న్యూఢిల్లీ: ఐడీఎఫ్‌సీ లిమిటెడ్ కొత్త ఎండీ, సీఈవోగా కంపెనీలో ప్రస్తుత సీఎఫ్‌వో స్థానంలో ఉన్న సునీల్ కాకర్‌ను ఎంపిక చేసింది. జూలై 16 నుంచి మూడేళ్లు ఆయన సేవలు కొనసాగుతాయి. అడిషనల్ డైరెక్టర్‌గానూ ఆయన్ను బోర్డు నియమించింది. వీటికి వార్షిక వాటాదారుల సమావేశంలో ఆమోదం లభించాల్సి ఉంది. మరోవైపు ఐడీఎఫ్‌సీ ఎండీ, సీఈవో పదవికి విక్రమ్ లిమాయే సమర్పించిన రాజీనామానూ ఆమోదించింది. ఇది జూలై 15 నుంచి అమల్లోకి వస్తుందని కంపెనీ తెలిపింది. లిమాయే ఎన్‌ఎస్‌ఈ ఎండీ, సీఈవోగా బాధ్యతలు చేపట్టనున్న నేపథ్యంలో ఈ మార్పులు చోటుచేసుకున్నాయి.