ఈ-కామర్స్‌లోకి అరవింద్... | Arvind Ltd forays into e-commerce with custom clothing brand Creyate | Sakshi
Sakshi News home page

ఈ-కామర్స్‌లోకి అరవింద్...

Published Tue, Aug 19 2014 11:28 PM | Last Updated on Sat, Sep 2 2017 12:07 PM

Arvind Ltd forays into e-commerce with custom clothing brand Creyate

న్యూఢిల్లీ: ప్రముఖ టెక్స్‌టైల్స్ సంస్థ అర్‌వింద్ ఈ-కామర్స్ విభాగంలోకి ప్రవేశించింది. కొత్తగా ఆన్‌లైన్ విభాగం అర్‌వింద్ ఇంటర్నెట్ లిమిటెడ్(ఏఐఎల్)ను ఏర్పాటు చేస్తున్నామని అర్వింద్ ఎగ్జిక్యూటివ్ డెరైక్టర్ కులిన్ లాల్‌భాయ్ మంగళవారం వెల్లడించారు. తమ గ్రూప్ ఈ-కామర్స్ కార్యకలాపాలను ఏఐఎల్ చూస్తుందని, మూడేళ్లలో రూ.1,000  కోట్లు రాబడి సాధించడం లక్ష్యమని పేర్కొన్నారు.

 తమ గ్రూప్ వృద్ధికి కీలకమైన చోదక శక్తిగా ఈ-కామర్స్ విభాగం నిలుస్తుందని భావిస్తున్నామని వివరించారు.తమ కస్టమ్ క్లోతింగ్ బ్రాండ్, క్రేయేట్‌తో ఈ కామర్స్‌లోకి వస్తున్నామని తెలిపారు. వచ్చే ఏడాదికల్లా రూ.100 కోట్ల బ్రాండ్‌గా ఎదగడం లక్ష్యమని వివరించారు.  రెడిమేడ్ దుస్తులకు ప్రత్యామ్నాయంగా  క్రేయేట్ నిలుస్తుందని, వచ్చే ఏడాది 15 నగరాల్లో ఈ స్టోర్స్‌ను ప్రారంభించనున్నామని పేర్కొన్నారు. ఇప్పటికే బెంగళూరు, అహ్మదాబాద్, ఢిల్లీలో స్టోర్స్‌ను నిర్వహిస్తున్నామని తెలిపారు. వచ్చే ఏడాది క్రేయేట్‌ను అమెరికా మార్కెట్లోకి విస్తరిస్తామని వివరించారు. వచ్చే ఆర్థిక సంవత్సరంలో పూర్తి స్థాయి ఆన్‌లైన్ రిటైల్ సైట్‌ను ప్రారంభించే అవకాశాలున్నాయని లాల్‌భాయ్ పేర్కొన్నారు.

Advertisement
Advertisement