యాక్ట్‌లో ఐవీఎఫ్‌ఏ, టీఏ అసోసియేట్స్ పెట్టుబడులు
నెల్లూరు(సెంట్రల్) : అట్రియా కన్వర్టెన్స్ టెక్నాలజీస్ (యాక్ట్) విలువను ప్రైవేటు ఈక్విటీ సంస్థలు ఐవీఎఫ్‌ఏ, టీఏ అసోసియేట్స్ రూ.3000 కోట్లుగా లెక్కగట్టాయి. కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ , తెలంగాణ రాష్ట్రాల్లో 7 లక్షల కంటే అధిక వినియోగదారులకు బ్రాడ్‌బ్యాండ్ సేవలు అందిస్తూ అత్యంత వేగవంతమైన ఇంటర్నెట్ అందించడంలో ఏసీటీ(యాక్ట్) మార్గదర్శిగా ఉందని ఐవీఎఫ్‌ఏకు చెందిన ప్రమోద్‌కాబ్రా అన్నారు. యాక్ట్ పెట్టుబడుల విషయమై బెంగళూరులో ఆదివారం జరిగిన ఒక కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ రూ. 3,000 కోట్ల విలువ ప్రకారం తాము ఆ సంస్థలో పెట్టుబడి చేసినట్లు వెల్లడించారు.
యాక్ట్ సీఈఓ బాలా మల్లాడి మాట్లాడుతూ కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో వృద్ధిపథంలో కొనసాగుతామన్నారు. తమ కార్యకలాపాలు ఉన్న ప్రాంతాలలో 500పై చిలుకు ఎస్‌డీ, హెచ్‌డీ చానల్స్, డీఏఎస్ ప్రాంతాల్లో అత్యాధునిక సేవలు అందిస్తున్నామన్నారు. యాక్ట్ గ్రూపు ఎండీ సుందరరాజు మాట్లాడుతూ ప్రపంచ స్థాయి సంస్థ టీఏ అసోసియేట్స్ చెప్పుకోదగిన చిన్న వాటాని యాక్ట్ సంస్థలో కొనుగోలు చేయడం ద్వారా రూ.1200 కోట్ల పెట్టుబడిని ప్రకటించిందని పేర్కొన్నారు.