బీఎస్ఎన్ఎల్ నుంచి ఫ్రీడమ్ ప్లాన్ | BSNL offers Freedom Plan for pre-paid mobile services | Sakshi
Sakshi News home page

బీఎస్ఎన్ఎల్ నుంచి ఫ్రీడమ్ ప్లాన్

Published Sat, Oct 29 2016 12:37 AM | Last Updated on Mon, Sep 4 2017 6:35 PM

బీఎస్ఎన్ఎల్ నుంచి ఫ్రీడమ్ ప్లాన్

బీఎస్ఎన్ఎల్ నుంచి ఫ్రీడమ్ ప్లాన్

న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ టెలికం కంపెనీ ‘బీఎస్‌ఎన్‌ఎల్’ తాజాగా తన ప్రి-పెయిడ్ మొబైల్ కస్టమర్ల కోసం ‘ఫ్రీడమ్ ప్లాన్’ను ఆవిష్కరించింది. ప్లాన్ ధర రూ.136గా, వాలిడిటీ 730 రోజలుగా ఉంది. యూజర్లు ఈ ప్లాన్‌లో భాగంగా లోకల్/ఎస్‌టీడీ కాల్స్‌ను హోమ్/రోమింగ్ నుంచి ఏ నెట్‌వర్క్‌కైనా తొలి నెల రోజులపాటు నిమిషానికి కేవలం 25 పైసలతో కాల్ చేసుకోవచ్చని బీఎస్‌ఎన్‌ఎల్ తెలిపింది. దీంతోపాటు 1 జీబీ వరకు డేటాను ఉచితంగా పొందొచ్చని (నెల రోజుల వాలిడిటీ) పేర్కొంది. నెల రోజుల తర్వాత కాల్ చార్జీలు సెకన్‌కు 1.3 పైసలుగా ఉంటాయని  వివరించింది.

 ఫ్రీడమ్ ప్లాన్‌ను ఎంచుకున్న కస్టమర్లకు రూ.577, రూ.377, రూ.178 ధరల్లో మూడు రకాల ప్రత్యేకమైన టాప్-అప్స్ అందుబాటులో ఉంటాయని పేర్కొంది. అంటే రూ.577తో రీచార్జ్ చేసుకుంటే కస్టమర్‌కు రూ.577 పూర్తి టాక్‌టైమ్‌తోపాటు 1 జీబీ డేటా (నెల రోజుల వాలిడిటీ) వస్తుంది. అదే రూ.377తో రీచార్జ్‌తో చేసుకుంటే 300 ఎంబీ (20 రోజుల వాలిడిటీ), రూ.178తో రీచార్జ్ చేసుకుంటే 200 ఎంబీ డేటా (10 రోజలు వాలిడిటీ) వస్తుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement