
శ్రీ వికారి నామ సంవత్సరం దక్షిణాయనం, శరదృతువు కార్తీక మాసం, తిథి శు.త్రయోదశి ప.3.50 వరకు, తదుపరి చతుర్దశి నక్షత్రం రేవతి సా.5.34 వరకు, తదుపరి అశ్వని, వర్ద్యం... లేదు, దుర్ముహూర్తం సా.3.54 నుంచి 4.34 వరకు అమృతఘడియలు... ప.2.56 నుంచి 4.44 వరకు.
సూర్యోదయం : 6.05
సూర్యాస్తమయం : 5.24
రాహుకాలం : సా.4.30 నుంచి 6.00 వరకు
యమగండం : ప.12.00 నుంచి 1.30 వరకు
భవిష్యం
మేషం: వ్యవహారాలలో అవాంతరాలు. రుణాలు చేస్తారు. ఆత్మీయులతో మాటపట్టింపులు. అనారోగ్యం. దూరప్రయాణాలు. ఉద్యోగ ప్రయత్నాలు నెమ్మదిస్తాయి. వ్యాపారాలు, ఉద్యోగాలు కొంత నిరాశ పరుస్తాయి.
వృషభం: పనులు సజావుగా సాగుతాయి. ఆప్తులతో సఖ్యత. విందువినోదాలు. కార్యజయం. నూతన విద్యావకాశాలు దక్కుతాయి. ప్రముఖులతో పరిచయాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు ఆశాజనకంగా ఉంటాయి.
మిథునం: చిన్ననాటి మిత్రులతో ఉత్సాహంగా గడుపుతారు. వ్యవహారాలు సాఫీగా సాగుతాయి. కొత్త వ్యక్తుల పరిచయం. శుభవార్తా శ్రవణం. వ్యాపారాలు, ఉద్యోగాలలో మరింత అనుకూలం.
కర్కాటకం: శ్రమ పెరుగుతుంది. పనులు ముందుకు సాగవు. బంధుమిత్రులతో మాటపట్టింపులు. ఆరోగ్యభంగం. దైవదర్శనాలు. దూరప్రయాణాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు మందగిస్తాయి.
సింహం: పరిస్థితులు అనుకూలించవు. వివాదాలతో సతమతమవుతారు. ఆధ్యాత్మిక చింతన. అనారోగ్యం. ప్రయాణాలు వాయిదా వేస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో చికాకులు. ఉద్యోగ ప్రయత్నాలు నిదానిస్తాయి.
కన్య: చిన్ననాటి మిత్రులతో ఉత్సాహంగా గడుపుతారు. ఆలయాలు సందర్శిస్తారు. పనుల్లో పురోగతి సాధిస్తారు. నిరుద్యోగులకు శుభవార్తలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో నూతనోత్సాహం.
తుల: పరిచయాలు పెరుగుతాయి. ఆశయాలు నెరవేరతాయి. బంధువులతో వివాదాలు సర్దుబాటు కాగలవు. ఆస్తి, ధనలాభాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో చిక్కులు తొలగి ఊరట లభిస్తుంది.
వృశ్చికం: నేర్పుగా వ్యవహరించడం మంచిది. అనుకున్న పనులు ముందుకు సాగవు. ఆధ్యాత్మిక చింతన. శ్రమాధిక్యం. నిర్ణయాలలో తొందరవద్దు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఇబ్బందికరంగా ఉంటుంది.
ధనుస్సు: చేపట్టిన పనులలో ఆటంకాలు. రుణాలు చేస్తారు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. బంధుమిత్రులతో విభేదాలు. ఆకస్మిక ప్రయాణాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో స్వల్ప సమస్యలు.
మకరం: కొత్త వ్యక్తులతో పరిచయాలు. సంఘంలో ఆదరణ. పనులు విజయవంతంగా సాగుతాయి. ధనలాభాలు. కొన్ని వివాదాలు పరిష్కరించుకుంటారు. వ్యాపారాలు, ఉద్యోగాలు ప్రగతిపథంలో సాగుతాయి.
కుంభం: సన్నిహితులతో విభేదాలు. ఆకస్మిక ప్రయాణాలు. దైవదర్శనాలు. మిత్రుల నుంచి ఒత్తిడులు. ఆరోగ్యభంగం. పనులు వాయిదా వేస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొంత గందరగోళం.
మీనం: పనులు సకాలంలో పూర్తి చేస్తారు. ఆత్మీయుల నుంచి పిలుపు రావచ్చు. ఆలయ దర్శనాలు. దూరపు బంధువుల కలయిక. వాహనయోగం. వ్యాపారాలు, ఉద్యోగాలలో చిక్కులు తొలగుతాయి.
– సింహంభట్ల సుబ్బారావు
Comments
Please login to add a commentAdd a comment