న్యూఢిల్లీ: ఆన్‌లైన్ షాపింగ్ దిగ్గజం అమెజాన్ .. భారత్‌లో ఆర్థిక సేవలను మరింతగా విస్తరించడంపై దృష్టి పెడుతోంది. ఇందులో భాగంగా బీమా సర్వీసులు కూడా అందించేందుకు సిద్ధమవుతోంది. దీనికోసం రిజిస్ట్రార్ ఆఫ్ కంపెనీస్‌కు (ఆర్‌వోసీ) సంబంధిత పత్రాలు దాఖలు చేసింది.
వీటి ప్రకారం లైఫ్, హెల్త్, జనరల్ ఇన్సూరెన్స్ పాలసీల విక్రయం, సర్వీసులకు సంబంధించి కార్పొరేట్ ఏజెంటుగా వ్యాపార కార్యకలాపాలు ప్రారంభించాలని అమెజాన్ యోచిస్తోంది. అయితే, దీనికోసం ఇంకా బీమా రంగ నియంత్రణ సంస్థ ఐఆర్‌డీఏఐ నుంచి అమెజాన్ అనుమతులు తీసుకోవాల్సి ఉన్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. అటు అమెజాన్ వర్గాలు బీమా ప్రణాళికలను ధృవీకరించాయి. చెల్లింపుల సర్వీసులు అందించే అమెజాన్ పే... బీమా రంగ సేవలపై దృష్టి పెడుతున్నట్లు పేర్కొన్నాయి.
ఇప్పటికే బరిలో ఫ్లిప్‌కార్ట్, పేటీఎం..: అమెరికా రిటైల్ దిగ్గజం వాల్‌మార్ట్ నుంచి ఇటీవలే నిధులు సమకూర్చుకున్న దేశీ ఆన్‌లైన్ షాపింగ్ సంస్థ ఫ్లిప్‌కార్ట్ ఇప్పటికే బీమా పాలసీల విక్రయంపై దృష్టి పెట్టింది. లైఫ్, జనరల్ ఇన్సూరెన్స్ పాలసీల విక్రయం కోసం నియంత్రణ సంస్థ అనుమతులు కోరింది. అటు చెల్లింపుల సేవల సంస్థ పేటీఎం ఇప్పటికే కార్పొరేట్ ఏజెన్సీ లైసెన్సు పొందింది.
Comments
Please login to add a commentAdd a comment