సాక్షి, న్యూఢిల్లీ : ఇరాక్‌లో అమెరికా దళాలపై ఇరాన్ ప్రతిదాడులతో మధ్యప్రాచ్యంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొన్న నేపథ్యంలో పసిడి ధరలు పరుగులు పెట్టాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో ఏడేళ్ల గరిష్టస్ధాయిలో ఔన్స్ బంగారం రెండు శాతం ఎగబాకి 1600 డాలర్ల మార్క్‌ను దాటింది. సురక్షిత పెట్టుబడి సాధనంగా మదుపుదారులు బంగారాన్ని ఎంచుకోవడంతో ఎల్లో మెటల్ భారమైంది. ఇరాక్‌లో అమెరికా బలగాలపై ఇరాన్ దాడులతో యుద్ధమేఘాలు ముసురుకోవడం ఈక్విటీ మార్కెట్లపై ఒత్తిడి పెంచి బంగారంలో కొనుగోళ్లు వెల్లువెత్తుతున్నాయి. రాజకీయ అనిశ్చితి, ఉద్రిక్తతలు ఇలాగే కొనసాగితే పసిడి మరింత పరుగులు పెట్టడం ఖాయమని నిపుణులు విశ్లేషిస్తున్నారు. మరోవైపు దేశీ మార్కెట్‌లోనూ బంగారం పైపైకి ఎగబాకుతూనే ఉంది. అంతర్జాతీయ ధరలకు అనుగుణంగా బుధవారం ఎంసీఎక్స్‌లో పదిగ్రాముల బంగారం దాదాపు రూ 400 పెరిగి రూ 41,042కు చేరింది.
Comments
Please login to add a commentAdd a comment