ఆన్‌లైన్‌లో రిలయన్స్ సిమెంట్
లక్నో: సిమెంట్ ఆన్‌లైన్ అమ్మకాలను రిలయన్స్ సిమెంట్ కంపెనీ (ఆర్‌సీసీ) ప్రారంభించింది. అనిల్ అంబానీ గ్రూప్ కంపెనీ రిలయన్స్ ఇన్‌ఫ్రాకు అనుబంధంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న ఈ సంస్థ మూడు రాష్ట్రాల్లో ఆన్‌లైన్ అమ్మకాలను ప్రారంభించిందని ఒక ప్రతినిధి తెలియజేశారు. ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, మహారాష్ట్రల్లో వినియోగదారులకు అందుబాటులోకి వచ్చే ఈ-టైలింగ్ సౌలభ్యం తదుపరి దశల్లో విస్తరిస్తామని ఆయన తెలిపారు. కనీసం 25 బ్యాగులు ఆర్డర్ చేయాల్సి ఉంటుంది. 48 గంటల్లో లోడ్ డెలివరీ అవుతుంది. సంస్థకు ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, మహారాష్ట్రల్లో కర్మాగారాలు ఉన్నాయి. వార్షిక ఉత్పత్తి సామర్థ్యం 5.5 మిలియన్ టన్నులు.