నేటితో స్వావలంబన్ యోజనకు ముగింపు...
ముంబై: మైక్రో పెన్షన్ స్కీమ్ ‘స్వావలంబన్ యోజన అండ్ ఎన్‌పీఎస్ లిట్ ’కు గురువారం (మార్చి 31) తెరపడనుంది. ఈ స్కీమ్ చందాదారులు ఏప్రిల్ 1 నుంచీ అతల్ పెన్షన్ యోజన (ఏపీవై)లోకి మారనున్నట్లు పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ డెవలప్‌మెంట్ అథారిటీ (పీఎఫ్‌ఆర్‌డీఏ) అధికారి ఒకరు తెలిపారు. ఏపీవైలోకి మారిన తర్వాత నేషనల్ పెన్షన్ స్కీమ్ (ఎన్‌పీఎస్) కింద లభించే ఆర్థిక ప్రయోజనం (ప్రభుత్వ కో-కాంట్రిబ్యూషన్) స్వావలంబన్ చందాదారులకూ అందుతుందని పేర్కొన్నారు. యూపీఏ ప్రభుత్వం 2010-11లో ప్రారంభించిన స్వావలంబన్ యోజనకు తగిన స్పందన కొరవడ్డంతో దీనిని కొనసాగించరాదని, ఈ చందాలను ఏపీవైకి మార్చి ఈ స్కీమ్ కింద అందుతున్న ప్రయోజనాలను అందించాలని కేంద్రం నిర్ణయించింది.