
శ్రీ వికారి నామ సంవత్సరం, దక్షిణాయనం, శరదృతువు కార్తీక మాసం, తిథి అమావాస్య రా.8.56 వరకు, తదుపరి మార్గశిర శు.పాడ్యమి, నక్షత్రం విశాఖ ఉ.10.06 వరకు, తదుపరి అనూరాధ, వర్జ్యం ప.1.58 నుంచి 3.31 వరకు, దుర్ముహూర్తం ఉ.8.26 నుంచి 9.10 వరకు, తదుపరి రా.10.29 నుంచి 11.20 వరకు, అమృతఘడియలు... రా.11.17 నుంచి 12.50 వరకు.
సూర్యోదయం : 6.14
సూర్యాస్తమయం : 5.20
రాహుకాలం : ప. 3.00 నుంచి 4.30 వరకు
యమగండం : ఉ.9.00 నుంచి 10.30 వరకు
భవిష్యం
మేషం: కొత్త పనులు చేపడతారు. ఆలోచనలు అమలులో ఆటంకాలు తొలగుతాయి. ఆర్థికాభివృద్ధి. ముఖ్య సమాచారం అందుతుంది. వ్యాపారాలు, ఉద్యోగాలలో అనుకూల వాతావరణం.
వృషభం: సభలు,సమావేశాలలో పాల్గొంటారు.మిత్రుల చేయూత అందుతుంది. ఆర్థికంగా బలపడతారు. వస్తులాభాలు. పరిచయాలు పెరుగుతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలు సంతృప్తినిస్తాయి.
మిథునం: మిత్రులతో వివాదాలు. ఆకస్మిక ప్రయాణాలు. ధనవ్యయం. కుటుంబంలో ఒత్తిడులు పెరుగుతాయి. అనారోగ్యం. వ్యాపారాలు, ఉద్యోగాలు ఇబ్బందికరంగా ఉంటాయి.
కర్కాటకం: శ్రమ తప్పదు. పనులు నత్తనడకన సాగుతాయి ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. అనుకోని ప్రయాణాలు. కుటుంబసభ్యులతో వివాదాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో చికాకులు.
సింహం: మిత్రుల నుంచి ఆహ్వానాలు. అనుకున్న పనులు సకాలంలో పూర్తి చే స్తారు. సంఘంలో గౌరవం పొందుతారు. భూములు, వాహనాలు కొంటారు. వ్యాపారాలు, ఉద్యోగాలు ఆశాజనకంగా సాగుతాయి.
కన్య: పనులలో అవాంతరాలు. రుణయత్నాలు. ఆకస్మిక ప్రయాణాలు. కుటుంబసభ్యులతో విభేదాలు. ఉద్యోగయత్నాలు ముందుకు సాగవు. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొంత చికాకులు.
తుల: కొన్ని సమస్యలు తీరి ఊరట చెందుతారు. పనులు ^è కచకా సాగుతాయి. వ్యవహారాలు సాఫీగా సాగుతాయి. ఆలయ దర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒడిదుడుకులు తొలగుతాయి..
వృశ్చికం: ముఖ్యమైన పనులు వాయిదా వేస్తారు. ఆర్థిక పరిస్థితి అంతగా అనుకూలించదు. దూరప్రయాణాలు. కుటుంబసభ్యులతో వివాదాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒత్తిడులు.
ధనుస్సు: దూరపు బంధువుల కలయిక. విందువినోదాలు. పనులు విజయవంతంగా సాగుతాయి. ఆకస్మిక ధన, వస్తులాభాలు. పరిచయాలు పెరుగుతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో సమస్యలు తీరతాయి.
మకరం: నూతన ఉద్యోగప్రాప్తి. సంఘంలో గౌరవం. ఆస్తి వివాదాలు పరిష్కారమవుతాయి. నూతన పరిచయాలు. దైవదర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు సంతృప్తికరంగా ఉంటాయి.
కుంభం: పనుల్లో అవాంతరాలు. ఆర్థిక లావాదేవీలు నిరాశ పరుస్తాయి. శ్రమాధిక్యం. బంధువులతో విభేదాలు. ఆకస్మిక ప్రయాణాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒత్తిడులు.
మీనం: శ్రమ పెరుగుతుంది. వ్యవహారాలు ముందుకు సాగవు. ఆర్థిక ఇబ్బందులు. అనుకోని ప్రయాణాలు. ఆరోగ్యభంగం. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొద్దిపాటి చికాకులు.
– సింహంభట్ల సుబ్బారావు
Comments
Please login to add a commentAdd a comment