ఫ్లిప్‌కార్ట్‌ బిగ్‌ షాపింగ్‌ డేస్‌ : భారీ డిస్కౌంట్లు | Flipkart's Big Shopping Days sale: Apple iPhone X sees price drop | Sakshi
Sakshi News home page

ఫ్లిప్‌కార్ట్‌ బిగ్‌ షాపింగ్‌ డేస్‌ : భారీ డిస్కౌంట్లు

Published Thu, Dec 7 2017 11:57 AM | Last Updated on Wed, Aug 1 2018 3:40 PM

Flipkart's Big Shopping Days sale: Apple iPhone X sees price drop - Sakshi

ఈ-కామర్స్‌ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్‌ మరోసారి డిస్కౌంట్ల పండుగకు తెరతీసింది. రెండు రోజుల 'బిగ్‌ షాపింగ్‌ డేస్‌' సేల్‌ను నేటి మధ్యాహ్నం నుంచి ఆవిష్కరిస్తోంది. ఈ సేల్‌లో భాగంగా అన్ని కేటగిరీల్లోని బ్రాండ్లపై భారీ డిస్కౌంట్లను ప్రకటించింది. ఈ సేల్‌ స్పెషల్‌ అట్రాక్షన్‌గా ఆపిల్‌ ఐఫోన్‌ ఎక్స్‌, గూగుల్‌ పిక్సెల్‌ 2 మొబైల్‌ ఫోన్లు ఉండనున్నాయి. ఐఫోన్‌ ఎక్స్‌ లిమిటెడ్‌ స్టాక్‌ సేల్‌తో ఫ్లిప్‌కార్ట్‌ నేటి మధ్యాహ్నం నుంచి లైవ్‌లోకి వస్తుంది. రూ.89వేల వద్ద సేల్‌ ప్రారంభమవుతుంది. ఎవరైతే ఎస్‌బీఐ డెబిట్‌ కార్డులు వాడి లావాదేవీ చేపడతారో వారికి, అదనంగా రూ.5000 ఇన్‌స్టాంట్‌ డిస్కౌంట్లను అందిస్తుంది. ఐఫోన్‌ ఎక్స్‌ ఫోన్‌పై నో-కాస్ట్‌ ఈఎంఐను కూడా తీసుకొచ్చింది. అతిపెద్ద సెల్లింగ్‌ కేటగిరీగా ఉంటున్న మొబైల్‌ ఫోన్లు, ఎలక్ట్రానిక్స్‌పై కంపెనీ ఎక్కువగా ఫోకస్‌ చేసింది.

మరో స్టార్‌ అట్రాక్షన్‌ గూగుల్‌ పిక్సెల్‌ 2 స్మార్ట్‌ఫోన్లపై భారీ డిస్కౌంట్లను ఆఫర్‌ చేయడం. గూగుల్‌ పిక్సెల్‌ 2 స్మార్ట్‌ఫోన్‌ను రూ.39,999కు లేదా అంతకంటే తక్కువకు అందించనుంది. గూగుల్‌ పిక్సెల్‌ 2 అసలు ధర 61వేల రూపాయలు. శాంసంగ్‌ ఆన్‌ నెక్ట్స్‌, మోటో సీ ప్లస్‌, లెనోవో కే8 ప్లస్‌ స్మార్ట్‌ఫోన్లపై కూడా భారీ డిస్కౌంట్లను ఫ్లిప్‌కార్ట్‌ తీసుకొస్తుంది. ల్యాప్‌టాప్‌లు, హెడ్‌ఫోన్లు కూడా భారీ డిస్కౌంట్లను ఆఫర్‌ చేస్తుంది. సోనీ, జేబీఎల్‌ బ్రాండ్లపై 70 శాతం తగ్గింపును అందిస్తుంది. ఎస్‌బీఐ బ్యాంకుతో భాగస్వామ్యం ఏర్పరుచుకున్న ఫ్లిప్‌కార్ట్‌ వెబ్‌సైట్‌, బ్యాంకు క్రెడిట్‌ కార్డు లావాదేవీలకు అదనపు ఆఫర్లను ప్రకటిస్తుంది. ఈ ఆఫర్‌పై తక్షణమే 10 శాతం డిస్కౌంట్‌ను ఇస్తుంది. 
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement