్లో భారీగా వంటచెరుకు తరలిస్తున్నారు. అక్కడి అటవీ క్షేత్రస్థాయి సిబ్బంది అనుగ్రహం లేనిదే ఈ దందా నడవదని ఆరోపణలు వస్తున్నాయి. అంతేకాక బడాపహాడ్, లక్ష్మాపూర్ శివారు నుంచి టేకు సైజులు నిత్యం నగరంలోని బస్‌సాహెబ్‌పహాడ్, ధర్మపురిహిల్స్, మాలపల్లి, ముజహిద్‌నగర్ తదితర ప్రాంతాలకు రవాణా చేస్తున్నారు. అటవీ అధికారులు నిఘా ఎంత పటిష్టం చేసినా.. స్మగ్లర్లు మాత్రం అధికారుల కళ్లు కప్పి నగరానికి దర్జాగా కలప అక్రమ రవాణా చేస్తున్నారు. మల్లారం గండి అటవీ ప్రాంతం నుంచి నిత్యం తెల్లవారుజామున సైకిళ్లపై చాలామంది వంటచెరుకు, టేకు దుంగలు తెచ్చుకుంటున్నారు. ఈ దందాపై అధారపడి జీవిస్తున్న కుటుంబాలు నగరంలో వందల్లో ఉన్నాయంటే నమ్మశక్యం కాదు. ఏదిఏమైనా స్మగ్లర్ల చేతుల్లో అటవీ సంపద రోజురోజుకు అంతరించి పోతోంది. కంచె చేను మేసినట్లుగా అటవీ శాఖవారే స్మగ్లర్లకు అండగా నిలుస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. అటవీశాఖ ఉన్నతాధికారులు పట్టించుకొని అక్రమ కలప దందాపై దృష్టిసారించి అటవీ సంపదను రక్షించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement