బందరు పోర్టు బాధితులకు జగన్ మద్దతు
డిసెంబర్ 1న పోర్టు గ్రామాల్లో ప్రతిపక్ష నేత పర్యటన
సాక్షి, హైదరాబాద్: కృష్ణా జిల్లా పరిధిలో బందరు పోర్టు ఏర్పాటు పేరుతో ప్రభుత్వం బలవంతంగా చేపట్టిన భూసమీకరణ చర్యలకు వ్యతిరేకంగా బాధితుల పోరాటానికి వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మద్దతు ప్రకటించారు. ఈ పోర్టు కోసం ప్రభుత్వం 30 వేల ఎకరాలను రైతుల నుంచి బలవంతంగా సేకరిస్తోంది. ఈ చర్యలతో పేద రైతులు తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఏర్పడింది. దీంతో బాధితుల ఆందోళనకు అండగా నిలిచేందుకు ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ డిసెంబర్ 1న బాధిత గ్రామాల్లో పర్యటించనున్నారు. పోర్టు పరిసర గ్రామాలకు జగన్ వెళ్లి బాధితుల సమస్యలు తెలుసుకుంటారు.
నేడు సీఎంను కలవనున్న వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలు
వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు శుక్రవారం ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడును కలవనున్నారు. విజయవాడ క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రిని కలసి నియోజకవర్గాల అభివృద్ధికి సంబంధించిన నిధుల విషయంపై వైఎస్‌ఆర్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు చర్చించనున్నారు.