హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: దేశంలో అతిపెద్ద యానిమల్ హెల్త్ ఫార్ములేషన్స్ తయారీ సంస్థగా బయోలాజికల్ కంపెనీ ఇండియన్ ఇమ్యునోలాజికల్స్(ఐఐఎల్) రికార్డు సృష్టించింది. రూ. 250 కోట్లతో హైదరాబాద్‌లో నిర్మించిన రెండో యూనిట్ అందుబాటులోకి రావడంతో దేశంలో అతిపెద్ద యానిమల్ ఫార్ములేషన్ సంస్థగా రికార్డులకు ఎక్కినట్లు కంపెనీ విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంది. రంగారెడ్డి జిల్లాలో జినోమ్‌వ్యాలీ ఫేజ్3లో 47 ఎకరాల్లో నిర్మించిన ఈ యూనిట్‌కి జంతువుల ఆర్యోగానికి సంబంధించి 300 మిలియన్ ట్యాబ్లెట్లు, 100 మిలియన్ బోలస్, 20 మిలియన్ ఇంజెక్టబుల్ వయల్స్ తయారు చేసే సామర్థ్యం ఉంది.
వచ్చే 10 ఏళ్ల డిమాండ్‌ను దృష్టిలో పెట్టుకొని ఈ యూనిట్‌ను అభివృద్ధి చేసినట్లు ఐఐఎల్ డిప్యూటీ ఎండీ డాక్టర్ కె. ఆనంద్ కుమార్ తెలిపారు. ఈ కొత్త యూనిట్ రాకతో ఐఐఎల్ తయారీ యూనిట్ల సంఖ్య 5కి చేరింది. హైదరాబాద్‌లో గచ్చిబౌలి వద్ద ఇప్పటికే ఒక బయలాజికల్ యూనిట్ కంపెనీకి వుంది. ఊటీ, రాజ్‌కోట్, న్యూజిలాండ్‌ల్లో కంపెనీకి మూడు యూనిట్లు వున్నాయి.
ఇండియన్ ఇమ్యునోలాజికల్స్ రికార్డు
Published Tue, Oct 27 2015 1:05 AM | Last Updated on Sun, Sep 3 2017 11:31 AM
Advertisement
Advertisement