బీఎస్‌ఈ ఎక్చ్సేంజ్ రేపు(జూన్ 7న) రెండు కంపెనీల షేర్లను డీలిస్ట్(జాబితా నుంచి తొలగింపు) చేయనుంది. సోనికా గ్లోబల్ ఇన్ఫ్రాప్రాజెక్ట్ లిమిటెడ్, దాల్మీయా ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంపెనీలు ఇందులో ఉన్నాయి. చాలాకాలంగా ట్రేడింగ్ జరగకుండా, స్తబ్దంగా ఉన్న ఈ 2కంపెనీల షేర్లను ఎక్చ్సేంజ్ జాబితా నుంచి డీలిస్ట్ చేస్తున్నట్లు బీఎస్‌ఈ ఒక ప్రకటనలో తెలిపింది. ఎక్ఛ్సేంజ్ ప్లాట్‌ఫామ్ నుంచి ఈ కంపెనీల షేర్లను ఉపసంహరిస్తున్నామని, ఈ డీలిస్టింగ్ ఆరు నెలల పాటు అమల్లో ఉంటుందని బీఎస్‌ఈ పేర్కోంది.
అలాగే ఈ కంపెనీలకు చెందిన పూర్తికాల డైరెక్టర్లు, ప్రమోటర్లు 10ఏళ్ల వరకు సెక్యూరిటీస్ మార్కెట్ నుంచి దూరంగా ఉండాల్సి వస్తుందని ఎక్చ్సేంజ్ తెలిపింది. పబ్లిక్ షేర్‌హోల్డర్ల నుంచి ప్రమోటర్లు ఈ కంపెనీ వాటాలను సొంతం చేసుకోవాలనుకుంటే ఎక్చ్సేంజ్ నియమించిన స్వతంత్ర మదింపుదారు నిర్ణయించిన ధరకే వాటాలను కొనుగోలు చేయాల్సి ఉంటుందని బీఎస్‌ఈ తెలిపింది.
Comments
Please login to add a commentAdd a comment