
మేషం: ఉద్యోగార్థుల యత్నాలు ముందుకు సాగవు. ఆర్థిక పరిస్థితి అంతగా అనుకూలించదు. వ్యవహారాలలో జాప్యం. సోదరులతో వివాదాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో మార్పులు జరిగే వీలుంది.
వృషభం: కొత్త విషయాలు గ్రహిస్తారు. సంఘంలో గౌరవప్రతిష్ఠలు పెరుగుతాయి. స్థిరాస్తివృద్ధి. ముఖ్య నిర్ణయాలు తీసుకుంటారు. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగాలలో ఆశించిన మార్పులు.
మిథునం: కుటుంబసభ్యులతో వివాదాలు. ఆర్థిక విషయాలు నిరుత్సాహపరుస్తాయి. శ్రమాధిక్యం. పనుల్లో అవాంతరాలు. వైద్యసేవలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో చికాకులు.
కర్కాటకం: శ్రమ ఫలిస్తుంది. కొత్త పనులు చేపడతారు. పరిచయాలు పెరుగుతాయి. శుభకార్యాలలో పాల్గొంటారు. వాహనాలు కొంటారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో అంచనాలు నిజమవుతాయి.
సింహం: మిత్రులతో విభేదాలు. ఆర్థిక విషయాలు నిరుత్సాహపరుస్తాయి. శ్రమాధిక్యం. బంధువులను కలుసుకుంటారు. దైవదర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో గందరగోళం.
కన్య: పరిచయాలు పెరుగుతాయి. ఆత్మీయుల నుంచి ఆహ్వానాలు. నూతన విద్యావకాశాలు. ఆస్తుల వ్యవహారాలు కొలిక్కి వస్తాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో అనుకూల వాతావరణం.
తుల: పలుకుబడి పెరుగుతుంది. వ్యవహారాలలో విజయం. శుభకార్యాలలో పాల్గొంటారు. బాకీలు వసూలవుతాయి. వాహనయోగం. వ్యాపారాలు, ఉద్యోగాలలో సమస్యలు తీరతాయి.
వృశ్చికం: బంధువులతో తగాదాలు. ఆలోచనలు నిలకడగా ఉండవు. కుటుంబంలో ఒత్తిడులు. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో సామాన్యస్థితి. స్వల్ప అనారోగ్యం.
దనుస్సు: చేపట్టిన పనులు ముందుకు సాగవు. ఆర్థిక లావాదేవీలు మందగిస్తాయి. శ్రమాధిక్యం. వైద్యసలహాలు పొందుతారు. దూరప్రయాణాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో నిరాశ.
మకరం: మిత్రుల నుంచి ధనలబ్ధి. పరిచయాలు పెరుగుతాయి. ఆశ్చర్యకరమైన విషయాలు తెలుస్తాయి. ప్రతిభ వెలుగులోకి వస్తుంది. వ్యాపారాలలో లాభాలు. ఉద్యోగాలలో పదోన్నతులు.
కుంభం: చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. ఆర్థికాభివృద్ధి. సోదరులతో సఖ్యత. విందువినోదాలు. కాంట్రాక్టులు దక్కుతాయి. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగాలలో ఉత్సాహవంతంగా ఉంటుంది.
మీనం: బంధువులతో మాటపట్టింపులు. ఆధ్యాత్మిక చింతన. పనులు వాయిదా వేస్తారు. ఆకస్మిక ప్రయాణాలు. ఆరోగ్య భంగం. వ్యాపారాలు స్వల్పంగా లాభిస్తాయి. ఉద్యోగాలలో పనిఒత్తిడులు.
– సింహంభట్ల సుబ్బారావు
Comments
Please login to add a commentAdd a comment