
శ్రీ వికారి నామ సంవత్సరం, దక్షిణాయనం, హేమంత ఋతువు మార్గశిర మాసం, తిథి శు. చవితి రా.7.04 వరకు, తదుపరి పంచమి నక్షత్రం పూర్వాషాఢ ఉ.9.51 వరకు, తదుపరి ఉత్తరాషాఢ, వర్జ్యం సా.6.20 నుంచి 8.00 వరకు, దుర్ముహూర్తం ఉ.6.15 నుంచి 7.43 వరకు, అమృతఘడియలు... తె.4.23 నుంచి 6.15 వరకు (తెల్లవారితే ఆదివారం).
సూర్యోదయం : 6.16
సూర్యాస్తమయం : 5.20
రాహుకాలం : ఉ.9.00 నుంచి 10.30 వరకు
యమగండం : ప.1.30 నుంచి 3.00 వరకు
భవిష్యం
మేషం: చేపట్టిన పనులు వాయిదా పడతాయి.ఆలోచనలు స్థిరంగా ఉండవు. కుటుంబసభ్యులతో విభేదాలు. ఆర్థిక ఇబ్బందులు. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొన్ని చిక్కులు.
వృషభం: దూరప్రయాణాలు. శ్రమకు ఫలితం కనిపించదు. అనారోగ్యం. పనుల్లో తొందరపాటు. నిర్ణయాలు మార్చుకుంటారు. దైవచింతన. వ్యాపారాలు, ఉద్యోగాలలో వ్యతిరేక పరిస్థితులు.
మిథునం: శుభకార్యాలకు హాజరవుతారు. ఆత్మీయులతో ఉత్సాహంగా గడుపుతారు. యుక్తితో సమస్యల నుంచి బయటపడతారు. వ్యాపారాలు పుంజుకుంటాయి. ఉద్యోగాలలో అనుకూల మార్పులు.
కర్కాటకం: శుభకార్యాల రీత్యా ఖర్చులు. కుటుంబసభ్యులతో సఖ్యత. విందువినోదాలు. పనుల్లో విజయం. ఆకస్మిక ధనలబ్ధి. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొత్త ఆశలు.
సింహం: సన్నిహితులతో మాటపట్టింపులు. ఆధ్యాత్మిక చింతన. పనుల్లో ప్రతిబంధకాలు. అనుకోని ప్రయాణాలు. కుటుంబంలో ఒత్తిడులు. వ్యాపారాలు, ఉద్యోగాలు మందగిస్తాయి.
కన్య: రుణదాతల ఒత్తిడులు. ఆలయ దర్శనాలు. పనుల్లో అవాంతరాలు. అనుకోని ప్రయాణాలు. ఇంటాబయటా సమస్యలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొన్ని మార్పులు.
తుల: ఒక ఆహ్వానం సంతోషం కలిగిస్తుంది. వ్యవహారాలు విజయవంతంగా సాగుతాయి. ధన, వస్తులాభాలు. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో మరింత ప్రోత్సాహం.
వృశ్చికం: బంధువులతో మాటపట్టింపులు. ఆలయాలు సందర్శిస్తారు. పనుల్లో జాప్యం. ఆకస్మిక ప్రయాణాలు. ధనవ్యయం. వ్యాపారాలు, ఉద్యోగాలు గందరగోళంగా ఉంటాయి.
ధనుస్సు: బంధువులతో వివాదాలు సర్దుబాటు కాగలవు. ఆర్థిక ఇబ్బందులు తొలగుతాయి. చిన్ననాటి మిత్రుల నుంచి ఆహ్వానాలు. వ్యాపారాలు పుంజుకుంటాయి. ఉద్యోగాలలో పదోన్నతులు.
మకరం: వ్యవహారాలలో స్వల్ప అవాంతరాలు. అనుకోని ప్రయాణాలు. బంధువులతో వివాదాలు. కొన్ని ఒప్పందాలు వాయిదా. వ్యాపారాలు, ఉద్యోగాలలో చికాకులు.
కుంభం: నూతన విద్యావకాశాలు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. వస్తులాభాలు. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో అవరోధాలు తొలగుతాయి.
మీనం: పనుల్లో జాప్యం. ఆర్థిక ఇబ్బందులు. దూరప్రయాణాలు. బంధుగణంతో తగాదాలు. ఆరోగ్య సమస్యలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొద్దిపాటి చికాకులు. దైవదర్శనాలు.
– సింహంభట్ల సుబ్బారావు
Comments
Please login to add a commentAdd a comment