మార్చిలో ఆదిత్య 2 ప్రాజెక్ట్‌లు రెడీ!
ఇంపీరియల్ హైట్స్, ఎంప్రస్ టవర్స్ గృహ ప్రవేశాలు
సాక్షి, హైదరాబాద్: నిర్మాణంలో నాణ్యత.. గడువులోగా ఫ్లాట్ల అప్పగింతకు పెట్టింది పేరైన ఆదిత్య కన్‌స్ట్రక్షన్స్‌లో గృహ ప్రవేశాల సందడి మొదలైంది. ఇప్పటివరకు 27 ప్రాజెక్ట్‌లను కొనుగోలుదారులకు అప్పగించిన ఆదిత్య.. మార్చి ముగింపు నాటికి ఇంపీరియల్ హైట్స్, ఎంప్రస్ టవర్స్‌ను అప్పగించేందుకు రెడీ అవుతున్నామని సంస్థ ఈడీ సత్యనారాయణ ‘సాక్షి రియల్టీ’కి చెప్పారు.
⇔ హఫీజ్‌పేట్‌లోని ఇంపీరియల్ హైట్స్‌లో 9 బ్లాకుల్లో మొత్తం 980 ఫ్లాట్లు. ఇందులో ఆరున్నర బ్లాకుల్లో 660 ఫ్లాట్లు మావి. మిగిలినవి ల్యాండ్ ఓనర్‌వి. ఇప్పటికే 4 బ్లాకుల్లో 430 ఫ్లాట్లు గృహ ప్రవేశానికి రెడీగా ఉన్నాయి. రిజిస్ట్రేషన్స్ కూడా జరుగుతున్నాయి. ల్యాండ్ ఓనర్‌కు చెందిన 230 ఫ్లాట్లు ఈ నెలాఖరులోగా, మార్చి ముగింపు నాటికి మిగిలిన ఫ్లాట్లను మొత్తంగా ప్రాజెక్ట్‌నే కొనుగోలుదారులకు అప్పగించేస్తాం. షేక్‌పేట్‌లోని ఎంప్రస్ టవర్స్‌లో 5 టవర్లో మొత్తం 722 ఫ్లాట్లు. వీటిని కూడా మార్చి ముగింపు నాటికి కొనుగోలుదారులకు అప్పగిస్తాం.
⇔ నిర్మాణంలోని, కొత్త ప్రాజెక్ట్‌ల విషయానికొస్తే.. షేక్‌పేట్‌లో 5 ఎకరాల్లో 3 టవర్లను నిర్మించనున్నాం. తొలి దశలో ఫెయిర్ మౌంట్, బ్యూమౌంట్ రెండు టవర్లను గతేడాది ఆగస్టులో ప్రారంభించాం. ఫెయిర్ మౌంట్‌లో 110 ఫ్లాట్లు. ఇందులో 102 ఫ్లాట్లు విక్రయించేశాం. 1,700– 2,100 చ.అ. ఫ్లాట్ల విస్తీర్ణాలుంటాయి. బ్యూమౌంట్‌లో 22 అంతస్తుల్లో మొత్తం 175 ఫ్లాట్లు. ఇందులో కూడా 70 ఫ్లాట్లు విక్రయించేశాం. 1,700– 2,100 చ.అ. మధ్య ఫ్లాట్ల విస్తీర్ణాలున్నాయి. ధర చ.అ.కు రూ.5,750. ఏప్రిల్‌లో ఫ్లెమింగ్ టన్ పేరిట మూడో టవర్‌ను ప్రారంభించనున్నాం. ఇందులో 220 ఫ్లాట్లుంటాయి. ధర చ.అ.కు రూ.6,250. నాలుగున్నర ఏళ్లలో 3 టవర్లను పూర్తి చేస్తాం.
⇔ హైటెక్‌సిటీలో 10 ఎకరాల్లో క్యాపిటల్ హైట్స్ ప్రాజెక్ట్‌ను ప్రారంభించాం. తొలి టవర్‌లో 16 అంతస్తుల్లో 196 ఫ్లాట్లుంటాయి. ఇందులో 125 ఫ్లాట్లు మావి. ఇప్పటికే 110 ఫ్లాట్లను విక్రయించేశాం. 1,650–2,100 చ.అ. మధ్య ఫ్లాట్ల విస్తీర్ణాలుంటాయి. ధర చ.అ.కు రూ.4,500. రెండో టవర్‌ను మార్చి నెలలో, ఫేజ్–2లో మరో 5 ఎకరాల్లో మరో ప్రాజెక్ట్‌ను మే–జూన్ నెలలో ప్రారంభిస్తాం.
⇔ గాజులరామారంలోని శంశిగూడలో 10 ఎకరాల్లో ప్రా జెక్ట్‌ను చేయనున్నాం. 7 అంతస్తుల్లో 800– 900 ఫ్లాట్లను నిర్మిస్తాం. ఆదిత్య కొనుగోలుదారులకు 200% అప్రిసియేషన్ వచ్చిందని చెప్పేందుకు గర్వంగా ఉంది.