
రూపాయి.. రయ్
• మరో 27 పైసలు అప్
• 67.36 వద్ద క్లోజ్; నెల గరిష్టం
ముంబై: రూపాయి లాభాలు కొనసాగుతున్నారుు. డాలర్‌తో రూపాయి మారకం గురువారం వరుసగా మూడో రోజూ బలపడింది. 27 పైసల లాభంతో 67.36 వద్ద ముగిసింది. ఇది దాదాపు నెల రోజుల గరిష్టం. ఎగుమతిదారుల, బ్యాంకుల డాలర్ల విక్రయాలు కొనసాగుతుండడంతో రూపాయి బలపడుతోంది. బుధవారం అమెరికా స్టాక్ సూచీలు లాభాల్లో ముగియడం, యూరోప్ కేంద్ర బ్యాంక్ ప్యాకేజీని మరికొంత కాలం కొనసాగించే అవకాశాలున్నాయన్న అంచనాలతో మన స్టాక్ మార్కెట్ లాభాల్లో ఉండడం సానుకూల ప్రభావం చూపిందని నిపుణులు పేర్కొన్నారు. ఇతర ఆసియా దేశాల కరెన్సీలు కూడా పుంజుకోవడం, విదేశీ నిధుల ప్రవాహం కూడా కలసి వచ్చిందని నిపుణులంటున్నారు. గత నెల 28న ఏడాది కనిష్టాన్ని తాకిన రూపాయి అప్పటి నుంచి 140 పైసలు పుంజుకుంది.