కేంద్రానికి ఎల్‌ఐసీ రూ.1804 కోట్ల చెక్కు
న్యూఢిల్లీ: సంస్థ మిగులుకు సంబంధించి రూ.1,804.35 కోట్ల చెక్కును ప్రభుత్వ రంగ బీమా దిగ్గజ సంస్థ- లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ఎల్‌ఐసీ) కేంద్రానికి సమర్పించింది. 2015 మార్చి ముగింపు నాటికి వాస్తవ విలువ మిగుల్లో ఈ మేరకు కేంద్రం వాటాను సమర్పించినట్లు ఎల్‌ఐసీ పేర్కొంది. న్యూఢిల్లీలో జరిగిన ఒక కార్యక్రమంలో సంస్థ చైర్మన్ ఎస్‌కే రాయ్ ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీకి ఇందుకు సంబంధించి ఒక చెక్కును అందజేశారు. మిగుల్లో 95 శాతాన్ని బోనస్‌గా పాలసీ హోల్డర్లకు సంస్థ అందజేసింది. మిగిలిన ఐదు శాతం వాటా (రూ.1,804.35 కోట్లు) కేంద్రానిదని అధికార వర్గాలు తెలిపాయి.
ఆర్థిక కార్యదర్శి శక్తికాంతదాస్, ఆర్థిక వ్యవహారాల అదనపు కార్యదర్శి స్నేహలతా శ్రీవాస్తవ ఎల్‌ఐసీకి చెందిన సీనియర్ అధికారులు కార్యక్రమంలో పాల్గొన్నారు.