ఫిలిప్ఫైన్స్ ఎయిర్‌పోర్టులపై జీఎంఆర్ దృష్టి
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఫిలిప్ఫైన్స్ ఎయిర్‌పోర్టులపై జీఎంఆర్ ఇన్‌ఫ్రా ప్రత్యేకంగా దృష్టిసారించింది. ఫిలిప్ఫైన్స్‌లో అభివృద్ధి చేయదల్చిన ఐదు ఎయిర్‌పోర్టుల కాంట్రాక్టులను భాగస్వామ్య కంపెనీతో కలిసి చేజిక్కించుకోవడానికి జీఎంఆర్ గ్రూపు ప్రణాళికలను సిద్ధం చేసుకుంటోంది. సుమారు రూ. 15,000 కోట్లతో పీపీపీ విధానంలో అభివృద్ధి చేయాలనుకున్న ఐదు ఎయిర్‌పోర్టుల కాంట్రాక్టులను చేజిక్కించుకోవడానికి ఆరు కంపెనీలు పోటీ పడుతున్నట్లు ఫిలిప్ఫైన్స్ ప్రభుత్వం వెల్లడించింది. ఇందులో జీఎంఆర్-మెగావైడ్ కంపెనీ కూడా ఉంది. ఈ భాగస్వామ్య కంపెనీ ఇప్పటికే వుక్టన్ సెబూ ఇంటర్నేషనల్ ఎరుుర్‌పోర్ట్‌ను అభివృద్ధి చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ వార్తల నేపథ్యంలో సోమవారం జీఎంఆర్ ఇన్‌ఫ్రా షేరు 4 శాతం పెరిగి రూ. 14.70 వద్ద ముగిసింది.