వైఎస్ పాలనలోనే రైతురాజ్యం
► మళ్లీ రాబోయే రోజులలో జగన్ హయాంలోనే..
► జాతీయస్థాయి ఎడ్ల బలప్రదర్శన పోటీల ప్రారంభకార్యక్రమంలో ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి
మాచర్ల: దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి రైతురాజ్యంఎలా ఉంటుందో తన హయాంలో చూపించాడని, భవిష్యత్తులో రైతులకు మేలు చేసే నాయకుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మాత్రమేనని ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అన్నారు. శనివారం రాత్రి జమ్మలమడక రహదారిలో రామప్ప దేవాలయం వద్ద వైఎస్సార్‌సీపీ నియోజకవర్గ రైతు విభాగం ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన జాతీయస్థాయి ఎడ్ల బండలాగుడు పోటీలను శనివారం రాత్రి ఆయన ప్రారంభించారు.
అంతకుముందు వైఎస్‌ఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఒక్క సంతకంతో రుణమాఫీ చేసి రైతుల జీవితాలలో వెలుగులు నింపిన నాయకుడు వైఎస్ రాజశేఖర్‌రెడ్డి అని కొనియాడారు. ఆయన బాటలోనే నడుస్తున్న జగన్ భవిష్యత్తులో రైతురాజ్యాన్ని స్థాపిస్తారని ఎమ్మెల్యే పీఆర్కే చెప్పారు. శ్రీలక్ష్మీచెన్నకేశవస్వామి బ్రహ్మోత్సవాల సందర్భంగా వైఎస్సార్‌సీపీ నియోజకవర్గ రైతుసంఘం ఆధ్వర్యంలో 26వ తేదీ వరకు జాతీయస్థాయి ఎడ్లపోటీలను నిర్వహిస్తున్నామన్నారు. రెండు రాష్ట్రాల నుంచి 12 ఎడ్ల జతలు పాల్గొన్న ఈ పోటీలు రాత్రి 10 గంటలవరకు ఫ్లడ్‌లైట్‌ల వెలుతురులో నిర్వహించి ఎమ్మెల్యే పీఆర్కే పర్యవేక్షించారు. ఎడ్ల పోటీలను చూసేందుకు భారీగా తరలివచ్చారు.
భారీర్యాలీ
చెన్నకేశవస్వామి బ్రహ్మోత్సవాలను పురస్కరించుకొని నియోజకవర్గ నాయకులు, కార్యకర్తలు, అభిమానులతో ఎమ్మెల్యే పీఆర్కే భారీ మోటార్ సైకిల్ ర్యాలీ నిర్వహించారు. ర్యాలీలో ఎమ్మెల్యే బుల్లెట్ నడుపుతూ చెన్నకేశవస్వామి ఆలయానికి చేరుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జడ్‌పీటీసీ శేరెడ్డి గోపిరెడ్డి, మాజీ మార్కెట్ యార్డు చైర్మన్‌లు యరబోతుల శ్రీనివాసరావు, తాడి వెంకటేశ్వరరెడ్డి, మాజీ మున్సిపల్ చైర్మన్ కామనబోయిన కోటయ్య, ఫ్లోర్ లీడర్ బోయ రఘురామిరెడ్డి, డిప్యూటీ ఫ్లోర్ లీడర్ షేక్ కరిముల్లా, కౌన్సిలర్లు అన్నెం అనంతరావమ్మ, పోలా భారతి శ్రీనివాసరావు, బిజ్జం నాగలక్ష్మీ సుధాకరరెడ్డి, ఇంజమూరి రాణి, షేక్ ఫర్వీన్, పట్టణ పార్టీ అధ్యక్షుడు సీహెచ్. రోశయ్య, యూత్ కన్వీనర్ టి. కిషోర్, జిల్లా కార్యదర్శులు జూలకంటి వీరారెడ్డి, బండారు పరమేశ్వరరావు, రాష్ట్ర యువజన విభాగ కార్యవర్గ సభ్యులు మార్తాల ఉమామహేశ్వరరెడ్డి, మహిళా అధ్యక్షురాలు మరియమ్మ, జిల్లా మైనార్టీ నాయకులు షేక్ కరీముల్లా, ఆహ్వాన కమిటీ గౌరవాధ్యక్షులు ఎం.శ్రీనివాసశర్మ, అధ్యక్షులు నల్ల వెంకటరెడ్డి, కోశాధికారి ఉమామహేశ్వరరెడ్డి, ముక్కా శ్రీనివాసరావుయాదవ్, సుబ్బయ్య, శ్రీను, సీతారామిరెడ్డి, నాసరయ్య, పరమేశ్వరరావు, బూడిద శ్రీను, మెట్టు రామకృష్ణారెడ్డి, శ్రీనివాసరెడ్డి, వీరారెడ్డి, ఎంఆర్‌ఎఫ్ రామాంజిరెడ్డి, మల్లయ్య పాల్గొన్నారు.