సాక్షి, సంగారెడ్డి: మహానేత, దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డికి మెతుకుసీమ ఘన నివాళి అర్పించింది. నాలుగో వర్ధంతి సందర్భంగా సోమవారం జిల్లా వ్యాప్తంగా కార్యక్రమాలు నిర్వహించారు. పార్టీలకు అతీతంగా నిర్వహించిన ఆయా సభల్లో పలువురు రాజన్న అమలు చేసిన సంక్షేమ పథకాలు, అభివృద్ధి పథకాలను స్మరించుకుని కొనియాడారు. జిల్లా వ్యాప్తంగా వైఎస్ విగ్రహాలకు క్షీరాభిషేకాలు జరిగాయి. ప్రభుత్వ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న రోగులకు పండ్లు, బ్రెడ్ల పంపిణీ చేశారు. వైఎస్సార్ కాంగ్రెస్, కాంగ్రెస్ పార్టీతో పాటు వైఎస్ అభిమానులు స్వచ్ఛందంగా వర్ధంతి కార్యక్రమాలు నిర్వహించారు. సంగారెడ్డిలోని వైఎస్సార్ సీపీ జిల్లా కార్యాలయంలో పార్టీ యువజన విభాగం జిల్లా కన్వీనర్ శ్రీధర్‌రెడ్డి ఆధ్వర్యంలో ఆ పార్టీ శ్రేణులు మహానేతకు నివాళి అర్పించారు. అనంతరం స్థానిక ఆస్పత్రిలో రోగులకు పండ్లు పంపిణీ చేశారు. సంగారెడ్డిలో నియోజకవర్గ సమన్వయకర్త దేశ్‌పాండే, పార్టీ నేత మనోజ్‌రెడ్డిల ఆధ్వర్యంలో కార్యకర్తలు వైఎస్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళి అర్పించారు.
బీహెచ్‌ఈఎల్‌లో 300 మంది నేత్ర దానం
బీహెచ్‌ఈఎల్‌లో పార్టీ నేత సతీష్ గౌడ్ ఆధ్వర్యంలో జరిగిన వర్ధంతి కార్యక్రమంలో మూ డు వందల మంది వైఎస్ అభిమానులు నేత్ర దానికి ముందుకు వచ్చారు. ఈ మేరకు ప త్రాలపై సంతకాలు చేశారు. పటాన్‌చెరులో కార్మిక విభాగం జిల్లా కన్వీనర్ నర్రా భిక్షపతి, మండల కన్వీనర్ నరేందర్‌రెడ్డి ఆధ్వర్యంలో స్థానిక ప్రభుత్వ ఆస్పత్రిలో రోగులకు పండ్లు పంపిణీ చేశారు. రాంచంద్రాపురంలో నియోజకవర్గ కన్వీనర్ మహిపాల్‌రెడ్డి ఆధ్వర్యంలో వైఎస్ చిత్ర పటానికి నివాళి అర్పించారు. గుమ్మడిదల పీహెచ్‌సీలో మాజీ ఎంపీటీసీ, వైఎస్సార్ సీపీ నేత విష్ణువర్దన్‌రెడ్డి ఆధ్వర్యంలో రోగులకు పండ్లు పంపిణీ చేశారు.
బాలసదన్‌లో కిట్ల పంపిణీ
నారాయణ్‌ఖేడ్‌లో స్థానిక సర్పంచ్ అప్పారావు షెట్కార్ ఆధ్వర్యంలో బాల సదనంలో చిన్నారులకు సబ్బులు, పేస్టులు, పౌడర్లు ఇతరాత్ర వస్తువులతో కూడిన కిట్లను పంపిణీ చేశారు. అంతకు ముందు వైఎస్ చిత్ర పటానికి నివాళి అర్పించారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ నియోజకవర్గ సమన్వయకర్త బిడెకన్నె హన్మంతు తదితరులు పాల్గొన్నారు.
జహీరాబాద్‌లోని వైఎస్సార్ సీపీ కార్యాలయంలో ఆ పార్టీ శ్రేణులు వైఎస్ చిత్ర పటానికి నివాళి అర్పించి స్థానిక ప్రభుత్వ ఆస్పత్రిలో రోగులకు పండ్లు పంపిణీ చేశారు.నియోజకవర్గ సమన్వయకర్త మాణిక్‌రావు, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు నర్సింహ్మ యాదవ్, మైనారిటీ సెల్ జిల్లా అధ్యక్షుడు ఎండీ ఫారూక్, జిల్లా అధికార ప్రతినిధి క్రిష్టఫర్‌లు పాల్గొన్నారు. ఝరాసంఘంలో జిల్లా స్టీరింగ్ కమిటీ సభ్యుడు బాబుకుమార్ ఆధ్వర్యంలో రోగులకు పండ్లు, బ్రెడ్లు పంపిణీ చేశారు.
జోగిపేటలో అందోల్ నియోజకవర్గ సమన్వయకర్త నల్లా సూర్యప్రకాష్, స్థానిక వైఎస్ విగ్రహానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. అనంతరం ప్రభుత్వ ఆస్పత్రిలో రోగులకు పండ్లు పంపిణీ చేశారు. వైఎస్సార్ సీపీ బీసీ సెల్ జిల్లా కన్వీనర్ డీజీ మల్లయ్య యాదవ్ పాల్గొన్నారు.
దుబ్బాకలో వైఎస్సార్‌సీపీ నేతలు అశోక్ గౌడ్, దేవిరెడ్డిల ఆధ్వర్యంలో నేతలు వైఎస్ చిత్రపటానికి నివాళి అర్పించి రోగులకు పండ్లు పంపిణీ చేశారు. మిరుదొడ్డి వైఎస్సార్‌సీపీ మండల కన్వీనర్ సురేష్ ఆధ్వర్యంలో వైఎస్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళి అర్పించారు.
నర్సాపూర్‌లో వైఎస్సార్ సీపీ జిల్లా వాణిజ్య విభాగం కన్వీనర్ పీ శ్రీధర్ గుప్తా ఆధ్వర్యంలో వైఎస్ విగ్రహానికి క్షీరాభిషేకం చేశారు. స్థానిక ప్రభుత్వ ఆస్పత్రిలో రోగులకు పండ్లు పంపిణీ చేశారు. కొల్చారం మండలం రాంపూర్‌లో గ్రామస్తులు స్వచ్ఛందంగా వైఎస్ విగ్రహానికి నివాళి అర్పించారు.
సిద్దిపేటలో వైఎస్సార్‌సీపీ పట్టణ కమిటీ అధ్యక్షుడు ఎజాస్ పటేల్ ఆధ్వర్యంలో రాజన్న చిత్రపటానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. నంగనూరులో మండల కన్వీనర్ ఇమ్రాన్ ఆధ్వర్యంలో వర్ధంతి కార్యక్రమం జరిగింది.
కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో..
నర్సాపూర్‌లో డీసీసీ ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్ గుప్తా, నర్సాపూర్ సర్పంచ్ రమణారావుల ఆధ్వర్యంలో వైఎస్ విగ్రహానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. కౌడిపల్లిలో కాంగ్రెస్ నేతలు వైఎస్ చిత్రపటానికి నివాళి అర్పించారు. తెల్లాపూర్‌లో కాంగ్రెస్ మండల అధ్యక్షుడు శ్రీశైలం యాదవ్ ఆధ్వర్యంలో వైఎస్ విగ్రహానికి నివాళి అర్పించారు. రాంచంద్రాపురం మండలం కొల్లూరులో ఉప సర్పంచ్ రాజు గౌడ్ నివాళి అర్పించారు. ములుగులో మండల కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి పూల పెంటయ్య ఆధ్వర్యంలో వైఎస్‌కు నివాళి అర్పించారు.
జిల్లావ్యాప్తంగా మహానేత నాలుగో వర్ధంతి
Published Tue, Sep 3 2013 12:07 AM | Last Updated on Sat, Jul 7 2018 2:48 PM
Advertisement
Advertisement