ఆసుస్ ఈబుక్ ఎక్స్205 @ రూ.14,999 | Asus EeeBook X205 preview | Sakshi
Sakshi News home page

ఆసుస్ ఈబుక్ ఎక్స్205 @ రూ.14,999

Published Thu, Jan 22 2015 1:26 AM | Last Updated on Sat, Sep 2 2017 8:02 PM

ఆసుస్ ఈబుక్ ఎక్స్205 @ రూ.14,999

ఆసుస్ ఈబుక్ ఎక్స్205 @ రూ.14,999

న్యూఢిల్లీ: ఆసుస్ కంపెనీ కొత్తగా కాంపాక్ట్ కంప్యూటింగ్ డివైస్, ఆసుస్ ఈబుక్ ఎక్స్205ను మార్కెట్లోకి తెచ్చింది. ఈ డివైస్ ధర రూ.14,999 అని ఆసుస్ ఇండియా కంట్రీ మేనేజర్(సిస్టమ్ బిజినెస్ గ్రూప్) పీటర్ చంగ్ చెప్పారు. కేజీ కంటే తక్కువ బరువుండే దీనిని  విద్యార్ధులు, యువ ప్రొఫెషనల్స్ కోసం రూపొందించామని వివరించారు. విండోస్ 8.1 ఆపరేటింగ్ సిస్టమ్‌పై పనిచేసే ఈ డివైస్‌లో 11.6 అంగుళాల డిస్‌ప్లే, ఇంటెల్ ఆటమ్ క్వాడ్‌కోర్ ప్రాసెసర్, 2జీబీ ర్యామ్, 32 జీబీ ఆన్‌బోర్డ్ మెమరీ, 128 జీబీ ఎక్స్‌పాండబుల్ మెమరీ, 500 జీబీ క్లౌడ్ స్టోరేజ్ స్పేస్, వీజీఏ కెమెరా వంటి ఫీచర్లున్నాయని పేర్కొన్నారు.

ఫ్లిప్‌కార్ట్ ద్వారా దీనిని విక్రయిస్తామని,  తర్వాత ఆసుస్ ఎక్స్‌క్లూజివ్ స్టోర్స్‌లో అందుబాటులోకి తెస్తామని వివరించారు, ఆకర్షణీయమైన ఫీచర్లున్న నెట్‌బుక్స్‌కు భారత మార్కెట్లో డిమాండ్ ఉండగలదని వివరించారు. రానున్న నెలల్లో మరిన్ని నెట్‌బుక్స్‌ను మార్కెట్లోకి తెస్తామని, ఈ ఏడాది 50 వేల నెట్‌బుక్‌లు అమ్మడం లక్ష్యమని తెలిపారు.

Advertisement

Related News By Category

Advertisement
 
Advertisement
Advertisement