విమాన ప్రయాణికుల్లో 23% వృద్ధి
న్యూఢిల్లీ: విమాన ప్రయాణికుల పెరుగుదలలో బలమైన వృద్ధి నమోదవుతోంది. తాజాగా దేశీ విమాన ప్రయాణికుల వృద్ధి అక్టోబర్‌లో 23.2 శాతంగా నమోదరుుంది. వివిధ విమానయాన కంపెనీలు ఈ నెలలో మొత్తంగా 86.72 లక్షల మంది ప్రయాణికులను గమ్యస్థానాలకు చేర్చారుు. ఎప్పటిలాగే ఇండిగో 42.6 శాతం మార్కెట్ వాటాతో ఇప్పుడు కూడా అగ్రస్థానంలో నిలిచింది. ఈ విషయాలను ఏవియేషన్ రెగ్యులేటర్ డీజీసీఏ తన నివేదికలో వెల్లడించింది.
దీని తర్వాతి స్థానంలో జెట్ ఎరుుర్‌వేస్ (14.7%), ఎరుుర్ ఇండియా (13%), స్పైస్‌జెట్ (12.9%). గోఎరుుర్ (7.9 శాతం), ఎరుుర్‌ఏషియా ఇండియా (2.7%) వంటి తదితర కంపెనీలు ఉన్నారుు. ఇక్కడ ఎరుుర్ ఇండియా, జెట్ ఎరుుర్‌వేస్, గోఎరుుర్ మార్కెట్ వాటా గత నెలతో పోలిస్తే తగ్గింది. ఇదే సమయంలో ఇండిగో, స్పైస్‌జెట్, ఎరుుర్‌ఏషియా ఇండియా మార్కెట్ వాటా స్వల్పంగా పెరిగింది.