IIL
-
వందల కోట్లతో పశువుల వ్యాక్సిన్ల తయారీ యూనిట్ నిర్మాణం ప్రారంభం
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: వ్యాక్సిన్ల తయారీ దిగ్గజం ఇండియన్ ఇమ్యునలాజికల్స్ (ఐఐఎల్) నూతన ప్లాంటు నిర్మాణం ప్రారంభించింది. హైదరాబాద్ సమీపంలోని జీనోమ్‌వ్యాలీలో 14 ఎకరాల విస్తీర్ణంలో రూ.700 కోట్ల వ్యయంతో ఇది ఏర్పాటవుతోంది. గురువారం ఈ మేరకు నూతన కేంద్రం కోసం భూమి పూజను కంపెనీ నిర్వహించింది. పశువులకు అవసరమయ్యే వ్యాక్సిన్లను ఇక్కడ తయారు చేస్తారు. ఏటా 30 కోట్ల యూనిట్ల వ్యాక్సిన్లను ఉత్పత్తి చేయగలిగే సామర్థ్యంతో ఇండియన్ ఇమ్యునాలాజికల్స్ ఈ ప్లాంటును స్థాపిస్తోంది. తయారీ కేంద్రం కార్యరూపంలోకి వస్తే ప్రత్యక్షంగా, పరోక్షంగా 750 మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయి. ‘హైదరాబాద్‌లోని ఈ కొత్త ప్లాంటు దేశానికి అంకితం. భారత్‌లో ఫుట్ అండ్ మౌత్ డిసీస్ (గాలికుంటు వ్యాధి) నిర్మూలనలో ఈ కేంద్రం సహాయపడుతుంది. అందుబాటు ధరలో వ్యాక్సిన్ల అభివృద్ధి, తయారీలో ఐఐఎల్ సామర్థ్యం ఖజానాకు రూ. వేల కోట్లను ఆదా చేసింది’ అని ఎన్డీడీబీ, ఐఐఎల్ చైర్మన్ మీనేశ్ షా ఈ సందర్భంగా తెలిపారు. -
ఇండియన్ ఇమ్యునోలాజికల్స్ రికార్డు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: దేశంలో అతిపెద్ద యానిమల్ హెల్త్ ఫార్ములేషన్స్ తయారీ సంస్థగా బయోలాజికల్ కంపెనీ ఇండియన్ ఇమ్యునోలాజికల్స్(ఐఐఎల్) రికార్డు సృష్టించింది. రూ. 250 కోట్లతో హైదరాబాద్‌లో నిర్మించిన రెండో యూనిట్ అందుబాటులోకి రావడంతో దేశంలో అతిపెద్ద యానిమల్ ఫార్ములేషన్ సంస్థగా రికార్డులకు ఎక్కినట్లు కంపెనీ విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంది. రంగారెడ్డి జిల్లాలో జినోమ్‌వ్యాలీ ఫేజ్3లో 47 ఎకరాల్లో నిర్మించిన ఈ యూనిట్‌కి జంతువుల ఆర్యోగానికి సంబంధించి 300 మిలియన్ ట్యాబ్లెట్లు, 100 మిలియన్ బోలస్, 20 మిలియన్ ఇంజెక్టబుల్ వయల్స్ తయారు చేసే సామర్థ్యం ఉంది. వచ్చే 10 ఏళ్ల డిమాండ్‌ను దృష్టిలో పెట్టుకొని ఈ యూనిట్‌ను అభివృద్ధి చేసినట్లు ఐఐఎల్ డిప్యూటీ ఎండీ డాక్టర్ కె. ఆనంద్ కుమార్ తెలిపారు. ఈ కొత్త యూనిట్ రాకతో ఐఐఎల్ తయారీ యూనిట్ల సంఖ్య 5కి చేరింది. హైదరాబాద్‌లో గచ్చిబౌలి వద్ద ఇప్పటికే ఒక బయలాజికల్ యూనిట్ కంపెనీకి వుంది. ఊటీ, రాజ్‌కోట్, న్యూజిలాండ్‌ల్లో కంపెనీకి మూడు యూనిట్లు వున్నాయి.