వందల కోట్లతో పశువుల వ్యాక్సిన్ల తయారీ యూనిట్‌ నిర్మాణం ప్రారంభం | iil Starts Construction Of Rs.700 Crore Veterinary Vaccine Manufacturing Facility In Hyderabad | Sakshi
Sakshi News home page

వందల కోట్లతో పశువుల వ్యాక్సిన్ల తయారీ యూనిట్‌ నిర్మాణం ప్రారంభం

Published Fri, Dec 29 2023 10:49 AM | Last Updated on Fri, Dec 29 2023 10:52 AM

iil Starts Construction Of Rs.700 Crore Veterinary Vaccine Manufacturing Facility In Hyderabad - Sakshi

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: వ్యాక్సిన్ల తయారీ దిగ్గజం ఇండియన్‌ ఇమ్యునలాజికల్స్‌ (ఐఐఎల్‌) నూతన ప్లాంటు నిర్మాణం ప్రారంభించింది. హైదరాబాద్‌ సమీపంలోని జీనోమ్‌వ్యాలీలో 14 ఎకరాల విస్తీర్ణంలో రూ.700 కోట్ల వ్యయంతో ఇది ఏర్పాటవుతోంది. గురువారం ఈ మేరకు నూతన కేంద్రం కోసం భూమి పూజను కంపెనీ నిర్వహించింది.

పశువులకు అవసరమయ్యే వ్యాక్సిన్లను ఇక్కడ తయారు చేస్తారు. ఏటా 30 కోట్ల యూనిట్ల వ్యాక్సిన్లను ఉత్పత్తి చేయగలిగే సామర్థ్యంతో ఇండియన్‌ ఇమ్యునాలాజికల్స్‌ ఈ ప్లాంటును స్థాపిస్తోంది. తయారీ కేంద్రం కార్యరూపంలోకి వస్తే ప్రత్యక్షంగా, పరోక్షంగా 750 మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయి.

‘హైదరాబాద్‌లోని ఈ కొత్త ప్లాంటు దేశానికి అంకితం. భారత్‌లో ఫుట్‌ అండ్‌ మౌత్‌ డిసీస్‌ (గాలికుంటు వ్యాధి) నిర్మూలనలో ఈ కేంద్రం సహాయపడుతుంది. అందుబాటు ధరలో వ్యాక్సిన్ల అభివృద్ధి, తయారీలో ఐఐఎల్‌ సామర్థ్యం ఖజానాకు రూ. వేల కోట్లను ఆదా చేసింది’ అని ఎన్‌డీడీబీ, ఐఐఎల్‌ చైర్మన్‌ మీనేశ్‌ షా ఈ సందర్భంగా తెలిపారు. 
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement