తెలంగాణ కోసం వైఎస్ఆర్ మమ్మల్ని పంపలేదు: చిన్నారెడ్డి | YS rajasekhar reddy never supported telangana, reveals congress leader chinna reddy | Sakshi
Sakshi News home page

తెలంగాణ కోసం వైఎస్ఆర్ మమ్మల్ని పంపలేదు: చిన్నారెడ్డి

Oct 23 2013 12:35 PM | Updated on Jul 7 2018 2:52 PM

తెలంగాణ కోసం వైఎస్ఆర్ మమ్మల్ని పంపలేదు: చిన్నారెడ్డి - Sakshi

తెలంగాణ కోసం వైఎస్ఆర్ మమ్మల్ని పంపలేదు: చిన్నారెడ్డి

మహానేత వైఎస్ ఎప్పటికీ సమైక్యవాదేనని, అసలాయనకు తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కావడం అనేది ఇష్టం లేనే లేదని ఏఐసీసీ కార్యదర్శి, నాడు సోనియా గాంధీని కలిసిన బృందంలో కీలక సభ్యుడు అయిన జి.చిన్నారెడ్డి స్పష్టం చేశారు. , , , , ,

తెలంగాణ ఏర్పాటు చేయాలంటూ సోనియాగాంధీని కాంగ్రెస్ పార్టీకి చెందిన 41 మంది ఎమ్మెల్యేలు కలవడం వెనుక మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డే ఉన్నారని.. ఆయన ప్రోత్సాహంతోనే తెలంగాణ కావాలంటూ వాళ్లంతా కాంగ్రెస్ అధినేత్రి సోనియాను కలిశారని ఇన్నాళ్లూ పలువురు నేతలు చేసిన ప్రచారమంతా ఉత్త డొల్లేనని తేలిపోయింది. మహానేత వైఎస్ ఎప్పటికీ సమైక్యవాదేనని, అసలాయనకు తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కావడం అనేది ఇష్టం లేనే లేదని ఏఐసీసీ కార్యదర్శి, నాడు సోనియా గాంధీని కలిసిన బృందంలో కీలక సభ్యుడు అయిన జి.చిన్నారెడ్డి స్పష్టం చేశారు.

ఆయన బుధవారం నాడు ఓ టీవీ చానల్లో జరిగిన చర్చా కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా ఈ విషయంపై పూర్తి స్పష్టతను ఇచ్చారు. తెలంగాణ ప్రాంతానికి సంబంధించిన సమస్యల పరిష్కారం కోసం తాము అధినేత్రిని కలుస్తామని చెప్పగా, వైఎస్ రాజశేఖరరెడ్డి అందుకు సరేనని తామందరినీ ఢిల్లీ పంపారని, ఆయనకు తాము ప్రత్యేక రాష్ట్రం ఇస్తామన్న విషయాన్ని మాత్రం ముందుగా చెప్పలేదని చిన్నారెడ్డి అంగీకరించారు. అక్కడకు వెళ్లిన తర్వాత మాత్రం తెలంగాణకు ప్రత్యేక రాష్ట్రం కావాలన్న ఆకాంక్షను అధినేత్రి వద్ద వ్యక్తం చేసి, ఆ మేరకు ఆమెకు మెమొరాండం ఇచ్చామని తెలిపారు.

తాము ముందుగా చెప్పకుండా తెలంగాణ రాష్ట్రం కావాలంటూ సోనియాగాంధీకి మెమొరాండం ఇచ్చినా.. వైఎస్ మాత్రం తమను ఒక్క మాట కూడా అడగలేదని చిన్నారెడ్డి అన్నారు. ఆయనే తమను పంపారన్న మాట మాత్రం అవాస్తవమని స్పష్టం చేశారు. లేఖ ఇచ్చిన తర్వాత అలా మీరెందుకు ఇచ్చారని అభ్యంతరం చెప్పలేదని తెలిపారు. దీంతో.. మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి హయాం నుంచే, ఆయన నేతృత్వంలోనే తెలంగాణ కావాలంటూ కాంగ్రెస్ నాయకులు ప్రయత్నాలు చేశారన్న వాదనలు తేలిపోయాయి!!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement