development schemes
-
నన్ను చూడొద్దు..ఎన్డీఏను చూడండి
‘గత 58 నెలల మీ బిడ్డ పాలనలో మీ ఇంటికి మంచి జరిగి ఉంటేనే ఓటు వేసి ఆశీర్వదించండి’. –బస్సు యాత్రలో ప్రజలకు విన్నవిస్తున్న సీఎం వైఎస్ జగన్ ‘నన్ను కాదు.. ఎన్డీఏను చూసి కూటమికి ఓటు వేయండి. కూటమిలో భాగస్వామికాని వైఎస్సార్సీపీకి రెండోసారి అవకాశం ఇవ్వడంలో అర్థం లేదు’. –ప్రజాగళం సభల్లో ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నటీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు మీ ఇంట్లో మంచి జరిగిందా.. లేదా? మంచి జరిగి ఉంటేనే నాకు ఓటు వేయండి: సీఎం జగన్ ఎన్నికల తొలి విడత ప్రచారంలో భాగంగా సీఎం వైఎస్ జగన్ మేమంతా సిద్ధం పేరుతో చేపట్టిన బస్సు యాత్రలో భాగంగా నిర్వహిస్తున్న బహిరంగ సభల్లో గత 58 నెలల పాలనలో సంక్షేమాభివృద్ధి పథకాలు.. సుపరిపాలన వల్ల చేసిన మంచిని వివరిస్తున్నారు. సంస్కరణలతో విద్య, వైద్య, వ్యవసాయ, పారిశ్రామిక రంగాల్లో రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో అగ్రభాగాన నిలపడం గురించి స్పష్టికరిస్తున్నారు. 2014 ఎన్నికల్లో బీజేపీ, జనసేనతో జట్టుకట్టి అధికారంలోకి వచ్చాక చంద్రబాబు చేసిన మోసాలు, అరాచకాలను ఎండగడుతున్నారు. 2019 ఎన్నికల్లో బీజేపీ, జనసేనతో వేరుపడిన చంద్రబాబు.. ఇప్పుడు మళ్లీ వాటితో కలిసి మోసం చేయడానికి వస్తున్నారని ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. మీ బిడ్డ పాలనలో మీ ఇంటికి మంచి జరిగి ఉంటేనే ఓటు వేసి ఆశీర్వదించాలని వినమ్రంగా కోరుతున్న సీఎం జగన్‌కు జనం అడుగడుగునా నీరాజనాలు పలుకుతున్నారు. సాక్షి, అమరావతి: ప్రజాగళం సభల్లో టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు ప్రజలకు చేస్తున్న విజ్ఞప్తిని పరిశీలిస్తే.. రాష్ట్రంలో 2014–19 మధ్య అధికారంలో ఉన్నప్పుడు ఆయన ప్రజలకు చేసిందేమీ లేదని అంగీకరించినట్లు స్పష్టమవుతోంది. 2014 ఎన్నికల్లో ఇచ్చిన హామీల్లో పది శాతం కూడా అమలు చేయకుండా ప్రజలను వంచించారు. ఇటు ప్రజలకు.. అటు రాష్ట్రానికి చేసిన మంచేమీ లేకపోవడంతో తన పరిపాలనను చూసి ఓటు వేయాలని అడిగే నైతికతను చంద్రబాబు కోల్పోయారు. అందుకే తన పరిపాలనను చూసి కాకుండా, ఎన్డీఏకు ఓటు వేయాలని చంద్రబాబు కోరుతుండటం చర్చనీయాంశమైంది. ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పొడిచి 1995లో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు.. మద్య నిషేధానికి మంగళం పాడి, రూ.2కే కిలో బియ్యాన్ని రూ.5.50కు పెంచేసి అప్పట్లో మోసం చేశారు. మొన్నటికి మొన్న.. విభజన నేపథ్యంలో 2014 ఎన్నికల్లో బీజేపీ, జనసేనతో జట్టు కట్టిన చంద్రబాబు.. 650కి పైగా హామీలిచ్చి కేవలం ఐదు లక్షల ఓట్ల తేడాతో అధికారంలోకి వచ్చారు. చంద్రబాబు నేతృత్వంలో 2014 జూన్ 8న కొలువుదీరిన సర్కార్ మాటలతో మాయ చేస్తూ పాలన సాగించింది. చంద్రబాబు, మోదీ, పవన్ కల్యాణ్ ఫొటోలతో, చంద్రబాబు సంతకం చేసి మరీ ఇంటింటికీ లేఖలు పంపి ఇచ్చిన ప్రధాన హామీల్లో రూ.87,612 కోట్ల వ్యవసాయ రుణాలను మాఫీ చేయకుండా వంచించారు. రూ.14,205 కోట్ల డ్వాక్రా రుణాలు మాఫీ చేయకుండా అక్క చెల్లెమ్మలను బాబు దగా చేశారు. ఇంటికో ఉద్యోగం లేదా నిరుద్యోగ భృతిగా నెలకు రూ.2 వేలు చొప్పున ఇస్తామని నమ్మబలికి యువతను మోసగించారు. ఆడపిల్ల పుడితే మహాలక్ష్మి పథకం కింద రూ.25 వేలు బ్యాంక్ అకౌంట్లో జమ చేస్తామని హామీ ఇచ్చి అమలు చేయకుండా వంచించారు. బీసీ సబ్ ప్లాన్ కింద ఏడాదికి రూ.పది వేల కోట్ల చొప్పున ఐదేళ్లలో రూ.50 వేల కోట్లు వ్యయం చేస్తామని చెప్పి, ఆనక మాట తప్పి బలహీన వర్గాలకు వెన్నుపోటు పొడిచారు. అర్హులందరికీ మూడు సెంట్ల స్థలం, పక్కా ఇళ్లు కట్టిస్తామని చెప్పి ఏ ఒక్కరికీ ఇంటి స్థలం ఇవ్వకుండా వంచించారు. పవర్ లూమ్స్, చేనేత రుణాలు మాఫీ చేయకుండా మోసం చేశారు. అరకొరగా ఇచ్చే సంక్షేమ పథకాల ఫలాలు దక్కాలంటే తమకు లంచాలు ఇవ్వాల్సిందేనంటూ నాడు జన్మభూమి కమిటీలు అరాచకం సృష్టించాయి. వీటన్నింటిని గుర్తించిన జనం.. 2019 ఎన్నికల్లో కేవలం 23 శాసనసభ స్థానాలకే టీడీపీని పరిమితం చేసి చంద్రబాబుకు విశ్వసనీయ లేదని చాటి చెప్పారు. పది నెలల క్రితం రాజమహేంద్రవరంలో నిర్వహించిన మహానాడులో బాబు ష్యూరిటీ – భవిష్యత్తుకు గ్యారంటీ పేరుతో సూపర్ సిక్స్ పథకాలంటూ ప్రకటించిన మినీ మేనిఫోస్టును జనం పట్టించుకోకపోవడం ద్వారా చంద్రబాబుకు విశ్వసనీయత లేదని మరోమారు నిరూపించారు. వీటన్నింటి వల్ల ఇప్పుడు తనను చూసి కాకుండా, ఎన్డీఏకు ఓట్లు వేయాలని ప్రజలను అభ్యరి్థంచడం ద్వారా తనకు విశ్వసనీయత లేదని చంద్రబాబు ఒప్పేసుకున్నట్లయిందని రాజకీయ పరిశీలకులు విశ్లేసిస్తున్నారు. విషయం లేకే బాబు విన్యాసాలు బీజేపీపై ప్రజల్లో వ్యతిరేకత ఉందని భావించి, గత ఎన్నికలకు ముందు ఎన్డీఏ నుంచి వేరుపడిన చంద్రబాబు.. ప్రధాని నరేంద్ర మోదీని వ్యక్తిత్వహననం చేస్తూ తిట్ల పురాణం అందుకున్నారు. ప్రభుత్వ వ్యతిరేక ఓటును చీల్చడం ద్వారా అధికారంలోకి రావాలనే నెపంతో పవన్ కళ్యాణ్‌ను వేరుగా పోటీ చేయించారు. కానీ.. ఇప్పుడు ప్రజా క్షేత్రంలో వైఎస్ జగన్‌ను ఒంటరిగా ఎదుర్కోవడం అసాధ్యమని గ్రహించి.. ఉనికి చాటుకోవడానికి బీజేపీ, జనసేనతో చంద్రబాబు మళ్లీ జట్టుకట్టారు. ప్రజా సంక్షేమం, రాష్ట్ర అభివృద్ధి కోసం ఎన్డీఏకు ఓటు వేయాలని అభ్యర్థిస్తూనే.. కూటమిలో భాగస్వామికాని వైఎస్సార్సీపీని రెండోసారి గెలిపించి చాన్స్ ఇవ్వడంలో అర్థం లేదంటూ విచిత్ర విన్యాసాలకు తెరతీశారు. తాను అధికారంలో ఉన్నప్పుడు కమీషన్ల కక్కుర్తితో పోలవరం నిర్మాణ బాధ్యతల కోసం ప్రత్యేక హోదాను 2016 సెపె్టంబరు 7న కేంద్రానికి తాకట్టు పెట్టారు. ప్రత్యేక ప్యాకేజీకి అంగీకరిస్తూ సంతకం చేశారు. ప్రత్యేక హోదా కంటే ప్యాకేజీతోనే రాష్ట్రానికి ప్రయోజనమంటూ బుకాయించారు. కమీషన్ల కోసం పోలవరంలో చంద్రబాబు విధ్వంసం సృష్టించారు. ఈ నేపథ్యంలో చంద్రబాబు పోలవరాన్ని కమీషన్ల కోసం ఏటీఎంగా మార్చుకున్నారని ప్రధాని మోదీ అప్పట్లో మండిపడటం ఎవరూ మరచిపోలేదు.నాడు కేంద్రానికి ప్రత్యేక హోదాను తాకట్టు పెట్టిన చంద్రబాబే.. ఇప్పుడు 22 మంది లోక్‌సభ సభ్యులు ఉన్న వైఎస్సార్సీపీ ప్రత్యేక హోదాను సాధించలేక పోయిందని ఆరోపించడం రాజకీయ పరిశీలకులను విస్మయానికి గురిచేస్తోంది. విషయం లేకే చంద్రబాబు ఇలాంటి విచిత్ర విన్యాసాలకు తెరతీశారని వ్యంగోక్తులు విసురుతున్నారు. -
కుప్పం టీడీపీ కోట కూలడానికి కారణం ఇదేనా?.. విశ్లేషకులు ఏం చెబుతున్నారు?
సాక్షి, అమరావతి: వెనుకబడిన వర్గాల(బీసీల)ను సమాజానికి వెన్నెముకలా తీర్చిదిద్దడమే వైఎస్సార్సీపీ లక్ష్యం’ అని 2019 ఫిబ్రవరి 17న ఏలూరులో నిర్వహించిన బీసీ గర్జనలో చెప్పిన మాటలను ఈ మూడున్నరేళ్లలో సీఎం వైఎస్ జగన్ ఆచరించి చూపారు. ఈ వర్గాల పిల్లల ఉన్నత చదువులకు అండగా నిలిచారు. వారి కుటుంబాలు పేదరికం నుంచి బయట పడేందుకు వినూత్న మార్గాల్లో కృషి చేశారు. ఫలితంగా బీసీలు అన్ని రంగాల్లో ప్రగతిపథం దిశగా వడివడిగా అడుగులు ముందుకు వేస్తున్నారు. చదవండి: 'నేనున్నాను'.. మీకేం కాదు సంక్షేమ పథకాల ద్వారా ఆర్థికంగా చేయూత, రాజ్యాధికారంలో సింహ భాగం వాటా.. విద్యా దీవెన, వసతి దీవెనలతో ఉన్నత విద్యా వంతులుగా తీర్చిదిద్దడం ద్వారా వెనుకబడిన వర్గాల ప్రజల(బీసీ)ను సమాజానికి వెన్నెముకగా మార్చే దిశగా మూడున్నరేళ్లుగా సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి చిత్తశుద్ధితో అడుగులు వేస్తున్నారని సామాజిక వేత్తలు ప్రశంసిస్తున్నారు. దేశంలో సామాజిక న్యాయం నినాదంతో అధికారంలోకి వచ్చిన ముఖ్యమంత్రులు సైతం ఇవ్వని రీతిలో సీఎం వైఎస్ జగన్ రాజ్యాధికారంలో బీసీ వర్గాలకు సింహభాగం వాటా ఇచ్చారని గుర్తు చేస్తున్నారు. సంక్షేమ పథకాల ద్వారా డీబీటీ రూపంలో మూడున్నరేళ్లలో రూ.1,77,585.51 కోట్లను పేదల ఖాతాల్లో జమ చేస్తే.. ఇందులో బీసీ వర్గాలకు చెందిన ప్రజలకు మాత్రమే రూ.85,915.06 కోట్లు ఇచ్చారని ప్రశంసిస్తున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియంను ప్రవేశపెట్టి అమ్మ ఒడి, విద్యా కానుక ఇచ్చి పిల్లలను బడులకు పంపేలా చేస్తున్నారని గుర్తు చేస్తున్నారు. ఈ చర్యలన్నీ బీసీలను సమాజానికి వెన్నెముకగా మార్చడానికి బాటలు వేస్తాయని స్పష్టం చేస్తున్నారు. చట్టం చేసి మరీ నామినేటెడ్ పదవులు ♦దేశ చరిత్రలో ఎక్కడా లేని రీతిలో రాష్ట్రంలో నామినేటెడ్ పదవులు, పనుల్లో 50 శాతం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు రిజర్వేషన్ చేసేలా సీఎం వైఎస్ జగన్ ఏకంగా చట్టం తెచ్చారు. ♦రాష్ట్రంలో 196 వ్యవసాయ మార్కెటింగ్ కమిటీ చైర్మన్ పదవుల్లో 76 అంటే 39 శాతం బీసీలకు ఇచ్చారు. ♦వివిధ ప్రభుత్వ కార్పొరేషన్లలో 137 చైర్మన్ పదవుల్లో 53 బీసీలకు ఇచ్చారు. బీసీలకు ప్రత్యేకంగా 56 కార్పొరేషన్లు ఏర్పాటు చేశారు. 137 కార్పొరేషన్లకు సంబంధించి మొత్తం 484 డైరెక్టర్ పదవుల్లో 201 పదవులు బీసీలకు (42 శాతం) ఇచ్చారు. పరిపాలనలో భాగస్వామ్యం సింహభాగం 1. ఎన్నికలకు ముందు 2019 ఫిబ్రవరి 17న ఏలూరులో వైఎస్సార్సీపీ బీసీ గర్జన నిర్వహించింది. ఈ సమావేశంలో తాము అధికారంలోకి వస్తే బీసీ వర్గాలకు చేసే మేలుపై బీసీ డిక్లరేషన్ రూపంలో వైఎస్ జగన్ విడుదల చేశారు. అధికారంలోకి వచ్చాక బీసీ డిక్లరేషన్‌లో ఇచ్చిన హామీల కంటే ఎక్కువగా ఆ వర్గాలకు ప్రయోజనం చేకూర్చారు. 2. 2019 ఎన్నికల్లో 50 శాతం ఓట్లు.. 151 శాసనసభ స్థానాలు.. 22 లోక్‌సభ స్థానాలతో వైఎస్సార్సీపీ చారిత్రక విజయాన్ని సాధించింది. 2019 మే 30న వైఎస్ జగన్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. 2019 జూన్ 8న ఏర్పాటు చేసిన మంత్రివర్గాన్ని ఈ ఏడాది ఏప్రిల్ 11న పునర్ వ్యవస్థీకరించారు. 25 మంది సభ్యులు ఉన్న మంత్రివర్గంలో ఏకంగా పది మంది బీసీలకు స్థానం కల్పించారు. ఆ వర్గానికి చెందిన బూడి ముత్యాలనాయుడును డిప్యూటీ సీఎంగా నియమించారు. విద్య, రెవెన్యూ, పౌర సరఫరాలు, వైద్యారోగ్యం వంటి కీలక శాఖలను ఆ వర్గాల వారికే అప్పగించారు. 3. శాసనసభ స్పీకర్‌గా బీసీ వర్గానికి చెందిన తమ్మినేని సీతారాంను నియమించారు. శాసనమండలిలో వైఎస్సార్సీపీకి 32 మంది సభ్యులు ఉంటే అందులో సింహభాగం బీసీలే. వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఎనిమిది రాజ్యసభ స్థానాలకు గాను, నలుగురు బీసీలను రాజ్యసభకు పంపారు. 4. స్థానిక సంస్థల్లో బీసీలకు 33 శాతం రిజర్వేషన్ కల్పించడంపై చంద్రబాబు టీడీపీ నేతలను హైకోర్టును ఆశ్రయించేలా పురిగొల్పారు. దీనిపై హైకోర్టు ఇచ్చిన తీర్పుతో బీసీలకు రిజర్వేషన్ 24 శాతానికి తగ్గిపోయింది. రిజర్వేషన్లు తగ్గినా అంతకంటే ఎక్కువ మంది బీసీలకు స్థానిక సంస్థల్లో అవకాశం కల్పిస్తానని హామీ ఇచ్చిన సీఎం.. దాన్ని ఆచరించి చూపి, పదవులు ఇచ్చారు. 5. పరిషత్ ఎన్నికల్లో 13 జిల్లా పరిషత్‌లను వైఎస్సార్సీపీ చేజిక్కించుకుంటే, అందులో తొమ్మిది జిల్లా పరిషత్ చైర్పర్సన్ పదవులను (70 శాతం) ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకే కేటాయించారు. ఇందులో సింహభాగం బీసీలకే అవకాశం కల్పించారు. 6. మండల పరిషత్ ఎన్నికల్లో 648 మండలాలకు గాను వైఎస్సార్సీపీ 635 మండల పరిషత్ అధ్యక్ష పదవులను దక్కించుకుంది. ఇందులో 67 శాతం పదవులను బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాలకే ఇచ్చారు. ఇందులో కూడా గరిష్టంగా బీసీలకే పదవులు దక్కాయి. 7. 13 కార్పొరేషన్లలో వైఎస్సార్సీపీ క్లీన్ స్వీప్ చేస్తే.. ఏడు చోట్ల మేయర్ పదవులు బీసీలకు ఇచ్చారు. మొత్తంగా మేయర్ పదవుల్లో 92 శాతం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాల వారికే ఇచ్చారు. ఇందులో బీసీలకు సింహభాగం ఇచ్చారు. 8. 87 మున్సిపాలిటీల్లో 84 మున్సిపాలిటీలను వైఎస్సార్సీపీ చేజిక్కించుకుంటే.. వాటి చైర్పర్సన్ పదవుల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు 73 శాతం ఇచ్చారు. ఇందులో బీసీలకు అధిక భాగం పదవులు ఇచ్చారు. వైఎస్సార్సీపీ వెంటే బీసీలు టీడీపీకి బీసీలే వెన్నెముక.. బీసీలు లేనిదే టీడీపీ లేదంటూ హామీలు ఇచ్చిన చంద్రబాబు.. ఆ వర్గాల వారి ఓట్లతో అధికారంలోకి వచ్చాక బీసీలకే వెన్నుపోటు పొడిచారు. 2014లో అధికారంలోకి వచ్చినప్పుడు మంత్రివర్గంలో కేవలం బీసీ వర్గాల నుంచి ఆరుగురికే అవకాశం కల్పించారు. అదే సమయంలో 11 మంది ఓసీలకు మంత్రివర్గంలో స్థానం కల్పించారు. 2014–19 మధ్య రాజ్యసభకు ఒక్క బీసీని కూడా చంద్రబాబు పంపలేదు. తమ హక్కులను పరిరక్షించాలని అడిగిన నాయీ బ్రాహ్మణులను తోకలు కత్తరిస్తానని.. తమ సమస్యలు పరిష్కరించాలని అర్థించిన మత్స్యకారులను తాట తీస్తానంటూ బెదిరించారు. తమ ఓట్లతో అధికారంలోకి వచ్చి.. అడుగడుగునా తమ ఆత్మగౌరవాన్ని దెబ్బ తీసిన చంద్రబాబుపై బీసీలు ఆగ్రహంతో ఉన్నారని ఆ వర్గాల నేతలు స్పష్టం చేస్తున్నారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడే చట్టసభల్లో జనాభా ప్రాతిపదికన బీసీలకు రిజర్వేషన్లు కల్పించాలని రాజ్యసభలో ప్రైవేటు బిల్లును వైఎస్సార్సీపీ ప్రవేశపెట్టడం.. అధికారంలోకి వచ్చాక బీసీల అభ్యున్నతికి సీఎం వైఎస్ జగన్ చిత్తశుద్ధితో కృషి చేస్తుండటంతో ఆ వర్గాల ప్రజలు వైఎస్సార్సీపీ వెంటే నడుస్తున్నారని రాజకీయ పరిశీలకులు స్పష్టం చేస్తున్నారు. దీనికి నిదర్శనమే పంచాయతీ, జిల్లా పరిషత్, మండల పరిషత్, మున్సిపల్.. తిరుపతి లోక్‌సభ, బద్వేలు, ఆత్మకూరు ఉప ఎన్నికలలో వైఎస్సార్సీపీ చారిత్రక విజయాలు సాధించడమని చెబుతున్నారు. బీసీల జనాభా అధికంగా ఉన్న కుప్పం కోట కూలడానికి సైతం ఇదే కారణమని విశ్లేషిస్తున్నారు. -
Andhra Pradesh: వికేంద్రీకరణే..!
సాక్షి, అమరావతి: మూడేళ్లుగా వైఎస్ జగన్ ప్రభుత్వం ప్రజాభ్యుదయమే లక్ష్యంగా తీసుకొచ్చిన పాలన సంస్కరణలు, వికేంద్రీకరణ దిశగా వేసిన అడుగుల గురించి నేడు అసెంబ్లీ వేదికగా చర్చించనుంది. వికేంద్రీకరణలో భాగంగా మూడు రాజధానులతోనే రాష్ట్ర సమగ్రాభివృద్ధి సాధ్యమని పునరుద్ఘాటించనుంది. సంక్షేమ, అభివృద్ధి పథకాల ద్వారా చేసిన మంచిని, అన్ని ప్రాంతాల అభివృద్ధిని కాంక్షిస్తూ తీసుకున్న నిర్ణయాలను, రాబోయే కాలంలో చేయనున్న మేలును, ప్రతిపక్షం తీరును మరోమారు ప్రజల దృష్టికి తీసుకెళ్లనుంది. కులాలు, మతాలు, వర్గాలు, పార్టీలకు అతీతంగా సాకారం చేసిన మహా సామాజిక విప్లవం గురించి మాట్లాడనుంది. కేబినెట్ నుంచి నామినేటెడ్ పదవుల వరకు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు సింహభాగం పదవులు ఇచ్చిన ఏకైక ప్రభుత్వం తమదేనని చాటనుంది. 2019 ఎన్నికల్లో 50 శాతానికిపైగా ఓట్లు.. 151 శాసనసభ స్థానాలు, 22 లోక్‌సభ స్థానాల్లో వైఎస్సార్సీపీకి ప్రజలు ఆఖండ విజయాన్ని చేకూర్చారు. 2019 మే 30న ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ బాధ్యతలు స్వీకరించాక.. ఎన్నికల మేనిఫెస్టో అమలు, అభివృద్ధి, సుపరిపాలనపై దృష్టి సారించారు. ఇప్పటికే 98.44 శాతం హామీలను అమలు చేసి.. ఎన్నికల మేనిఫెస్టోకు అసలైన నిర్వచనం చెప్పారు. గ్రామ, వార్డు సచివాలయాలను ఏర్పాటు చేసి.. ప్రతి 50 ఇళ్లకు ఒక వలంటీర్ చొప్పున వలంటీర్ల వ్యవస్థను ఏర్పాటు చేసి.. ప్రజల గుమ్మం వద్దకే ప్రభుత్వ సేవలు అందిస్తున్నారు. 1.30 లక్షల మందికి సచివాలయాల్లో ఉద్యోగాలు కల్పించారు. ఇటీవల వీరి ప్రొబేషన్ కూడా పూర్తి కావడంతో పూర్తి స్థాయిలో వేతనాలు ఇస్తున్నారు. ప్రజల సౌకర్యం, పరిపాలనా సౌలభ్యం కోసం 13 జిల్లాల స్థానంలో కొత్తగా 26 జిల్లాలను ఏర్పాటు చేసి పరిపాలనను వికేంద్రీకరించారు. సంక్షేమ పథకాల ద్వారా డీబీటీ (నగదు బదిలీ) రూపంలోనే లబ్ధిదారుల ఖాతాల్లో రూ.1.65 లక్షల కోట్లు జమ చేశారు. రాష్ట్రంలో 87 శాతం కుటుంబాలకు సంక్షేమ పథకాలను అందిస్తున్నారు. అక్కచెల్లెమ్మలకు అన్ని విధాలా ఆసరా 2014 ఎన్నికల సమయంలో చంద్రబాబు డ్వాక్రా రుణ మాఫీ హామీ ఇచ్చి, మహిళల ఓట్లు వేయించుకుని గద్దెనెక్కారు. ఆ తర్వాత ఆ హామీ గురించి పూర్తిగా విస్మరించారు. బాబు దెబ్బకు డ్వాక్రా సంఘాలన్నీ నిర్వీర్యమైపోయాయి. అప్పుల ఊబిలో కూరుకుపోయాయి. ఈ పరిస్థితిలో తన పాదయాత్రలో అక్కచెల్లెమ్మల కష్టాలు కళ్లారా చూసిన వైఎస్ జగన్ వారిని ఆదుకుంటానని హామీ ఇచ్చారు. అధికారంలోకి రాగానే ఇచ్చిన మాట మేరకు.. ఎన్నికల నాటి వరకు బ్యాంకుల్లో ఉన్న వారి అప్పులను నాలుగు విడతలుగా చెల్లిస్తూ వైఎస్సార్ ఆసరా పథకం అమలు చేశారు. దీనికి తోడు 45 ఏళ్ల వయసు దాటిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ మహిళలకు ఏటా రూ.18,750.. వరుసగా నాలుగేళ్లు ఇస్తూ వైఎస్సార్ చేయూత పథకానికి శ్రీకారం చుట్టారు. ఈ రెండు పథకాలతో పాటు ఇతరత్రా ప్రభుత్వ సాయం వల్ల మహిళలు తమ సొంత కాళ్లపై నిలబడేలా చిరు వ్యాపారాలను ప్రోత్సహిస్తూ.. కార్పొరేట్ కంపెనీల ద్వారా సహకారం అందిస్తూ పలు చర్యలు తీసుకున్నారు. పండుగలా వ్యవసాయం.. కాదనగలరా? చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వ్యవసాయ రంగాన్ని పూర్తిగా విస్మరించారు. ఒక దశలో వ్యవసాయం దండగ అని చెప్పారు. వైఎస్ జగన్ ముఖ్యమంత్రి కాగానే ‘బాబు మాటలు తప్పు’ అని నిరూపిస్తూ విప్లవాత్మక సంస్కరణలు, మార్పులు తీసుకొచ్చారు. రైతు భరోసా పథకంతో రైతన్నలకు పెట్టుబడి సాయం అందిస్తూ వస్తున్నారు. 10,750 ఆర్బీకే (రైతు భరోసా కేంద్రం)లు ఏర్పాటు చేసి రైతులకు విత్తనం మొదలు పంట కొనుగోలు వరకు అండగా నిలుస్తున్నారు. పంటకు నష్టం చేకూరితే లబ్ధి చేకూర్చడానికి ఈ–క్రాప్ ద్వారా భరోసా ఇస్తున్నారు. అన్ని ఆర్బీకేల్లోనూ పరికరాలు, యంత్రాలు అందుబాటులో ఉంచేలా చర్యలు తీసుకున్నారు. ఇందులో భాగంగా ఇప్పటికే 6,525 ఆర్బీకేల్లో పరికరాలు ఏర్పాటు చేశారు. 7.13 లక్షల మంది రైతులకు వ్యక్తిగత యంత్ర పరికరాలు అందజేసేలా కార్యాచరణ రూపొందించారు. కలెక్షన్ సెంటర్లు, కోల్డ్ రూమ్‌లు, గోదాముల నిర్మాణం సత్వరమే పూర్తి చేసేలా అడుగులు ముందుకు వేస్తున్నారు. మన పిల్లలు గ్లోబల్ స్టూడెంట్స్.. ‘పేద పిల్లలకు మనం ఇవ్వగలిగే ఆస్తి ఒక్క చదువు మాత్రమే. వారిని ఉన్నత చదువులు చదివిస్తే అది వారి తల రాత మారుస్తుంది’ అని గట్టిగా నమ్మిన సీఎం వైఎస్ జగన్ ఆ దిశగా విప్లవాత్మక పథకాలు, కార్యక్రమాల అమలుకు శ్రీకారం చుట్టారు. ఇందులో భాగంగా అమ్మ ఒడి, సంపూర్ణ పోషణ, గోరుముద్ద, విద్యా కానుక, మనబడి నాడు–నేడు, ఇంగ్లిష్ మీడియం, సీబీఎస్ఈ సిలబస్, సబ్జెక్ట్ టీచర్స్ కాన్సెప్ట్, బైజూస్‌తో ఒప్పందం, ఎనిమిదవ తరగతి పిల్లలకు ట్యాబ్‌ల పంపిణీ, డిజిటల్ క్లాస్ రూమ్‌లు, బై లింగువల్ టెక్టŠస్ బుక్స్ పంపిణీ, సునాయాసంగా బోధించేందుకు టీచర్లకు స్కిల్స్ అప్‌గ్రేడేషన్ ప్రొగ్రాం, ఉన్నత విద్యలో విద్యా దీవెన, వసతి దీవెన, కరిక్యులమ్‌లో మార్పులు చేపట్టారు. ఇలా వీటన్నింటి కోసం ఈ మూడేళ్లలో వైఎస్ జగన్ ప్రభుత్వం ఏకంగా రూ.53 వేల కోట్లు ఖర్చు చేస్తోంది. మన పిల్లలు ప్రపంచంతో పోటీ పడాలన్న లక్ష్యంతో అడుగులు ముందుకు వేస్తున్నారు. 2025లో సీబీఎస్ఈ బోర్డు పరీక్షలకు సిద్ధమయ్యేలా ఈ నవంబర్‌లో 8వ తరగతి విద్యార్థులు 4.72 లక్షల మందికి రూ.606.18 కోట్ల ఖర్చుతో బైజూస్ కంటెంట్‌తో కూడిన ట్యాబ్‌లు పంపిణీ చేస్తున్నారు. వీరికి విద్యను బోధించే 50,194 మంది టీచర్లకూ రూ.64.46 కోట్లతో ట్యాబ్‌లు ఇవ్వనున్నారు. మీ ఆరోగ్యం.. మా బాధ్యత ప్రభుత్వ ఆస్పత్రులను నాడు–నేడు కింద ఆధునికీకరించి.. మెరుగైన వైద్యం అందించే దిశగా పలు చర్యలు తీసుకున్నారు. ఆరోగ్యశ్రీ పథకంలో ఎవరూ ఊహించని విధంగా పలు మార్పులు చేశారు. వైద్య ప్రక్రియలను 3.100కు పైగా వైద్య ప్రక్రియలకు చికిత్స అందించేలా చర్యలు తీసుకున్నారు. కొత్తగా 16 మెడికల్ కళాశాలల ఏర్పాటుకు శ్రీకారం చుట్టారు. వైఎస్సార్ విలేజ్ క్లినిక్స్, పీహెచ్‌సీల ద్వారా కొత్తగా ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్‌్టను అమలు చేయడానికి అన్ని ఏర్పాట్లు చేశారు. తద్వారా గ్రామీణుల ముంగిటకు వైద్యాన్ని తీసుకెళ్లారు. ఆరోగ్యశ్రీ ద్వారా చికిత్స పొంది.. విశ్రాంతి తీసుకునే సమయంలో వైద్యుల సూచన మేరకు ఆరోగ్య ఆసరా పథకం కింద సాయం చేస్తున్నారు. ఉద్యోగ, ఉపాధి అవకాశాల దిశగా అడుగులు ఇన్ఫోసిస్, అసెంచర్, టెక్ మహీంద్రా, హెచ్‌సీఎల్ వంటి ఐటీ దిగ్గజ సంస్థలు రాష్ట్రంలో కొత్తగా కార్యాలయాలు ఏర్పాటు చేయడానికి సిద్ధమవుతున్నాయి. మరెన్నో చిన్న, మధ్య స్థాయి కంపెనీలు యూనిట్లు ఏర్పాటు చేయడానికి రంగం సిద్ధం చేసుకుంటున్నాయి. రాష్ట్రానికి చెందిన ఐటీ రంగ నిపుణులు ఉపాధి కోసం పొరుగు రాష్ట్రాలు, దేశాలకు వెళ్లకుండా ఇక్కడే ఉద్యోగం చేసుకునే అవకాశం కల్పించాలన్నది ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి లక్ష్యం. ఇందులో భాగంగా రాష్ట్రంలో ఐటీ రంగంలో పెట్టుబడులను ప్రోత్సహించే విధంగా చర్యలు తీసుకుంటున్నారు. రాష్ట్ర పారిశ్రామిక రంగంలో నూతన శకాన్ని లిఖిస్తూ రూ.1,26,622.23 కోట్ల విలువైన పెట్టుబడులకు రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక మండలి (ఎస్ఐపీబీ) ఇటీవల ఆమోదం తెలిపిన విషయం తెలిసిందే. ఒక్క గ్రీన్ ఎనర్జీలో రంగంలోనే రూ.81,043 కోట్ల పెట్టుబడులు రానున్నాయి. సత్యవీడు, కొప్పర్తి సెజ్‌లలోని పరిశ్రమల్లో లక్షలాది మంది యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాల కల్పనకు చర్యలు తీసుకున్నారు. నాటికి, నేటికి ఎంత తేడా! టీడీపీ సర్కార్ హయాంలో ఏ సంక్షేమ పథకం కింద లబ్ధి పొందాలన్నా.. జన్మభూమి కమిటీల చుట్టూ కాళ్లరిగేలా తిరగాల్సి వచ్చేది. లంచాలు ఇచ్చినా ప్రయోజనం చేకూర్చేవారు కాదని ప్రజలు నాటి రోజులు గుర్తు చేస్తున్నారు. ఇప్పుడు ఏ ఒక్కరి దగ్గరకు వెళ్లాల్సిన అవసరం లేకుండా.. ఏ ఒక్కరికీ ఒక్క రూపాయి లంచం ఇవ్వాల్సిన పని లేకుండా అర్హతే ప్రమాణికంగా ఇతర పార్టీలకు ఓట్లేసిన వారికి సైతం సంక్షేమ పథకాల ద్వారా ప్రయోజనం చేకూర్చుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రతి సచివాలయం పరిధిలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని నిర్వహించి.. ప్రతి ఇంటికీ వెళ్లి చేసిన మంచిని వివరించాలని సీఎం వైఎస్ జగన్ ఆదేశించారు. ఎమ్మెల్యేలు ఇలా ప్రజల మధ్యకు వెళ్లినప్పుడు వారు ఏవైనా సమస్యలు చెబితే వాటిని పరిష్కరించడానికి, అక్కడ ప్రాధాన్యత పనులను తక్షణమే చేపట్టడానికి రూ.20 లక్షలు చొప్పున నిధులు మంజూరు చేస్తున్నారు. అన్ని ప్రాంతాలూ అభివృద్ధి కావాలి రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజల ప్రయోజనాలతో పాటు అన్ని ప్రాంతాల సమగ్రాభివృద్ధిలో భాగంగా వికేంద్రీకరణ ద్వారా మూడు ప్రాంతాలను అభివృద్ధి చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా అమరావతిని శాసన రాజధానిగా, విశాఖను పరిపాలన రాజధానిగా, కర్నూలును న్యాయ రాజధానిగా చేయాలని భావిస్తున్న విషయం తెలిసిందే. అభివృద్ధితో పాటు పాలన వికేంద్రీకరణ దిశగా అడుగులు వేయాల్సిన ఆవశ్యకత గురించి వివరించనుంది. ఉమ్మడి రాష్ట్రంలో ఒక్క హైదరాబాద్‌ను మాత్రమే అభివృద్ధి చేయడంతో రాష్ట్ర విభజనతో మనకు ఎంతగా నష్టం జరిగిందో స్పష్టమవుతోంది. లక్షల సంఖ్యలో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కోల్పోవాల్సి వచ్చింది. ఇలాంటి పొరపాటు ఇకపై జరక్కుండా ఉండాలంటే రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేయడం అత్యంత ఆవస్యకం అనే విషయం గురించి పాలక పక్షం సభలో స్పషీ్టకరించనుంది. అభివృద్ధి అంతా ఒకే ప్రాంతంలో కేంద్రీకృతం అవ్వడం ద్వారా కలిగే చేటు గురించి ఉదాహరణలతో వివరించాలని నిర్ణయించింది. 9 గంటలకు అసెంబ్లీ గురువారం ఉదయం 9 గంటలకు అసెంబ్లీ, 10 గంటలకు శాసన మండలి సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ప్రశ్నోత్తరాలతో పాటు ఇటీవల మృతి చెందిన మాజీ సభ్యులకు సంతాప తీర్మానాలతో ఉభయ సభలు ప్రారంభం కానున్నాయి. అసెంబ్లీ, మండలి సమావేశాలు ఐదు రోజుల పాటు జరిగే అవకాశం ఉంది. ప్రశ్నోత్తరాల అనంతరం శాసన సభా వ్యవహరాల సలహా కమిటీ సమావేశమై, సమావేశాలను ఎన్ని రోజులు నిర్వహించాలి.. ఏయే అంశాలను చర్చకు చేపట్టాల్లో ఖరారు చేయనుంది. అసెంబ్లీ ఉప సభాపతిగా అధికార పక్షం ఇప్పటికే విజయనగరం ఎమ్మెల్యే కోలగట్ల వీరభద్రస్వామిని ప్రకటించిన విషయం తెలిసిందే. ఉప సభాపతి ఎన్నిక ఏ తేదీన చేపట్టాల్లో కూడా శాసన సభా వ్యవహారాల సలహా కమిటీలో నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. కాగా, అభివృద్ధి, పాలన వికేంద్రీకరణ, పరిపాలన సంస్కరణలపై గురువారం అసెంబ్లీలో అధికార పక్షం స్వల్ప కాలిక చర్చను చేపట్టనుంది. -
చెప్పాడంటే చేస్తాడంతే..!!
-
ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి
నరసాపురం రూరల్: వైఎస్సార్ సీపీ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని పార్టీ మండల కన్వీనర్ దొంగ మురళీకృష్ణ పిలుపునిచ్చారు. మండలంలోని వేములదీవి ఈస్ట్, వేములదీవి వెస్ట్, బియ్యపుతిప్ప గ్రామాల్లో పార్టీ నూతన గ్రామ కమిటీల నియామక కార్యక్రమాల్లో ఆయన పాల్గొని మాట్లాడారు. పార్టీ సమన్వయ కమిటీ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో నూతన కమిటీలను ప్రకటించారు. వేములదీవి ఈస్ట్ గ్రామ కమిటీ గౌరవాధ్యక్షునిగా తిరుమాని వెంకటేశ్వరరావు, అధ్యక్షులుగా తిరుమాని అర్జునరావు, ఉపాధ్యక్షునిగా తిరుమాని నాగేశ్వరరావు, ప్రధాన కార్యదర్శిగా దాసరి సువర్ణరాజు, కార్యదర్శులుగా తిరుమాని రాంబాబు, కొల్లాటి వెంకటేశ్వర్లు, సహయ కార్యదర్శిగా తిరుమాని కనకరాజులతో పాటు పలువురు సభ్యులుగా ఎంపికయ్యారు. అలాగే వేములదీవి వెస్ట్ పంచాయతీ గ్రామ కమిటీ గౌరవాధ్యక్షులుగా మురాల సోమయ్య, ఆకుల పెద్దిరాజు, తిరుమాని వెంకటేశ్వర్లు, జక్కంశెట్టి పల్లయ్య ఎంపిక కాగా అధ్యక్షునిగా మామిడిశెట్టి శ్రీనివాసరావు, ఉపాధ్యక్షులుగా ఒడుగు రాంబాబు, ఈవన నాగరాజు, కారిపల్లి దాసు, జి నర్శింహమూర్తి ఎంపికయ్యారు. బియ్యపుతిప్ప గ్రామ కమిటీ అధ్యక్షునిగా చింతా శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శిగా ఒడుగు శ్రీను, కార్యదర్శులుగా సంగాని ఆంజనేయులు, ఒడుగు వీర్రాజులతో పాటు పలువురు కార్యవర్గ సభ్యులుగా ఎంపికయ్యారు. వీరందరినీ పార్టీ సమన్వయ కమిటీ సభ్యులు అభినందించారు. -
6 లక్షల కోట్లపైనే!
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన ఆరేళ్లలో అభివృద్ధి, సంక్షేమ పథకాల కోసం ఖర్చయిన మొత్తం అక్షరాలా రూ. 6 లక్షల కోట్లపైనే. రాష్ట్రం ఏర్పడిన అనతి కాలంలోనే ప్రగతికి బాటలు పడడం, హైదరాబాద్ విశ్వనగరంగా రూపాంతరం చెందుతుండటంతో ఆ అభివృద్ధి ఫలాలు రాష్ట్ర ప్రభుత్వానికి కాసుల రూపంలో కలిసొచ్చాయి. దీంతో 2016–17లోనే రాష్ట్ర ప్రభుత్వ రాబడులు రూ. లక్ష కోట్లు దాటాయి. ప్రభుత్వం కూడా మిగులు బడ్జెట్ గురించి ఆలోచన చేయకుండా రాబడులను దాదాపు పూర్తిగా అభివృద్ధి, సంక్షేమ పథకాలకు ఖర్చు చేయడంతో ఇప్పటివరకు రూ. 6.35 లక్షల కోట్లకుపైగా ఖర్చయింది. సంవత్సరాలవారీగా పరిశీలిస్తే 2014–15లో రూ. 61,840 కోట్లు ఖర్చుకాగా ఆ తర్వాతి ఏడాది రూ. 90 వేల కోట్లు దాటింది. ఇక మూడో ఏడాది నుంచి రూ. లక్ష కోట్లు దాటిన ప్రభుత్వ ఖర్చు ప్రస్తుత ఏడాదికి వచ్చే సరికి రూ. 1.42 లక్షల కోట్లకు చేరింది. అంటే ఆరేళ్లలో రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక పరపతి 100 శాతంకన్నా ఎక్కువకు చేరిందన్నమాట. గత ఆరేళ్లలో రూ. 6.6 లక్షల కోట్ల రాబడులు రాగా అందులో 96 శాతం మేర అంటే రూ. 6.3 లక్షల కోట్లను ప్రభుత్వం అభివృద్ధి, సంక్షేమ పథకాలకు ఖర్చు పెట్టింది. 2011 జనాభా లెక్కల ఆధారంగా ఈ ఖర్చు ప్రతి వ్యక్తిపై రూ. 1.81 లక్షలకుపైగా కావడం విశేషం. -
చిరునవ్వుల తెలంగాణ కేసీఆర్ విజన్
సాక్షి, హైదరాబాద్/ సిద్దిపేటజోన్: రైతులు, వారి కుటుంబాలను సంతోషంగా ఉంచే లక్ష్యంతోనే ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనావిధానం సాగిస్తున్నారని మాజీ మంత్రి తన్నీరు హరీశ్‌రావు అన్నారు. ప్రజలు చిరునవ్వుల తెలంగాణలో ఉండే రోజులు రానున్నాయని.. అదే విజన్‌తో కేసీఆర్ పనిచేస్తున్నారని చెప్పారు. రాబోయే రోజుల్లో తెలంగాణ అన్నిరంగాల్లో అభివృద్ధి జరిగి దేశానికి గొప్ప నమూనాగా నిలుస్తుందని అన్నారు. తెలంగాణ రాష్ట్ర సమితి ఎన్ఆర్ఐ శాఖ ఆధ్వర్యంలో అమెరికాలోని ఫ్లోరిడా రాష్ట్రం ట్యాంపా సిటీలో ఇటీవల నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనంలో హరీశ్‌రావు ముఖ్య అతిథిగా ప్రసంగించారు. ఇంకా హరీశ్ మాట్లాడుతూ ‘తెలంగాణ ఉద్యమం జరిగే సమయంలో 2010లో నేను అమెరికాకు వచ్చాను. పది రోజుల పాటు 14 రాష్ట్రాల్లో నిర్వహించిన బతుకమ్మ సంబరాల్లో పాల్గొన్నాను. తెలంగాణ రాష్ట్రం వస్తుందని అప్పుడు అనుకున్నాం. అదే సాకారమైంది. వచ్చే రెండేళ్లలో రైతులు పడే కష్టాలు పోతాయి. వారి కళ్లలో సంతోషాన్ని చూస్తాం. ఒకప్పుడు భారతదేశంలో అభివృద్ధి అంటే పశ్చిమబెంగాల్ అనేవారు. అభివృద్ధి, సంక్షేమంలో ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం దేశానికి ఆదర్శంగా మారింది. నిరంతర కరెంటు సరఫరా చేస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ. మిషన్ కాకతీయ, కాళేశ్వరం, పాలమూరు ప్రాజెక్టులతో కోటి ఎకరాలకు సాగు నీరు ఇవ్వాలన్నది సీఎం కేసీఆర్ లక్ష్యం. రైతుబంధు, రైతు భీమా, ఎరువులు విత్తనాల పంపిణీ , మార్కెటింగ్ వ్యవస్థ, ఉచితంగా కరెంటు ఇస్తూ రైతులకు ఆత్మవిశ్వాసాన్ని నింపింది. కేసీఆర్ ప్రభుత్వం రైతుల జీవితాలకు భరోసానిచ్చింది. మొక్క పెరిగి ఫలాన్ని ఇవ్వడానికి కొంత సమయం పడుతుంది. వ్యవసాయరంగమే కాదు విద్య, వైద్యం, విద్యుత్... అన్ని రంగాల్లో ప్రగతి సాధించే దిశగా ప్రభుత్వం ముందుకు పోతోంది.అప్పుడు తెలంగాణ ఉద్యమంలో ఎన్ఆర్ఐలు కీలకంగా పని చేశారు. టీఆర్ఎస్కు మీ సహకారం మరువలేనిది. అమెరికాలో ఎన్ఆర్ల ఆతిథ్యం, ఆత్మీయత తెలంగాణలోనే ఉన్నట్టు అనిపిస్తోంది. చాలా సంతోషంగా ఉంది’ అని హరీశ్‌రావు అన్నారు. ఐటీ నిపుణులు కూడా వ్యవసాయం వైపు.. అమెరికా వచ్చి ఇంజనీర్, డాక్టర్ ఉద్యోగాలు చేసే రోజులు చూశాం. ఈ వృత్తిలో కొనసాగుతున్న వారు ఇప్పుడు వ్యవసాయం పై ఆసక్తి చూపుతున్నారు. ఒకప్పుడు రైతు అంటే చిన్న చూపు ఉండేది. ఇప్పుడు రైతు అంటే గౌరవం పెరుగుతోంది. ఐటీని వృత్తిగా ఎంచుకున్న వారు కూడా వ్యవసాయాన్ని ఎంచుకునే పరిస్థితులు వచ్చే నాలుగేళ్లలో రాబోతున్నాయి’అని హరీశ్‌రావు ఆశాభావం వ్యక్తం చేశారు. హరీశ్‌రావు ఘన ఆత్మీయ సన్మానం ట్యాంపాసిటీలో మూడు గంటల పాటు జరిగిన ఆత్మీయ సమ్మేళనంలో తెలంగాణ వాసులు హరీశ్‌రావును ఘనంగా సన్మానించారు. సుమారు 300మంది ఒక్కొక్కరుగా హరీశ్‌ను కలిసి ఆత్మీయంగా పలకరించి అభినందించారు. తెలంగాణ సంప్రదాయాల ప్రకారం మహిళలు బోట్టు పెట్టి హరీశ్‌రావుకు మంగళ హారతులతో స్వాగతం పలికారు. అనంతరం ఎన్ఆర్ఐల ఆధ్వర్యంలో ఆయనను ఘనంగా సన్మానించారు. ముఖ్యంగా సిద్దిపేట ప్రాంతానికి చెందిన బళ్ల రాజేందర్, విఠల శశికాంత్‌శర్మ, సుధాకర్, కిషోర్‌లు హరీశ్‌రావును సన్మానించారు. -
సంగారెడ్డిలో ఇంటింటికీ భగీరథ నల్లాలు ఏర్పాటు
-
ప్రాంతీయ పార్టీలతో అభివృద్ధి జరగదు
కుటుంబ పార్టీల పట్ల జాగ్రత్తగా ఉండాలి: లక్ష్మణ్ సాక్షి, హైదరాబాద్: ప్రాంతీయ పార్టీల వల్ల రాష్ట్రాభివృద్ధి జరగదని, కేంద్ర ప్రభుత్వ ప్రజా సంక్షేమ, అభివృద్ధి పథకాలు సక్రమంగా అమలు కావని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కె.లక్ష్మణ్ అన్నారు. ప్రాంతీయ పార్టీలకు ప్రజాసంక్షేమం కంటే కుటుంబ సంక్షేమమే ముఖ్యమన్నారు. యూపీలో సమాజ్‌వాదీ ప్రభుత్వం కుటుంబ కలహాలతో బజారుకెక్కిందన్నారు. కుటుంబ పార్టీలు ఎక్కడున్నా అదే జరుగుతుందని, ప్రజలు జాగురుకతతో ఉండాల్సిన అవసరం ఉందన్నారు. హైదరాబాద్‌లో మంత్రి కేటీఆర్ వంద రోజుల ప్రణాళిక... రూ.వంద కోట్ల స్వాహాకు దారితీసిందన్నారు. నగరంలో చిన్న వాన వచ్చినా నదుల మాదిరిగా పరిస్థితి తయారవుతోందన్నారు. మంగళవారం పార్టీ కార్యాలయంలో లక్ష్మణ్ సమక్షంలో పలువురు టీడీపీ, ఇతర పార్టీల నాయకులు, కార్యకర్తలు బీజేపీలో చేరారు. ఈ సందర్భంగా లక్ష్మణ్ మాట్లాడుతూ... ప్రధాని మోదీ ఒక్కరోజు కూడా సెలవు తీసుకోకుండా పనిచేస్తుంటే, సీఎం కేసీఆర్ మాత్రం సచివాలయానికి రారని, ఫామ్‌హౌస్, క్యాంప్ ఆఫీసుల నుంచే పాలన సాగిస్తున్నారని విమర్శించారు. కేంద్రం రాష్ట్రానికి 85 వేల ఇళ్లు కేటాయించినా, టీఆర్ఎస్ ప్రభుత్వం డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు, కేజీ టూ పీజీ విద్య, దళితులకు 3 ఎకరాలు తదితర హామీలు కాగితాలకే పరిమితమయ్యాయని విమర్శించారు. ఫీజు రీయింబర్స్మెంట్ రూ.3,060 కోట్లు, ఆరోగ్యశ్రీ రూ.430 కోటల బకాయిలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతుంటే వాస్తు పేరిట కొత్త సెక్రటేరియట్ భవనాలకు రూ.350 కోట్లు వెచ్చించడం ఎంత వరకు సబబని ప్రశ్నించారు. శ్వాస ఫౌండేషన్ రూపొందించిన ‘స్వచ్ఛ దివాళి-సేప్ దివాళి’ పోస్టర్‌ను ఆయన ఆవిష్కరించారు. -
31న నెల్లూరు జిల్లాలో సీఎం పర్యటన
నెల్లూరు(పొగతోట): సీఎం చంద్రబాబునాయుడు ఈ నెల 31న జిల్లాలో పర్యటించనున్నారు. జిల్లా పర్యటనలో సీఎం పలు అభివృద్ధి పథకాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు. వాస్తవానికి ఈ నెల 20వ తేదీన సీఎం జిల్లాలో పర్యటించాల్సి ఉండగా, వివిధ కారణాలతో వాయిదా పడింది. సీఎం పర్యటనకు సంబంధించిన మినిట్ టు మినిట్ రావాల్సి ఉంది. -
అభివృద్ధి పథకాలకు ఆద్యుడు సంజీవయ్య
భారతదేశంలో కెల్లా ముఖ్యమంత్రి పదవి నిర్వహించిన వారిలోను, అఖిల భారత్ కాంగ్రెస్ అధ్యక్ష పదవి నలంకరించిన వారిలోనూ అతిపిన్న వయస్కుడు దామోదరం సంజీవయ్య. ఒక హరిజనుడు రాష్ర్టంలో ముఖ్యమంత్రి కావడం, అఖిల భారత కాంగ్రెస్ అధ్యక్షుడు కావడం దేశ చరిత్రలో సంజీవయ్యతోనే మొదలైంది. ఆయన అనేక కష్టాలకోర్చి పట్టుదలతో చదువుకుని ఎదిగివచ్చారు. ఉమ్మడి మద్రాసు రాష్ర్టంలో రాజాజీ మంత్రి వర్గంలో చేరే నాటికి ఆయన వయసు 31 ఏళ్ళు మాత్రమే. 1950లోనే 29వ ఏట పార్లమెంటుకు ఎంపికై ఏడాది పాటు సభ్యుడిగా వ్యవహరించారు. 1952లో జరిగిన సాధారణ ఎన్నికలలో మద్రాసు శాసన సభకు కర్నూలు రిజర్వుడ్ సీటు నుండి కాంగ్రెస్ అభ్యర్థిగా గెలుపొంది రాజగోపాలాచారి ప్రభుత్వంలో సహకారశాఖకు మంత్రిత్వం వహించారు. 1953లో టంగుటూరి ప్రకాశం పంతులు గారి మంత్రి వర్గంలో కూడా సాంఘిక సంక్షేమ, ప్రజారోగ్య శాఖల మంత్రిగా పనిచేశారు. 1955 మధ్యంతర ఎన్నికలలో ఎమ్మిగ నూరు నుండి ఎన్నికై బెజవాడ గోపాలరెడ్డి మంత్రి వర్గంలో రవాణా, సహకార శాఖల మంత్రిగా, రాష్ట్రావతరణ (1956) జరిగిన తదుపరి నీలం సంజీవరెడ్డి మంత్రి వర్గంలో స్థానిక సంస్థలు, కార్మికశాఖల మంత్రిగా పనిచేశారు. 1960లో ఆంధ్రప్రదేశ్ చరిత్రలో తొలిసారిగా దళితుడైన దామోదరం సంజీవయ్య ముఖ్యమంత్రి కావడం దేశంలోనే ఒక సంచలనం. 1960 జనవరి 11వ తేదీన పదవీ ప్రమాణ స్వీకారం చేసేనాటికి ఆయన వయసు 38 ఏళ్లు మాత్రమే. అప్పటికే మంత్రిగా 8 ఏళ్ళ అనుభవం ఉన్న ఆయన ముఖ్యమంత్రిగా పనిచేసింది కేవలం (1960-1962) రెండేళ్ళ స్వల్పకాలమే అయినా సామాజికాభ్యుదయ కార్యక్రమాలను చేపట్టారు. ఆనాడు ఆయన చేపట్టిన పలు విధానాలు ముందు తరాలకు మార్గదర్శకాలైనాయి. పులిచింతల ప్రాజెక్టుకు శంకుస్థాపన చేసింది వీరే. అవినీతి నిరోధక శాఖల ఏర్పాటు, వృద్ధాప్య పెన్షన్లు, కార్మికులకు బోనస్ ఇచ్చే పద్ధతికి వీరే ఆద్యులు. ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో భూసంస్కరణలను కట్టుదిట్టంగా అమలు చేసి ఆరులక్షల ఎకరాల భూమిని నిరుపేదలకు పంచిపెట్టారు. చట్టాలను సమన్వయ పర్చడానికి ‘లా కమిషన్’ను ఏర్పాటు చేశారు. ప్రభుత్వ కార్యాలయాల్లో తెలుగు లోనే విధిగా ఉత్తరప్రత్యుత్తరాలు జరగాలని ఉత్తర్వులు జారీచేశారు. పరిశ్రమాభివృద్ధి కోసం భారీ పరిశ్రమలు, లఘుపరిశ్రమల విభాగాలు, గనుల అభివృద్ధి కోసం మూడు కార్పొరేషన్లను స్వతంత్ర ప్రతిపత్తి హోదాలో ఏర్పాటు చేశారు. అప్పటి వరకు వేరుగా ఉన్న హైదరాబాద్, సికింద్రాబాదు కార్పొరేషన్లను ఏకం చేసి ‘గ్రేటర్ హైదరాబాద్ (జీహెచ్ఎంసీ) కార్పొరేషన్’ గా రూపొందించారు. 1962లో జరిగిన ఎన్నికల్లో కోడుమూరు నుండి ఎంపికైనా ముఖ్యమంత్రి పదవికి పోటీ చేయలేదు. సంజీవరెడ్డి ముఖ్య మంత్రి అయ్యారు. తర్వాత నెహ్రూ జాతీయ కాంగ్రెస్ పదవిని సంజీవయ్యకు కట్టబెట్టారు. సంజీవయ్యను రెండేళ్ళు దాటి ముఖ్య మంత్రిగా అంగీకరించలేకపోయిన సమాజం మనది. ఆయన కేంద్రమంత్రిగా కూడా పనిచేశారు. 1967లో జరిగిన పార్లమెంటు ఎన్నికల్లో ఓడిపోయి ఆపై రాజ్యసభ సభ్యుడిగా కొనసాగారు. శ్రీమతి ఇందిరాగాంధీ, లాల్‌బహదూర్‌శాస్త్రిల మంత్రి వర్గాల్లో కూడా పనిచేశారు. దామోదరం సంజీవయ్య స్వయంగా కవి, సాహితీప్రియుడు, నటుడు. కాలేజి రోజుల్లోనే ‘కృష్ణలీలలు’లో పద్యాలు రాశారు. భీష్మజననం, శశిరేఖాపరిణయం, గయోపాఖ్యానం వంటి నాట కాలు కొన్నింటికి పద్యాలు వాశారు. సంజీవయ్య కందం ఎంత తేలికగా చెప్పగలరో, ఆటవెలదిని అంత తియ్యగా అల్లగలరు. ప్రసిద్ధి నటులచే ప్రదర్శనలిప్పించారు. తానుగా స్వయంగా ‘‘షాజహాన్ నాటకంలో’’ షాజహాన్ పాత్రను అద్భుతంగా పోషించినట్లు వినికిడి. ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో ఆయన అధ్యక్షతలోనే అఖిలభారత తెలుగు రచయితల మహాసభ మొదటిసారిగా హైదరాబాద్‌లో జరిగినది. ఆనాటి భారత ఉప రాష్ర్టపతి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ ఈ మహాసభలను ప్రారంభించారు. అప్పటి కేరళ గవర్నర్ బూర్గుల రామకృష్ణారావు, కేంద్రమంత్రి బెజవాడ గోపాలరెడ్డి వంటి వారు ఈ మహాసభల్లో పాల్గొని సంజీవయ్య కృషిని అభినందించారు. ఆయన స్వయంగా వేదాలు, భారత, భాగవత, రామాయణాది గ్రంథాలను అధ్యయనం చేసి ఉండటం ఆ రోజుల్లో అంత సామాన్య విషయంకాదు. నేటి భారత రాజకీయ పరిస్థితుల్లో షెడ్యూల్ కులాలు, ఇతర వెనుకబడిన తరగతుల వారి జీవన పరిస్థితులు మెరుగు పడాలంటే, ప్రధాని, ముఖ్యమంత్రుల పదవులు కనీసం శతాబ్దం పాటైనాఈ వర్గాలకు రిజర్వేషన్ చేయాలి. యుగయుగాలు బాధలకు, అవమానాలకు గురైన ఈ వర్గాలకు ఆపాటి రిజర్వేషన్ రాజ్యాంగ బద్దంగా కల్పించడాన్ని అన్ని రాజకీయ పార్టీలు నిజాయితీతో ముందుకు వస్తేనే అసలుసిసలైన సామాజిక న్యాయం జరుగుతుంది. రాజాకీయ పార్టీలు మాటలుగాక, చేతల ద్వారా తమ చిత్తశుద్దిని నిరూపించుకోవాలి. దేశంలో మార్పును నిజంగా కోరుకునే వారు, బడుగుల ఆత్మగౌరవం కాపాడుతామనే వారు, బడుగులకు రాజ్యాధికారం కట్టబెడతామనేవారు తమ బడుగుల మెజారిటీ, వారిదే అధారిటీ అనేవారు ప్రధానమంత్రి, ముఖ్యమంత్రి పదవుల రిజర్వేషన్‌కు అంగీకరిస్తేనే వారి అంకితభావానికి అర్దం, పరమార్ధం ఉంటాయి. దళితులు తాము భారతీయులమని సగర్వంగా చెప్పుకునే రోజుల కోసం ఎదురుచూస్తున్నారు. రాజ్యాంగాన్ని సవరించి ప్రధానమంత్రి, ముఖ్యమంత్రి పదవులను రిజర్వేషన్ కిందకు తీసుకురావాలి. దళితులకు, తాము దళితులమనే భావన నుంచి దూరం చేయాలి. ప్రస్తుత సామాజిక పరిస్థితులు వారిని వేధిస్తున్నాయి. కుల వ్యవస్థను తొలగించడానికి ఆరున్నర దశాబ్దాల్లో జరిగినది శూన్యం. చట్టపరంగా సమానహక్కులు వున్న ఈ చట్టాలు అమలుకు నోచుకోనులేదు. సామాజిక న్యాయానికి కట్టుబడివు న్నామని గొప్పలు చెప్పుకునే పాత్రలు ఈ దశగా ఆలోచించవల్సిన తరుణం ఆసన్నమైంది. ఉద్యమాలకు తావులేని విధంగా రాజకీయ పార్టీలు స్పందించాలి. దామోదరం సంజీవయ్య 1921 ఫిబ్రవరి 14న కర్నూలు జిల్లా పెద్దపాడు గ్రామంలో (కర్నూలుకు 8 కి.మీ. దూరం) మాలదాసరులైన మునెయ్య, సుంకలమ్మ దంపతులకు కడపటి (5వ) సంతానంగా జన్మించారు. తల్లిదండ్రులు సంగీతం, కళాత్మక సాంప్రదాయ కుటుంబ నేపథ్యము కలిగియుండుట వలన ఆయన నావి జీవతంలో సాహితీ, కళల రంగాలపట్లా ఆసక్తి కలగటానికి ప్రేరణ కలిగిందాయనకు. కుల వివక్షత ఎంత తీవ్రంగా ఉన్నప్పటికీ సమాజంలో తాను ఉన్నతస్థ్థితికి ఎదగాలనే పట్టుదల ఉంటే ఏదైనా సాధ్యపడుతుందని సంజీవయ్య నిరూపించారు. ప్రతి పదవిలోను ఆయన రాణించారు. ఎన్నో పదవులలో ఎంతో కాలంపాటు కొనసాగినప్పటికీ ఆయన నిర్దనుడే. ఏదో ఒక ప్రాంతమునకు ఒక వర్గమునకు చెందిన వ్యక్తిగాదు. రాజకీయ రంగంలో అతి చిన్నవయసులో అత్యున్నత శిఖరాలను అందుకుని ప్రజాసేవాయే పరమావదిగా, నిస్వార్ధపరునిగా స్వలాభపేక్ష లేకుండా ప్రజల మనిషిగా ఎదిగిన దామోదరం సంజీవయ్య లాంటి జనాదరణ కలిగిన దళిత నేత నేడు సీమాంధ్ర రాజకీయాలకు కేంద్ర బిందువుగా కావాలి. (నేడు దామోదరం సంజీవయ్య 95వ జయంతి) వ్యాసకర్త విశ్రాంత ఉద్యోగి, భారత ప్రభుత్వ అణుఇంధన సంస్థ మొబైల్ : 80081 89979 - వి. సర్వేశ్వరరావు -
ఎక్కడివక్కడే!
ఎన్నికల కోడ్‌తో నిలిచిన పథకాలు ఇన్నాళ్లూ అధికారుల అలసత్వంతో నత్తనడకే.. అనుమతి కోసం ఎన్నికల కమిషన్‌కు లేఖలు అక్కడ ఓకే అంటేనే ముందడుగు వరంగల్ : ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి పథకాల అమలులో అధికారులు ఇంతకాలం చూపిన నిర్లక్ష్యం జిల్లా ప్రజలకు పెనుశాపంగా మారింది. అధికారుల అలసత్వానికి తాజాగా వరంగల్ లోక్‌సభ ఉప ఎన్నిక కోడ్ తోడైంది. ఈ ఏడాది జనవరిలో కడియం శ్రీహరి ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన రోజు నుంచి ఏ క్షణాన్నైనా వరంగల్ ఎంపీ స్థానానికి ఉప ఎన్నిక వస్తుందనే విషయం అందరికీ తెలుసు. ఇంత స్పష్టత ఉన్నా ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలులో అధికారులు నిర్లక్ష్యంగానే వ్యవహరించారు. తీరా ఎన్నికల నిర్వహణ షెడ్యూల్ వెల్లడైన తర్వాత తమ శాఖల పరిధిలో పథకాలను ఎలా కొనసాగించాలనే విషయంలో హైరానా పడుతున్నారు. పథకాలను కొనసాగించాలా, వద్దా అనే విషయంపై వివరణ కోరుతూ ఎన్నికల సంఘానికి లేఖలు రాస్తున్నారు. ఎన్నికల సంఘం నుంచి సానుకూల స్పందన వస్తే సరే... లేకుంటే లబ్ధిదారుల పరిస్థితి ఏమిటన్నది అర్థం కావడం లేదు. అధికారులు చేసిన నిర్వాకానికి ఇప్పుడు అర్హులైన తాము ఇబ్బంది పడాల్సిన పరిస్థితి వచ్చిందని దరఖాస్తుదారులు అంటున్నారు. అధికారుల నిర్లక్ష్యం కారణంగా అమలులో జాప్యమైన కొన్ని సంక్షేమ పథకాల పరిస్థితి... ఎస్సీ స్టడీ సర్కిల్... జిల్లాలో దళిత అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో ఎస్సీ కేటగిరీ విద్యార్థులకు గ్రూప్స్ పోటీ పరీక్షలపై శిక్షణ ఇచ్చేందుకు రాష్ట్రంలోనే రెండో శిక్షణ కేంద్రాన్ని జిల్లాలో ఏర్పాటు చే యాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీని కోసం దళిత అ భివృద్ధి శాఖ డెరైక్టరు స్వయంగా జిల్లాకు వచ్చి భవనాన్ని పరిశీలించగా.. పలువురు అభ్యర్థులు దరఖాస్తు కూడా చేసుకున్నారు. అలాగే, స్టడీ సెంటర్ డెరైక్టర్ పో స్టు కోసం అధికారులు ఇటీవలే నోటిఫికేషన్ ఇచ్చారు. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు ప్రవేశ అర్హత పరీక్షలు నిర్వహించడంతో పాటు గత నెల మొదటి వారంలోనే స్టడీ సెంటర్ ప్రారంభించాల్సి ఉంది. అరుుతే, అధికారు ల నిర్లక్ష్యం కారణంగా పనులు సకాలంలో పూర్తికాలేదు. కొత్త కార్యక్రమం కావడంతో ఎన్నికల నియమావళి పే రు చెప్పి పనులు నిలిపివేశారు. ఎన్నికల కోడ్ విషయం ముందే తెలిసినా అధికారులు పట్టించుకోకపోవడతో... గ్రూప్స్ పరీక్షల కోచింగ్ కోసం వేచి చూస్తున్న పేద వి ద్యార్ధుల పరిస్థితి ఆగమ్యగోచరంగా మారింది. అనుమ తి కోసం ఎన్నికల కమిషన్‌కు లేఖ రాశామని.. అక్కడి నుంచి వచ్చే సమాధానం ఆధారంగా మిగిలిన పనులు పూర్తి చేస్తామని దళిత అభివృద్ధి శాఖ డీడీ శంకర్ తెలిపారు. కార్పొరేషన్ రుణాలు... ఎస్సీ కార్పొరేషన్ నుంచి కొత్తగా రుణాల మంజూరుపై ఇటీవలే జిల్లా కలెక్టర్ ప్రకటన చేశారు. 80 శాతం సబ్సిడీతో కొన్ని రకాల రుణాలు ఇవ్వనున్నట్లు వెల్లడించడం తో అర్హులు చాలా మంది సంతోషపడ్డారు. వీరిలో కొం దరు ఇప్పటికే బ్యాంకర్లతో ఒప్పందాలు చేసుకున్నా రు. కోడ్ ప్రభావంతో ఎస్సీ కార్పొరేషన్ రుణాల మం జూరు ప్రక్రియ డిసెంబర్ వరకు వాయిదా పడింది. రుణాలు అందుతాయని ఆశించిన వారు ఇప్పుడు రెం డు నెలల పాటు ఎదురుచూడాల్సిన పరిస్థితి వచ్చింది. మరోవైపు బీసీ కార్పొరేషన్ నుంచి ఇప్పటివరకు రుణాలకు సంబంధించి ప్రభుత్వం కొత్తగా ప్రకటించిన రాయితీల విషయం అధికారులు వెల్లడించకపోగా.. ఆయూ వర్గాలు కూడా ఎన్నికల పూర్తయ్యే వరకు వేచి చూడాల్సిందే. అరుుతే, పాత మంజూరీలు సైతం కోడ్ పూర్తయిన తర్వాతే ఉంటాయని అధికారులు తెలిపారు. అయ్యో ‘దీపం’... అర్హులైన పేదలకు కట్టెల పొయ్యి ఇబ్బందులను తొలగించే దీపం వంట గ్యాస్ కనెక్షన్ల పథకం అమలు అధికారుల నిర్లక్ష్యానికి నిదర్శనంగా మారింది. పథకం మంజూరై మూడు నెలలవుతున్నా ఇప్పటికీ అమలుకు నోచుకోని పరిస్థితి. దీపం పథకం కింద జిల్లాలోని 12 నియోజకవర్గాలకు మొత్తం 60 వేల కనెక్షన్లు మంజూరు కాగా.. ఇప్పటి వరకు పది వేల మంది లబ్ధిదారులనే ఎంపిక చేశారు. అంతేకాకుండా లబ్ధిదారుల ఎంపిక గడువును ఎప్పటికప్పుడు పొడిగిస్తుండగా.. ఇప్పుడు ఏకంగా ఎంపిక ప్రక్రియకే బ్రేక్ పడింది. భూ పంపిణీ... రాష్ట్రప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న భూపంపిణీ కార్యక్రమం జిల్లాలో మంచిగానే సాగుతోంది. ఈ పథకం అమలులో మన జిల్లా మూడో స్థానంలో నిలవగా.. ప్రస్తుతం 500 ఎకరాల వరకు భూమి పంపిణీకి సిద్ధంగా ఉంది. వారంలో చివరి దశ పనులు పూర్తయి పంపిణీ చేయూల్సి ఉండగా.. ప్రస్తుతం ఎన్నికల కోడ్ అడ్డంకిగా మారింది. ఈ విషయంలో అధికారులు ముందుగానే స్పందిస్తే బాగుండేదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. -
అరచేతిలో ఆస్తులు
- కబ్జా కాకుండా జీహెచ్ఎంసీ చర్యలు - టాబ్లెట్ పీసీల్లో వివరాలు - అభివృద్ధి పథకాల సమాచారం నిక్షిప్తం సాక్షి, సిటీబ్యూరో: కోట్లాది రూపాయల ఆస్తులున్నా... వివరాలు లేవు. ఏయే ప్రాంతాల్లో.. ఏయే షాపింగ్ కాంప్లెక్స్‌లలో ఎవరు ఉంటున్నారో తెలియదు. ఎన్ని ఖాళీ స్థలాలు?... ఎంత విస్తీర్ణంలో ఉన్నాయో... ఎంత మేరకు లీజులో ఉన్నాయో తెలియదు. ఏ పార్కు కబ్జాకు గురైందో సమా చారం లేదు ... ఇదీ ఘనత వహించిన జీహెచ్ఎంసీ పరిస్థితి. ఈ నేపథ్యంలో ఇప్పటికే మాయమైన ఆస్తులను గుర్తించే సంగతి అటుంచి... కనీసం ఉన్న వాటినైనా కాపాడుకునేందుకు .. ప్రస్తుతం చేపడుతున్న వివిధ పనుల వివరాలు అందుబాటులో ఉంచేందుకు చర్యలు చేపట్టాలని అధికారులు యోచిస్తున్నారు. దీని కోసం 500 టాబ్లెట్ పీసీలను కొనుగోలు చేస్తున్నారు. ఆస్తుల వివరాలను ఫొటోలతో సహా వీటిలో నిక్షిప్తం చేయనున్నారు. తద్వారా ఏయే ఆస్తులున్నాయి? దేనికోసం వినియోగిస్తున్నారు? ప్రస్తుతం వాటి పరిస్థితి ఎలా ఉందన్న సమాచారం అధికారులకు అందుబాటులో ఉంటుంది. ఎప్పుడైనా కబ్జాకు గురైనా... ఇతర అవసరాలకు దారి మళ్లించినా తెలుసుకునే వీలుంటుంది. దీంతోపాటు జీహెచ్ఎంసీ చేపట్టనున్న వివిధ ప్రాజెక్టుల వివరాలు సైతం వీటిలో పొందుపరిచే యోచనలో ఉన్నారు. సామర్థ్యాన్ని పరిశీలించేందుకు... ఇటీవల జీహెచ్ఎంసీ వివిధ పనులకు శ్రీకారం చుడుతున్న సంగతి తెలిసిందే. వీటిలో మోడల్ మార్కెట్లు, మల్టీ పర్పస్ ఫంక్షన్ హాళ్లు, ఫుట్ ఓవర్ బ్రిడ్జిలు (ఎఫ్‌ఓబీలు), బస్‌బేలు, శ్మశాన వాటికలు, చెరువుల సుందరీకరణ, కొత్త పార్కులు ఉన్నాయి. హరిత హారంలో భాగంగా యాభై లక్షల మొక్కలు నాటనున్నారు. ఈ వివరాలు అందుబాటులో ఉండేందుకు టాబ్లెట్ పీసీలు ఉపయోగపడతాయని భావిస్తున్నారు. ప్రయోగాత్మకంగా వాటి పనితీరును పరిశీలించేందుకు.. జీహెచ్ఎంసీ అవసరాలకు వాటి సామర్ధ్యం సరిపోతుందో లేదో తెలుసుకునేందుకు తొలుత 30 టాబ్లెట్లను తీసుకున్నారు. పనితీరును బట్టి మిగతావి తీసుకుంటారు. స్థలాలపై సర్వే నగరంలోని వివిధ ప్రాంతాల్లో జీహెచ్ఎంసీకి అత్యంత విలువైన ఆస్తులెన్నో ఉన్నాయి. అధికారుల నిర్లక్ష్యం, రికార్డులు గల్లంతు కావడం వంటి కారణాలతో జీహెచ్ఎంసీ వద్ద ప్రస్తుతం ఆ వివరాలు లేవు. గతంలో ఈ దిశగా కొంత కసరత్తు చేసిన అధికారులు నానా తంటాలు పడి 272 ఆస్తులు లీజులో ఉన్నట్లు గుర్తించారు. వాటిలోనూ 104 ఆస్తుల (1.20 లక్షల చదరపు గజాలు) సమాచారమే రికార్డుల్లో ఉంది. మిగతా వాటికి సంబంధించిన వివరాల్లేవు. వాస్తవంగా ఇప్పుడవి ఎవరి అజమాయిషీలో ఉన్నాయో... ఏ అవసరాలకు వినియోగిస్తున్నారో తెలియదు. అధికారుల అంచనాల మేరకుజీహెచ్ఎంసీ ఆస్తులు 1500 దాకా ఉంటాయి. కానీ.. అవి ఎక్కడున్నాయో.. ఎవరి అధీనంలో ఉన్నాయో తెలియడం లేదు. జీహెచ్ఎంసీ పరిధిలోని ఖాళీ స్థలాలపై సర్వే చివరి దశలో ఉంది. వీటి చుట్టూ ప్రహరీలు నిర్మించనున్నారు. ఆ వివరాలు టాబ్లెట్ పీసీల్లో ఉంచాలని భావిస్తున్నారు. స్థల పరిమాణాన్ని బట్టి వాటిలో వివిధ సదుపాయాలు కల్పించనున్నారు. -
సంక్షోభం
నిధుల్లేక పడకేసిన సంక్షేమ అభివృద్ధి పథకాలు ఉపాధిహామీ కూలీలకు రూ.12 కోట్ల మేర బకాయి ఫీజు రీయింబర్స్మెంట్ అందక విద్యార్థుల ఆందోళన బకాయిలు చెల్లించకపోవడంతో చేతులెత్తేసిన కాంట్రాక్టర్లు సాక్షి ప్రతినిధి, తిరుపతి: నిధుల్లేక సంక్షేమాభివృద్ధి పథకాలు పడకేశాయి. ఫీజు రీయింబర్స్మెంట్ అందక విద్యార్థులు.. ఉపాధిహామీ వేతనాలు అందక కూలీలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. చేసిన పనులకు బిల్లులు చెల్లించకపోవడంతో కాంట్రాక్టర్లు చేతులెత్తేశారు. బకాయిలు చెల్లించడానికే ప్రభుత్వం నిధులను సమకూర్చకపోవడంతో కొత్త పనులను ప్రారంభించేందుకు అధికార యంత్రాంగం సాహసించకపోవడం గమనార్హం. బడ్జెట్లో కేటాయించిన నిధులను నిర్దేశించిన సమయంలో విడుదల చేస్తే సంక్షేమాభివృద్ధి పథకాలు ఫలితాలను ఇస్తాయి. కేటాయించిన నిధులను సకాలంలో విడుదల చేయకపోతే అటు ప్రజలు.. ఇటు ప్రభుత్వంపై మోయలేని భారాన్ని మోపుతాయడానికి జిల్లాలో నెలకొన్న పరిస్థితులే అందుకు తార్కాణం. మహాత్మాగాంధీ గ్రామీణ ఉపాధిహామీ కింద పనులు చేసిన కూలీలకు రెం డున్నర నెలలుగా బిల్లులు చెల్లించడం లేదు. 4.89 లక్షల మందికి రూ.12 కోట్లకుపైగా బకాయిలు చెల్లించాలి. రెక్కాడితేగానీ డొక్కాడని కూలీలు వేతనాలు అందకపోవడంతో తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. 2013-14 విద్యా సంవత్సరానికి సంబంధించిన ఫీజు రీయింబర్స్మెంట్ కూడా విద్యార్థులకు అందలేదు. రూ.75 కోట్లకుపైగా ఫీజు రీయింబర్స్మెంట్ నిధులను ప్రభుత్వం విడుదల చేయాలి. కానీ.. ప్రభుత్వం నిధులు ఇవ్వకపోవడంతో కొన్ని ప్రైవేటు విద్యాసంస్థలు విద్యార్థులను వేధిస్తున్నాయి. తక్షణమే ఫీజు చెల్లించాలని అల్టిమేటం జారీచేస్తుండడంతో విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు. వర్షాభావ పరిస్థితుల వల్ల జిల్లాలో తీవ్ర తాగునీటి ఎద్దడి నెలకొంది. తాగునీటి ఎద్దడి నివారణకు ప్రభుత్వం అత్తెసరు నిధులను విడుదల చేస్తోంది. గ్రామీణ ప్రాంతాల్లో తాగునీటి సమస్య పరిష్కరించడానికి కాంట్రాక్టర్లు చేసిన పనులకు రూ.11 కోట్ల మేర బిల్లులను ఆర్డబ్ల్యూఎస్ విభాగం చెల్లించాల్సి ఉంది. బకాయిలు చెల్లించకపోవడంతో కాంట్రాక్టర్లు చేతులెత్తేస్తున్నారు. జిల్లాలో పంచాయతీ రాజ్, రహదారులు భవనాల శాఖలనూ నిధుల కొరత వేధిస్తోంది. కొత్త పనులు ప్రారంభించడం మాట దేవుడెరుగు.. బకాయిలు చెల్లించడానికి కూడా నిధుల్లేవని ఆ శాఖల అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రెండు శాఖల పరిధిలోనూ కాంట్రాక్టర్లకు రూ.32కోట్ల మేర బకాయిలు చెల్లించాల్సి ఉంది. బకాయిలు చెల్లిస్తేనే పనులు చేస్తామని కాంట్రాక్టర్లు ఇప్పటికే అల్టిమేటం జారీచేయడం గమనార్హం. సాగునీటి ప్రాజెక్టులకూ నిధుల కొరత అడ్డంకిగా మారింది. హంద్రీ-నీవా కాంట్రాక్టర్లకు రూ.16 కోట్లు, గాలేరు-నగరి కాంట్రాక్టర్లకు రూ.13 కోట్లు, తెలుగుగంగ కాంట్రాక్టర్లకు రూ.8.50 కోట్ల మేర బకాయిలు చెల్లించాల్సి ఉంది. బకాయిలు చెల్లించకపోవడంతో కాంట్రాక్టర్లు పనులు నిలిపేశారు. ఇది ఆ ప్రాజెక్టు అంచనా వ్యయం పెరగడానికి దారితీస్తుందని ఆ శాఖ వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులనూ ప్రభుత్వం వేధిస్తోంది. వడ్డీ వ్యాపారుల వద్ద అప్పులు తీసుకుని నిరుపేదలు ఇళ్లను నిర్మించుకున్నారు. ప్రభుత్వం బిల్లులు చెల్లిస్తే అప్పులు తీర్చుదామనుకున్న నిరుపేదల ఆశలను ప్రభుత్వం అడియాశలు చేసింది. ఇళ్లను నిర్మించుకున్న పేదలకు చెల్లించాల్సిన రూ.16 కోట్లను చెల్లించకుండా దాటవేస్తూ వస్తుండటం గమనార్హం. -
సమగ్ర సర్వేపై విస్తృత ప్రచారం
‘గులాబీ’ల ఆధ్వర్యంలో కార్యక్రమాలు 11న గ్రామాల్లో ర్యాలీలు, సభలు 12న మండల కేంద్రాల్లో సమావేశాలు 16న విద్యార్థులచే ర్యాలీలు టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు టి.రవీందర్రావు హన్మకొండ సిటీ : సంక్షేమ, అభివృద్ధి పథకాల అమలుకు దోహదపడే సమగ్ర సర్వేపై టీఆర్ఎస్ తరఫున విస్తృత ప్రచారం చేయనున్నట్లు ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు తక్కళ్లపల్లి రవీందర్రావు తెలిపారు. హన్మకొండలోని టీఆర్ఎస్ కార్యాలయంలో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. సంక్షేమ పథకాలు అర్హులకు చేరాలనే లక్ష్యంతోపాటు తెలంగాణ సమగ్రాభివృద్ధి కోసం ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు సమగ్ర సర్వేకు నిర్ణయం తీసుకున్నారని చెప్పారు. ఈ మేరకు ఈ నెల 19న జరిగే సమగ్ర సర్వేలో అందరూ పాల్గొనాలని పిలుపునిచ్చా రు. రాజకీయాలు, కులమతాలకు అతీతంగా రాష్ట్ర అభివృద్ధికి అందరూ కృషిచేయూలన్నారు. అనంతరం సర్వే పై ప్రజలకు అవగాహన కల్పించేందు కు టీఆర్ఎస్ తరఫున నిర్వహించనున్న ప్రచార కార్యక్రమానికి సంబంధించి షెడ్యూల్‌ను విడుదల చేశారు. ఈ నెల 11న టీఆర్ఎస్ గ్రామ శాఖల అధ్వర్యంలో గ్రామాల్లో ర్యాలీ నిర్వహించనున్నట్లు వెల్లడించారు. అదేరోజు గ్రామ నడిబొడ్డున బహిరంగ సమావేశం నిర్వహించి సర్వే ప్రాధాన్యాన్ని వివరిస్తామన్నారు. 12న ఉదయం 11 గంటలకు మండల కేంద్రాల్లో సమావేశాలు, 16న పాఠశాలల విద్యార్థులతో గ్రామాలు, మండల కేంద్రాలు, పట్టణాలు, నగరాల్లో ర్యాలీలు నిర్వహించి విస్తృత ప్రచారం చేయనున్నట్లు చెప్పారు. 17 పార్టీ జిల్లా సమావేశం నిర్వహించే అవకాశం ఉందని, దీనిపై తుది నిర్ణయం తర్వాత ప్రకటిస్తామన్నారు. వారి విమర్శలు అర్థం లేనివి... రాష్ట్ర ప్రభుత్వంపై పీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య, బీజేపీ రాష్ట్ర, జిల్లా నాయకులు అర్థం పర్థం లేని విమర్శ లు చేస్తున్నారని... అవాకులు, చెవాకు లు పెలుతున్నారని రవీందర్రావు ధ్వ జమెత్తారు. రాజకీయ అవినీతి, దళారులు లేని ప్రజాపాలన జరగాలని కేసీఆర్ కోరుకుంటున్నారన్నారు. విద్యుత్ ప్రాజెక్టులన్ని సీమాంధ్రలో ఉన్నాయ ని, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విద్యుత్ ఇవ్వకుండా అడ్డంకులు సృష్టిస్తోందని మండిపడ్డారు. ఇలాంటి పరిస్థితుల్లో ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యవసాయ అవసరాలకు విద్యుత్ కొనుగోలు చేయాలని నిర్ణయం తీసుకొన్నారని తెలిపారు. విద్యుత్ సరఫరా లోపంపై ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా ప్రజలకు వివరించారని, దీన్ని అర్థం చేసుకోవాలన్నారు. మూడేళ్లలో 24 గంటల విద్యుత్ సరఫరా జరిగేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందన్నారు. ఎయిమ్స్ అస్పత్రి స్థలాన్ని పరిశీలించాలని జిల్లా కలెక్టర్‌ను ప్రభుత్వం అదేశించిందని తెలిపారు. సమావేశంలో టీఆర్ఎస్ నేతలు నాయకులు భీరవెల్లి భరత్‌కుమార్‌రెడ్డి, లింగంపల్లి కిషన్‌రావు, మార్నేని రవీందర్రావు, ఇండ్ల నాగేశ్వర్రావు, గైనేని రాజన్, సంపత్, అంజయ్య, జయరాజ్, పీఆర్‌రెడ్డి, జోరిక రమేశ్, చాగంటి రమేశ్, నయూమొద్దీన్ పాల్గొన్నారు. -
అన్నింటా ఏపీ సర్కారు ఆంక్షలు
హైదరాబాద్: సర్కారు ప్రాధాన్యత ఇస్తున్న అభివృద్ధి పథకాలకు అవసరమైన నిధుల కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆర్థిక ఆంక్షలు విధించనుంది. పలు శాఖల్లో వివిధ రంగాల వ్యయంపై అనేకరకాల ఆంక్షలను విధిస్తూ ఆర్థిక శాఖ త్వరలో ఉత్తర్వులు జారీ చేయనుంది. మంత్రులకు కూడా ఈ ఆంక్షలు వర్తించనున్నారుు. మంత్రులైనా, అధికారులైనా విమానాల్లో ఇకపై ఎకానమీ క్లాస్‌లోనే ప్రయాణించాలని ఆదేశించనున్నారు. వీలైనంత మేర ప్రణాళికేతర వ్యయాన్ని తగ్గించాల్సిందిగా ఏపీ ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు శాఖ అధికారులను ఆదేశించారు. ప్రణాళికేతర వ్యయం తగ్గింపు, పొదుపు చర్యలపై మంత్రి మంగళవారం అధికారులతో సమీక్షించారు. పొదుపు చర్యల్లో భాగంగా తీసుకోవాల్సిన చర్యలను వివరించారు. ఈ మేరకు అధికారులు చేసిన ప్రతిపాదనలకు యనమల ఆమోదం తెలిపారు. ముఖ్యమంత్రి ఆమోదం లభించగానే ఆర్థిక శాఖ ఆంక్షల ఉత్తర్వులను జారీ చేయనుంది. కొత్తగా ఔట్ సోర్సింగ్ నియామకాలు చేపట్టరాదని, వీలైతే ఉన్న ఔట్సోర్సింగ్ సిబ్బందిని కూడా తగ్గించేయాలనే నిర్ణయం తీసుకున్నారు. అన్ని ప్రభుత్వ శాఖలు, యూనివర్సిటీలు, గ్రాంట్ ఇన్ ఎయిడ్ సంస్థలకు ఈ ఆంక్షలు వర్తింప చేయనున్నారు. -
చూద్దాంలే!
అభివృద్ధి పథకాలకు నిన్న మొన్నటి వరకు ఎన్నికల కోడ్ అడ్డంకిగా మారింది. ఆ ప్రక్రియ ముగిసినా ఇప్పటికీ అధికారుల్లో అదే నిర్లక్ష్యం కనిపిస్తోంది. దాదాపు 20 రోజులు గడుస్తున్నా.. పాలనను పరుగెత్తించలేని పరిస్థితి నెలకొంది. కొత్త ప్రభుత్వం ఏర్పాటు కానున్న నేపథ్యంలో జిల్లా ఉన్నతాధికారులు మొదలు కింది స్థాయి సిబ్బందిలో వేచి చూసే ధోరణి కనిపిస్తోంది. ప్రాథమ్యాలు.. పథకాలు.. పనితీరు.. ఆలోచనా ధోరణి.. పాత పథకాలపై స్పందన.. కొత్త పథకాల అమలు.. తదితరాలపై తలెత్తుతున్న ప్రశ్నల నేపథ్యంలో వీరంతా ఆచితూచి అడుగులేస్తున్నారు. రాష్ట్ర విభజన కూడా ఇందుకు కారణమవుతోంది. ఖరీఫ్ సీజన్ ప్రారంభమైన వ్యవసాయ శాఖలో నిర్లక్ష్యం కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. ఇప్పటికే స్పష్టమైన ప్రణాళికతో సిద్ధం కావాల్సి ఉన్నా ఆ ఊసే కరువైంది. విత్తన రాయితీ అంశం మాత్రమే కాస్త కొలిక్కి వచ్చింది. రైతులకు రాయితీపై అందజేసే వ్యవసాయ యంత్ర పరికరాలు.. ఇతర పథకాలపైనా ఎలాంటి నిర్ణయం వెలువడని పరిస్థితి. ఉద్యాన శాఖలో కూరగాయల విత్తనాలు అందజేసేందుకు సిద్ధమైనా మిగిలిన అంశాలపై నిర్ణయం వెలువడాల్సి ఉంది. పంట రుణాల విషయంలోనూ స్పష్టత కొరవడింది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ శాఖల్లో సంక్షేమ పథకాలపై కార్యాచరణ ప్రణాళిక అటకెక్కింది. జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థలో బ్యాంకు లింకేజీ.. రాజీవ్ యువ కిరణాలు.. స్త్రీనిధి.. బాల బడులు.. బీమా పథకాల లక్ష్యం నిర్దేశించకపోవడం గందరగోళానికి తావిస్తోంది. అన్ని శాఖల్లోనూ అధికారులు చేతులెత్తేసి కొత్త సర్కారు నిర్ణయంపైనే భారమేయడం గమనార్హం. గ్రామాల్లో కొత్తగా చేపట్టాల్సిన పనుల విషయంలోనూ అధికారులు ముందడుగు వేయలేకపోతున్నారు. ఆయా ప్రాంతాల్లో కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలు ఏమంటారు? ప్రతిపక్ష శాసనసభ్యుడు ఉన్నచోట అధికార పార్టీ ఇన్చార్జి అభిప్రాయం తెలుసుకుని మసలుకునే ఆలోచన అధికారుల్లో వ్యక్తమవుతోంది. ఈలోగా బదిలీలు చోటు చేసుకునే అవకాశం ఉండటంతో.. కొన్నాళ్లు ఆగితే కొత్తగా వచ్చే అధికారి చూసుకుంటారనే భావన కనిపిస్తోంది. పంచాయతీరాజ్.. గ్రామీణ నీటి సరఫరా విభాగం.. పురపాలక సంఘాల్లోనూ ఎక్కడ పనులు అక్కడ నిలిచిపోయాయి. ఉపాధి హామీ పథకం అమలులో చోటుచేసుకునే మార్పులపైనా చర్చ కొనసాగుతోంది. ప్రధాని నరేంద్రమోడీ స్పందన నేపథ్యంలో ఉపాధిలో మార్పులు చేర్పులు చోటు చేసుకోవచ్చని అధికార వర్గాలు భావిస్తున్నాయి. -
సమాచారమివ్వకపోతే చర్యలే
అమలులో నిర్లక్ష్యం =స.హ.చట్టం పరిధిలోనే దేవాదాయశాఖ =తప్పుడు సమాచారమిస్తే జరిమానా =కమిషనర్ పీ విజయబాబు మచిలీపట్నం, న్యూస్‌లైన్ : ఉద్యోగులూ ప్రజలేనన్న నిజాన్ని గ్రహిస్తే సమాచార హక్కు చట్టం ద్వారా వచ్చిన అర్జీలను త్వరితగతిన పరిష్కరించగలుగుతారని స.హ. చట్టం కమిషనర్ విజయబాబు అన్నారు. స్థానిక హిందూ కళాశాలలో స.హ. చట్టంపై జిల్లా అధికారులు, అప్పిలేట్ అధికారులు, పౌరసమాచార అధికారులు, సహాయ పౌర సమాచార అధికారులకు గురువారం అవగాహన సదస్సు జరిగింది. ఆయన మాట్లాడుతూ స.హ. చట్టాన్ని అమలు చేయడం ఉద్యోగుల విధుల్లో భాగమేనన్నారు. 2005 అక్టోబరు నుంచి అమలులోకి వచ్చిన స.హ. చట్టం సత్ఫలితాలిస్తుందని చెప్పారు. ఈ చట్టం అమలులో ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా వ్యవహరించాలన్నారు. ఎంతో చరిత్ర కలిగిన ్ణజిల్లా అభివృద్ధిలో వెనుకబడి ఉండటానికి కారణం వివిధ అభివృద్ధి పథకాల్లో ప్రజల భాగస్వామ్యం లేకపోవటమేనని చెప్పారు. స.హ. చట్టం ప్రకారం సమాచారమివ్వని కార్యాలయ అధికారులపై 41-బీ ప్రకారం చర్యలు తీసుకునే అధికారం కమిషనర్‌కు ఉందన్నారు. తప్పుడు సమాచారం ఇచ్చే అధికారులకు రూ. 25 వేలు జరిమానా విధించే అవకాశం ఉందన్నారు. కలెక్టర్ ఎం.రఘునందన్‌రావు మాట్లాడుతూ భారతదేశంతో పాటు స్వాతంత్య్రం పొందిన ఇతర దేశాలతో పోలిస్తే మనదేశం ఆదర్శంగానే ఉందన్నారు. పారదర్శకమైన పాలన అందించడానికి స.హ. చట్టం అమలు చేయడం మంచి పరిణామమని చెప్పారు. జేసీ పీ ఉషాకుమారి మాట్లాడుతూ ధర్మాన్ని మనం రక్షిస్తే ధర్మం మనల్ని రక్షిస్తుందన్నారు. వివిధ శాఖల అధికారులు అడిగిన పలు ప్రశ్నలకు స.హ. చట్టం కమిషనర్ విజయబాబు సమాధానమిచ్చారు. జిల్లా ఖజానాశాఖ డీడీ నాగేశ్వరరావు, డీఆర్వో ఎల్.విజయచందర్ , విజయవాడ, నూజివీడు సబ్కలెక్టర్లు డీ హరిచందన, చక్రధరరావు, బందరు ఆర్డీవో పీసాయిబాబు, డీఆర్డీఏ పీడీ శివశంకరరావు, పశుసంవర్ధకశాఖ జేడీ దామోదరనాయుడు, డ్వామా పీడీ అనిల్‌కుమార్, వ్యవసాయశాఖ జేడీ సీహెచ్ బాలునాయక్, గుడివాడ ఏఎన్ఆర్ కళాశాల ఉద్యోగి పీ శ్రీనివాసరావు పాల్గొన్నారు. అమలులో ఇంత నిర్లక్ష్యమా.... సమాచార హక్కు చట్టం అమలులో జిల్లా వెనుకబడి ఉందని విజయబాబు అన్నారు. స్థానిక ఆర్అండ్బీ అతిథి గృహంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈ చట్టం అమలులోకి వచ్చిన 120 రోజుల్లో చట్టాన్ని అమలు చేసే అప్పిలేట్ అధికారుల వివరాలను ప్రభుత్వ కార్యాలయాల వద్ద ఏర్పాటు చేయాల్సి ఉండగా.... 8సంవత్సరాలైనా ఈ ప్రక్రియ జిల్లాలో పూర్తి కాలేదన్నారు. స.హ. చట్టం అమలులో జిల్లాలో పనిచేస్తున్న అధికారులు పూర్తిగా నిర్లక్ష్య ధోరణితో వ్యవహరిస్తున్నారనడానికి ఇంతకంటే ఉదాహరణ లేదని చెప్పారు. దేవాదాయశాఖ అధికారులు తాము ఈ చట్టం పరిధిలో లేమని చెప్పి తప్పించుకుంటున్నారన్నారు. స.హ. చట్టం పరిధిలోకి దేవాదాయశాఖ వస్తుందని ఆయన స్పష్టం చేశారు. జిల్లాలోని జగ్గయ్యపేట సమీపంలో ఒక దేవస్థానం ట్రస్టీ పరిధిలో ఉన్నందున సమాచారం ఇవ్వటానికి నిరాకరిస్తూ హైకోర్టును ఆశ్రయించారని చెప్పారు. ప్రతి ఒక్కరికీ అర్ధమయ్యే విధంగా స.హ. చట్టంపై పుస్తకాలు ముద్రించి పంపిణీ చేయాల్సి ఉందన్నారు. ఢిల్లీలో అమ్ఆద్మీ పార్టీని స్థాపించి ఎన్నికల్లో అధిక సీట్లు సాధించిన క్రేజీవాల్ స.హ. చట్టం కార్యకర్తగానే తన జీవితాన్ని ప్రారంభించారన్నారు. మచిలీపట్నం విలేకరుల ఆధ్వర్యంలో విజయబాబును ఘనంగా సత్కరించారు. శ్రీసుబ్రహ్మణ్యేశ్వర స్వామి సేవలో... మోపిదేవి : మోపిదేవి శ్రీసుబ్రహ్మణ్యేశ్వర స్వామివారిని ఆయన కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ఆయన వెంట అవనిగడ్డ ఎస్ఐ శ్రీనివాస్, వీఆర్వో శేషగిరిరావు, ఆలయ సిబ్బంది ఉన్నారు. -
రాష్ర్టంలో ఆర్థిక సంక్షోభం
పరిస్థితిపై శ్వేత పత్రం : యడ్డి డిమాండ్ = అభివృద్ధి పనులు స్తంభించాయి = 20 ఏళ్లలో ఇలాంటి దుస్థితి చూడలేదు = సీఎంపైనే ఎమ్మెల్యేలు అధిష్టానానికి ఫిర్యాదా? = బాధ్యతారహితంగా మాట్లాడుతున్న కేపీసీసీ చీఫ్ సాక్షి ప్రతినిధి, బెంగళూరు : రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితి అధ్వానంగా తయారైందని, అభివృద్ధి కార్యక్రమాలు స్తంభించిపోయాయని కేజేపీ అధ్యక్షుడు యడ్యూరప్ప ఆరోపించారు. దీనిపై తక్షణమే శ్వేత పత్రాన్ని విడుదల చేయాలని డిమాండ్ చేశారు. గుల్బర్గలో బుధవారం ఏర్పాటు చేసిన పార్టీ కార్యకర్తల సమావేశంలో పాల్గొనడానికి వచ్చిన ఆయన విలేకరులతో మాట్లాడారు. గత 20 ఏళ్లలో ఇంతటి దారుణమైన ఆర్థిక పరిస్థితి ఎప్పుడూ ఏర్పడలేదన్నారు. అభివృద్ధి పథకాలు స్తంభించిపోవడానికి కారణాలేమిటో వివరించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ పని తీరుపై అధికార కాంగ్రెస్ ఎమ్మెల్యేలే పెదవి విరుస్తున్నారని చెప్పారు. ముఖ్యమంత్రిపై ఎమ్మెల్యేలే అధిష్టానానికి ఫిర్యాదు చేసేంత వరకు పరిస్థితి వెళ్లిందని అన్నారు. సాక్షాత్తు లోకాయుక్త ‘ఈ ప్రభుత్వంలో లంచం ఇవ్వనిదే పనులు జరగడం లేదు’ అని వ్యాఖ్యానించారని అన్నారు. రైతుల రుణ మాఫీని ఇంకా పూర్తిగా అమలు చేయలేదన్నారు. కేపీసీసీ అధ్యక్షుడు డాక్టర్ జీ. పరమేశ్వర బాధ్యతారహితంగా మాట్లాడుతున్నారని విమర్శించారు. మైనారిటీలు రుణాలు చెల్లించకుండా ఎగ్గొట్టవచ్చంటూ ఆయన సలహా ఇవ్వడాన్ని తప్పుబట్టారు. కాగా బీజేపీలో చేరే విషయమై ప్రశ్నించినప్పుడు ఆయన సమాధానాన్ని దాటవేశారు. కేజేపీ మనుగడను కాపాడుకుంటామని చెప్పారు. గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీని ప్రధానిగా చూడాలనే ఏకైక ఉద్దేశంతో బీజేపీతో మద్దతుకు సిద్ధమవుతున్నామని తెలిపారు. అయితే దీనిపై ఎవరూ తనతో చర్చించలేదని ఆయన చెప్పారు. -
జిల్లావ్యాప్తంగా మహానేత నాలుగో వర్ధంతి
సాక్షి, సంగారెడ్డి: మహానేత, దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డికి మెతుకుసీమ ఘన నివాళి అర్పించింది. నాలుగో వర్ధంతి సందర్భంగా సోమవారం జిల్లా వ్యాప్తంగా కార్యక్రమాలు నిర్వహించారు. పార్టీలకు అతీతంగా నిర్వహించిన ఆయా సభల్లో పలువురు రాజన్న అమలు చేసిన సంక్షేమ పథకాలు, అభివృద్ధి పథకాలను స్మరించుకుని కొనియాడారు. జిల్లా వ్యాప్తంగా వైఎస్ విగ్రహాలకు క్షీరాభిషేకాలు జరిగాయి. ప్రభుత్వ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న రోగులకు పండ్లు, బ్రెడ్ల పంపిణీ చేశారు. వైఎస్సార్ కాంగ్రెస్, కాంగ్రెస్ పార్టీతో పాటు వైఎస్ అభిమానులు స్వచ్ఛందంగా వర్ధంతి కార్యక్రమాలు నిర్వహించారు. సంగారెడ్డిలోని వైఎస్సార్ సీపీ జిల్లా కార్యాలయంలో పార్టీ యువజన విభాగం జిల్లా కన్వీనర్ శ్రీధర్‌రెడ్డి ఆధ్వర్యంలో ఆ పార్టీ శ్రేణులు మహానేతకు నివాళి అర్పించారు. అనంతరం స్థానిక ఆస్పత్రిలో రోగులకు పండ్లు పంపిణీ చేశారు. సంగారెడ్డిలో నియోజకవర్గ సమన్వయకర్త దేశ్‌పాండే, పార్టీ నేత మనోజ్రెడ్డిల ఆధ్వర్యంలో కార్యకర్తలు వైఎస్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. బీహెచ్ఈఎల్లో 300 మంది నేత్ర దానం బీహెచ్ఈఎల్లో పార్టీ నేత సతీష్ గౌడ్ ఆధ్వర్యంలో జరిగిన వర్ధంతి కార్యక్రమంలో మూ డు వందల మంది వైఎస్ అభిమానులు నేత్ర దానికి ముందుకు వచ్చారు. ఈ మేరకు ప త్రాలపై సంతకాలు చేశారు. పటాన్చెరులో కార్మిక విభాగం జిల్లా కన్వీనర్ నర్రా భిక్షపతి, మండల కన్వీనర్ నరేందర్‌రెడ్డి ఆధ్వర్యంలో స్థానిక ప్రభుత్వ ఆస్పత్రిలో రోగులకు పండ్లు పంపిణీ చేశారు. రాంచంద్రాపురంలో నియోజకవర్గ కన్వీనర్ మహిపాల్‌రెడ్డి ఆధ్వర్యంలో వైఎస్ చిత్ర పటానికి నివాళి అర్పించారు. గుమ్మడిదల పీహెచ్సీలో మాజీ ఎంపీటీసీ, వైఎస్సార్ సీపీ నేత విష్ణువర్దన్‌రెడ్డి ఆధ్వర్యంలో రోగులకు పండ్లు పంపిణీ చేశారు. బాలసదన్‌లో కిట్ల పంపిణీ నారాయణ్‌ఖేడ్‌లో స్థానిక సర్పంచ్ అప్పారావు షెట్కార్ ఆధ్వర్యంలో బాల సదనంలో చిన్నారులకు సబ్బులు, పేస్టులు, పౌడర్లు ఇతరాత్ర వస్తువులతో కూడిన కిట్లను పంపిణీ చేశారు. అంతకు ముందు వైఎస్ చిత్ర పటానికి నివాళి అర్పించారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ నియోజకవర్గ సమన్వయకర్త బిడెకన్నె హన్మంతు తదితరులు పాల్గొన్నారు. జహీరాబాద్‌లోని వైఎస్సార్ సీపీ కార్యాలయంలో ఆ పార్టీ శ్రేణులు వైఎస్ చిత్ర పటానికి నివాళి అర్పించి స్థానిక ప్రభుత్వ ఆస్పత్రిలో రోగులకు పండ్లు పంపిణీ చేశారు.నియోజకవర్గ సమన్వయకర్త మాణిక్‌రావు, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు నర్సింహ్మ యాదవ్, మైనారిటీ సెల్ జిల్లా అధ్యక్షుడు ఎండీ ఫారూక్, జిల్లా అధికార ప్రతినిధి క్రిష్టఫర్‌లు పాల్గొన్నారు. ఝరాసంఘంలో జిల్లా స్టీరింగ్ కమిటీ సభ్యుడు బాబుకుమార్ ఆధ్వర్యంలో రోగులకు పండ్లు, బ్రెడ్లు పంపిణీ చేశారు. జోగిపేటలో అందోల్ నియోజకవర్గ సమన్వయకర్త నల్లా సూర్యప్రకాష్, స్థానిక వైఎస్ విగ్రహానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. అనంతరం ప్రభుత్వ ఆస్పత్రిలో రోగులకు పండ్లు పంపిణీ చేశారు. వైఎస్సార్ సీపీ బీసీ సెల్ జిల్లా కన్వీనర్ డీజీ మల్లయ్య యాదవ్ పాల్గొన్నారు. దుబ్బాకలో వైఎస్సార్సీపీ నేతలు అశోక్ గౌడ్, దేవిరెడ్డిల ఆధ్వర్యంలో నేతలు వైఎస్ చిత్రపటానికి నివాళి అర్పించి రోగులకు పండ్లు పంపిణీ చేశారు. మిరుదొడ్డి వైఎస్సార్సీపీ మండల కన్వీనర్ సురేష్ ఆధ్వర్యంలో వైఎస్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. నర్సాపూర్‌లో వైఎస్సార్ సీపీ జిల్లా వాణిజ్య విభాగం కన్వీనర్ పీ శ్రీధర్ గుప్తా ఆధ్వర్యంలో వైఎస్ విగ్రహానికి క్షీరాభిషేకం చేశారు. స్థానిక ప్రభుత్వ ఆస్పత్రిలో రోగులకు పండ్లు పంపిణీ చేశారు. కొల్చారం మండలం రాంపూర్‌లో గ్రామస్తులు స్వచ్ఛందంగా వైఎస్ విగ్రహానికి నివాళి అర్పించారు. సిద్దిపేటలో వైఎస్సార్సీపీ పట్టణ కమిటీ అధ్యక్షుడు ఎజాస్ పటేల్ ఆధ్వర్యంలో రాజన్న చిత్రపటానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. నంగనూరులో మండల కన్వీనర్ ఇమ్రాన్ ఆధ్వర్యంలో వర్ధంతి కార్యక్రమం జరిగింది. కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో.. నర్సాపూర్‌లో డీసీసీ ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్ గుప్తా, నర్సాపూర్ సర్పంచ్ రమణారావుల ఆధ్వర్యంలో వైఎస్ విగ్రహానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. కౌడిపల్లిలో కాంగ్రెస్ నేతలు వైఎస్ చిత్రపటానికి నివాళి అర్పించారు. తెల్లాపూర్‌లో కాంగ్రెస్ మండల అధ్యక్షుడు శ్రీశైలం యాదవ్ ఆధ్వర్యంలో వైఎస్ విగ్రహానికి నివాళి అర్పించారు. రాంచంద్రాపురం మండలం కొల్లూరులో ఉప సర్పంచ్ రాజు గౌడ్ నివాళి అర్పించారు. ములుగులో మండల కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి పూల పెంటయ్య ఆధ్వర్యంలో వైఎస్‌కు నివాళి అర్పించారు.