
శ్రీ వికారి నామ సంవత్సరం, ఉత్తరాయణం, శిశిర ఋతువుఫాల్గుణ మాసం, తిథి శు.అష్టమి ఉ.8.45 వరకు, తదుపరినవమి, నక్షత్రం రోహిణి ఉ.6.02 వరకు, తదుపరి మృగశిరవర్జ్యం ఉ.11.45 నుంచి 1.24 వరకు, దుర్ముహూర్తం ఉ.8.43నుంచి 9.27 వరకు, తదుపరి రా.10.57 నుంచి 11.46 వరకుఅమృతఘడియలు... రా.9.42 నుంచి 11.20 వరకు.
సూర్యోదయం : 6.22
సూర్యాస్తమయం : 6.02
రాహుకాలం : ప. 3.00 నుంచి 4.30 వరకు
యమగండం : ఉ.9.00 నుంచి 10.30 వరకు
భవిష్యం
మేషం: ప్రయాణాలు వాయిదా.. శ్రమాధిక్యం. పనుల్లో జాప్యం. ఆర్థిక విషయాలు నిరాశ పరుస్తాయి. ఆరోగ్యభంగం. వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. ఉద్యోగాలలో ఒత్తిళ్లు. సోదరులతో వివాదాలు.
వృషభం: సన్నిహితుల నుంచి ధనలాభం. పనుల్లో విజయం. శుభవార్తలు. వాహనయోగం. ముఖ్య నిర్ణయాలు. పరిచయాలు పెరుగుతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలు సజావుగా సాగుతాయి.
మిథునం: మిత్రులతో విభేదాలు. ఆర్థిక విషయాలు నిరాశ పరుస్తాయి. ఆకస్మిక ప్రయాణాలు. రుణాలు చేస్తారు. బంధువుల నుంచి ఒత్తిళ్లు. వ్యాపారాలు, ఉద్యోగాలలో నిరుత్సాహం.
కర్కాటకం: పరిస్థితులు అనుకూలిస్తాయి.శ్రమ ఫలిస్తుంది. కొత్త వ్యక్తుల పరిచయం. శుభకార్యాలు నిర్వహిస్తారు. పనులు సకాలంలో పూర్తి. వ్యాపారాలు, ఉద్యోగాలలో మరింత ఉత్సాహం.
సింహం: పనులు విజయవంతమవుతాయి. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. ప్రతిభ వెలుగులోకి వస్తుంది. ఆశ్చర్యకరమైన సంఘటనలు. వ్యాపారాలు వృద్ధి చెందుతాయి. ఉద్యోగాలలో మీదే పైచేయిగా ఉంటుంది.
కన్య: పనులు నిదానంగా సాగుతాయి. ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉంటుంది. సన్నిహితులతో వివాదాలు తీరతాయి. ఆప్తుల సలహాలు స్వీకరిస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో మరింత అనుకూలం.
తుల: ముఖ్యమైన పనులు వాయిదా వేస్తారు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. కుటుంబంలో చికాకులు. అనారోగ్యం. సోదరులతో విభేదాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో కాస్త నిరాశ.
వృశ్చికం: కొత్త వ్యక్తుల పరిచయం. శుభకార్యాలలో పాల్గొంటారు. పాతబాకీలు వసూలవుతాయి. పాత సంఘటనలు గుర్తుకు వస్తాయి. వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి. ఉద్యోగాలలో ఆదరణ.
ధనుస్సు: చిన్ననాటి మిత్రులతో సఖ్యత. వ్యవహారాలలో విజయం. ఆప్తుల నుంచి ఆహ్వానాలు. విందువినోదాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు సాఫీగా సాగుతాయి. వాహనయోగం.
మకరం: వ్యవహారాలలో ఆటంకాలు. కొత్త రుణాలు చేస్తారు. ఆకస్మిక ప్రయాణాలు. బంధువర్గంతో తగాదాలు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. వ్యాపారాలు, ఉద్యోగాలలో చికాకులు.
కుంభం: పనులు మధ్యలో వాయిదా వేస్తారు. ఆలోచనలు నిలకడగా ఉండవు. కుటుంబసభ్యులతో తగాదాలు. ఉద్యోగ ప్రయత్నాలు నిరాశ పరుస్తాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొద్దిపాటి సమస్యలు.
మీనం: పరిచయాలు పెరుగుతాయి. ఆత్మీయుల నుంచి శుభవార్తలు. వాహనయోగం. స్థిరాస్తి వృద్ధి. ముఖ్య నిర్ణయాలు. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగాలలో సమస్యలు తీరతాయి.– సింహంభట్ల సుబ్బారావు
Comments
Please login to add a commentAdd a comment