100 అత్యంత విశ్వసనీయ బ్రాండ్లలో ఎస్‌బీఐ | 100 of the most trusted brands in the SBI | Sakshi
Sakshi News home page

100 అత్యంత విశ్వసనీయ బ్రాండ్లలో ఎస్‌బీఐ

Published Fri, Nov 27 2015 1:37 AM | Last Updated on Sun, Sep 3 2017 1:04 PM

100 అత్యంత విశ్వసనీయ బ్రాండ్లలో ఎస్‌బీఐ

100 అత్యంత విశ్వసనీయ బ్రాండ్లలో ఎస్‌బీఐ

ముంబై: దేశంలో అత్యంత విశ్వసనీయ 100 బ్రాండ్లలో ఒకటిగా ప్రభుత్వ బ్యాంకింగ్ దిగ్గజం... స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) నిలిచింది. 2015కు సంబంధించి నీల్సన్ సర్వే ఈ విషయాన్ని ప్రకటించింది. 100 బ్రాండ్లలో ఒకటిగా నిలిచిన ఏకైక బ్యాంక్ ఎస్‌బీఐ కావడం గమనార్హం. అత్యంత విలువైన బ్యాంకింగ్ బ్రాండ్‌గా సర్వే పేర్కొంది. పైగా తన స్థానాన్ని గత ఏడాదితో పోల్చితే బ్యాంక్ 39 నుంచి 35కు మెరుగుపరచుకోవడం మరో విశేషం. దేశంలోని 12 పట్టణాల్లో అధ్యయనం ద్వారా సర్వే ఈ జాబితాను రూపొందించింది. ప్రాంతం, ఆదా యం, సామాజిక ఆర్థిక అంశాలు తదితరాల ప్రాతిపదికన 7,200 శాంపిల్స్ సమగ్ర అధ్యయనం ద్వారా నీల్సన్ సర్వే వెలువడింది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement