సనత్నగర్ లో కల్పతరు రెసిడెన్సీ! | kalpatharu residency in sanathnagar | Sakshi
Sakshi News home page

సనత్నగర్ లో కల్పతరు రెసిడెన్సీ!

Published Fri, Apr 15 2016 11:21 PM | Last Updated on Sun, Sep 3 2017 10:00 PM

సనత్నగర్ లో కల్పతరు రెసిడెన్సీ!

సనత్నగర్ లో కల్పతరు రెసిడెన్సీ!

5.5 ఎకరాల్లో తొలి ప్రీమియం ప్రాజెక్ట్ షురూ
572 ఫ్లాట్లు; ధర చ.అ.కు రూ.4,176

నిర్మాణ రంగంలో సుమారు అర్ధ శతాబ్ధం అనుభవం.. 1.7 కోట్ల చ.అ.ల్లో ప్రీమియం నివాస, వాణిజ్య సముదాయాల నిర్మాణాలు.. ఆసియాలోనే తొలి ఎల్‌ఈఈడీ ప్లాటినం సర్టిఫై పొందిన భవనం, 70 అంతస్తుల నివాస సముదాయాన్ని నిర్మించిన ఘనత.. నిర్మాణంలో నాణ్యత, గడువులోగా ప్రాజెక్ట్ పూర్తి.. ఆధునిక వసతులతో కూడిన ప్రాజెక్ట్‌ల నిర్మాణంలో పెట్టింది పేరు.. ఇదీ క్లుప్తంగా చెప్పాలంటే కల్పతరు సంస్థ గురించి! ముంబైకి చెందిన ఈ సంస్థ తొలిసారిగా భాగ్యనగరంలో ప్రీమియం ప్రాజెక్ట్‌తో రంగంలోకి దిగింది. సనత్‌నగర్‌లో రానున్న కల్పతరు రెసిడెన్సీ వివరాలను సంస్థ డెరైక్టర్ (సేల్స్) నరేంద్ర లోధా మాటల్లోనే..

ఎర్రగడ్డ బ్రిడ్జ్‌కు సమీపంలో ప్రధాన రహదారికి పక్కనే 5.5 ఎకరాల్లో ప్రీమియం ప్రాజెక్ట్‌ను నిర్మిస్తున్నాం. ఇందులో రెండు భారీ టవర్స్‌లో మొత్తం 576 ఫ్లాట్లొస్తాయి. ఒక్కో ఫ్లాట్ 1,200-2,000 చ.అ. మధ్య విస్తీర్ణాలుంటాయి. చ.అ. ధర రూ. 4,176గా నిర్ణయించాం. మొత్తంగా చూస్తే 2 బీహెచ్‌కే రూ.71 లక్షలు, 3 బీహెచ్‌కే రూ.82 లక్షలు, 3 బెడ్ గ్రాండ్ ధర రూ.92 లక్షలుంటాయి. ఈ ప్రాజెక్ట్‌ను మూడేళ్లలో పూర్తి చేస్తాం.

సాక్షి, హైదరాబాద్: ప్రాజెక్ట్ మొత్తం స్థలంలో 26 శాతం మాత్రమే నిర్మాణాలుంటాయి. మిగతాదంతా ఓపెన్ స్పేసే. హరిత భవనాల ప్రమాణాలకు అనుగుణంగానే ఈ ప్రాజెక్ట్‌ను రూపొందిస్తున్నాం. నీరు, విద్యుత్ పున ర్వినియోగం, సౌర విద్యుత్ ఏర్పాట్ల వంటి వాటితో ఎకో ఫ్రెండ్లీ ప్రాజెక్ట్ కావటంతో ఇండియన్ గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్ (ఐజీబీసీ) ప్లాటినం రేటెడ్ ప్రీ సర్టిఫైడ్ పొందింది కల్పతరు రెసిడెన్సీ.

నగరానికి చెందిన ప్రముఖ ఆర్కిటెక్చర్ జెనిసిస్ ప్లానర్స్ ప్రై.లి. కల్పతరు రెసిడెన్సీ ఆర్కిటెక్చర్. ల్యాండ్‌స్కేప్ ఆర్కిటెక్ట్‌గా దుబాయ్‌కు చెందిన డబ్ల్యూఏహెచ్‌ఓ సంస్థ ఉంది. ప్రతీ ఫ్లాట్‌కు మూడు వైపులా ఖాళీ స్థలం ఉండేలా ప్రాజెక్ట్‌ను డిజైన్ చేశాం.

వసతుల విషయానికొస్తే.. సెంట్రల్ ల్యాండ్ స్కేప్, చెస్‌కోర్ట్, అత్యాధునిక జిమ్, మల్టీ ఫంక్షన్ క్లబ్, ఇండోర్, ఔట్‌డోర్ గేమ్స్, స్విమ్మింగ్ పూల్ వంటి అన్ని రకాల అత్యాధునిక వసతులుంటాయి.

 మొత్తం 9.5 ఎకరాల స్థలాన్ని 2008 సంవత్సరంలో బ్రిటీష్ ఆక్సిజెన్ సంస్థ నుంచి రూ.80 కోట్లతో కొనుగోలు చేశాం. స్థానిక రాజకీయాంశం కారణంగా ఇన్నాళ్లు నిర్మాణ పనులను ప్రారంభించలేదు. అయితే ఇప్పుడు ప్రభుత్వ అభివృద్ధి నిర్ణయాలు, ప్రోత్సాహకర పనితీరును చూసి దేశ, విదేశీ సంస్థలు ఇక్కడికొస్తున్నాయని అందుకే మేం కూడా ప్రాజెక్ట్‌ను ప్రారంభించేందుకు ఇదే సరైన సమయమని నిర్ణయిం చుకున్నాం.

1969 నుంచి ఈ రంగంలో ఉన్నాం. ముంబై, థానే, లోనావాలా, పన్వేల్, ఇండోర్, చెన్నై వంటి ప్రాంతాల్లో నివాస, వాణిజ్య సముదాయాలను నిర్మించాం. గతంలో హైదరాబాద్‌లో డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్, విప్రో ఐటీ క్యాంపస్ వంటి పలు సంస్థలకు కార్పొరేట్ ఆఫీసులను నిర్మించాం కూడా.

Advertisement
Advertisement