ఎన్నికల కోడ్‌తో నిలిచిన పథకాలు
ఇన్నాళ్లూ అధికారుల అలసత్వంతో నత్తనడకే..
అనుమతి కోసం ఎన్నికల కమిషన్‌కు లేఖలు
అక్కడ ఓకే అంటేనే ముందడుగు
వరంగల్ : ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి పథకాల అమలులో అధికారులు ఇంతకాలం చూపిన నిర్లక్ష్యం జిల్లా ప్రజలకు పెనుశాపంగా మారింది. అధికారుల అలసత్వానికి తాజాగా వరంగల్ లోక్‌సభ ఉప ఎన్నిక కోడ్ తోడైంది. ఈ ఏడాది జనవరిలో కడియం శ్రీహరి ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన రోజు నుంచి ఏ క్షణాన్నైనా వరంగల్ ఎంపీ స్థానానికి ఉప ఎన్నిక వస్తుందనే విషయం అందరికీ తెలుసు. ఇంత స్పష్టత ఉన్నా ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలులో అధికారులు నిర్లక్ష్యంగానే వ్యవహరించారు. తీరా ఎన్నికల నిర్వహణ షెడ్యూల్ వెల్లడైన తర్వాత తమ శాఖల పరిధిలో పథకాలను ఎలా కొనసాగించాలనే విషయంలో హైరానా పడుతున్నారు. పథకాలను కొనసాగించాలా, వద్దా అనే విషయంపై వివరణ కోరుతూ ఎన్నికల సంఘానికి లేఖలు రాస్తున్నారు. ఎన్నికల సంఘం నుంచి సానుకూల స్పందన వస్తే సరే... లేకుంటే లబ్ధిదారుల పరిస్థితి ఏమిటన్నది అర్థం కావడం లేదు. అధికారులు చేసిన నిర్వాకానికి ఇప్పుడు అర్హులైన తాము ఇబ్బంది పడాల్సిన పరిస్థితి వచ్చిందని దరఖాస్తుదారులు అంటున్నారు. అధికారుల నిర్లక్ష్యం కారణంగా అమలులో జాప్యమైన కొన్ని సంక్షేమ పథకాల పరిస్థితి...
ఎస్సీ స్టడీ సర్కిల్...
జిల్లాలో దళిత అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో ఎస్సీ కేటగిరీ విద్యార్థులకు గ్రూప్స్ పోటీ పరీక్షలపై శిక్షణ ఇచ్చేందుకు రాష్ట్రంలోనే రెండో శిక్షణ కేంద్రాన్ని జిల్లాలో ఏర్పాటు చే యాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీని కోసం దళిత అ భివృద్ధి శాఖ డెరైక్టరు స్వయంగా జిల్లాకు వచ్చి భవనాన్ని పరిశీలించగా.. పలువురు అభ్యర్థులు దరఖాస్తు కూడా చేసుకున్నారు. అలాగే, స్టడీ సెంటర్ డెరైక్టర్ పో స్టు కోసం అధికారులు ఇటీవలే నోటిఫికేషన్ ఇచ్చారు. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు ప్రవేశ అర్హత పరీక్షలు నిర్వహించడంతో పాటు గత నెల మొదటి వారంలోనే స్టడీ సెంటర్ ప్రారంభించాల్సి ఉంది. అరుుతే, అధికారు ల నిర్లక్ష్యం కారణంగా పనులు సకాలంలో పూర్తికాలేదు. కొత్త కార్యక్రమం కావడంతో ఎన్నికల నియమావళి పే రు చెప్పి పనులు నిలిపివేశారు. ఎన్నికల కోడ్ విషయం ముందే తెలిసినా అధికారులు పట్టించుకోకపోవడతో... గ్రూప్స్ పరీక్షల కోచింగ్ కోసం వేచి చూస్తున్న పేద వి ద్యార్ధుల పరిస్థితి ఆగమ్యగోచరంగా మారింది. అనుమ తి కోసం ఎన్నికల కమిషన్‌కు లేఖ రాశామని.. అక్కడి నుంచి వచ్చే సమాధానం ఆధారంగా మిగిలిన పనులు పూర్తి చేస్తామని దళిత అభివృద్ధి శాఖ డీడీ శంకర్ తెలిపారు.
కార్పొరేషన్ రుణాలు...
ఎస్సీ కార్పొరేషన్ నుంచి కొత్తగా రుణాల మంజూరుపై ఇటీవలే జిల్లా కలెక్టర్ ప్రకటన చేశారు. 80 శాతం సబ్సిడీతో కొన్ని రకాల రుణాలు ఇవ్వనున్నట్లు వెల్లడించడం తో అర్హులు చాలా మంది సంతోషపడ్డారు. వీరిలో కొం దరు ఇప్పటికే బ్యాంకర్లతో ఒప్పందాలు చేసుకున్నా రు. కోడ్ ప్రభావంతో ఎస్సీ కార్పొరేషన్ రుణాల మం జూరు ప్రక్రియ డిసెంబర్ వరకు వాయిదా పడింది. రుణాలు అందుతాయని ఆశించిన వారు ఇప్పుడు రెం డు నెలల పాటు ఎదురుచూడాల్సిన పరిస్థితి వచ్చింది. మరోవైపు బీసీ కార్పొరేషన్ నుంచి ఇప్పటివరకు రుణాలకు సంబంధించి ప్రభుత్వం కొత్తగా ప్రకటించిన రాయితీల విషయం అధికారులు వెల్లడించకపోగా.. ఆయూ వర్గాలు కూడా ఎన్నికల పూర్తయ్యే వరకు వేచి చూడాల్సిందే. అరుుతే, పాత మంజూరీలు సైతం కోడ్ పూర్తయిన తర్వాతే ఉంటాయని అధికారులు తెలిపారు.
అయ్యో ‘దీపం’...
అర్హులైన పేదలకు కట్టెల పొయ్యి ఇబ్బందులను తొలగించే దీపం వంట గ్యాస్ కనెక్షన్ల పథకం అమలు అధికారుల నిర్లక్ష్యానికి నిదర్శనంగా మారింది. పథకం మంజూరై మూడు నెలలవుతున్నా ఇప్పటికీ అమలుకు నోచుకోని పరిస్థితి. దీపం పథకం కింద జిల్లాలోని 12 నియోజకవర్గాలకు మొత్తం 60 వేల కనెక్షన్లు మంజూరు కాగా.. ఇప్పటి వరకు పది వేల మంది లబ్ధిదారులనే ఎంపిక చేశారు. అంతేకాకుండా లబ్ధిదారుల ఎంపిక గడువును ఎప్పటికప్పుడు పొడిగిస్తుండగా.. ఇప్పుడు ఏకంగా ఎంపిక ప్రక్రియకే బ్రేక్ పడింది.
భూ పంపిణీ...
రాష్ట్రప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న భూపంపిణీ కార్యక్రమం జిల్లాలో మంచిగానే సాగుతోంది. ఈ పథకం అమలులో మన జిల్లా మూడో స్థానంలో నిలవగా.. ప్రస్తుతం 500 ఎకరాల వరకు భూమి పంపిణీకి సిద్ధంగా ఉంది. వారంలో చివరి దశ పనులు పూర్తయి పంపిణీ చేయూల్సి ఉండగా.. ప్రస్తుతం ఎన్నికల కోడ్ అడ్డంకిగా మారింది. ఈ విషయంలో అధికారులు ముందుగానే స్పందిస్తే బాగుండేదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
ఎక్కడివక్కడే!
Published Wed, Oct 28 2015 1:22 AM | Last Updated on Tue, Aug 14 2018 4:34 PM
Advertisement
Advertisement