మోదీతో స్వరాజ్పాల్ సమావేశం
ప్రధాని నరేంద్రమోదీతో గురువారం ప్రముఖ ఎన్ఆర్ఐ పారిశ్రామికవేత్త లార్డ్ స్వరాజ్ పాల్ భేటీ అయ్యారు. 30 నిముషాల పాటు సాగిన ఈ సమావేశంలో ‘మేక్ ఇన్ ఇండియా’ కార్యక్రమం చర్చకు వచ్చింది. ఈ చొరవకు తన పూర్తి మద్దతు ఉంటుందని స్వరాజ్పాల్ ప్రధానికి హామీ ఇచ్చారు. భారత్ ఆర్థిక వ్యవస్థ పటిష్టతకు, చైనా ఆర్థిక వ్యవస్థతో పోటీకి ఈ కార్యక్రమం దోహదపడుతుందని సైతం పాల్ అభిప్రాయపడ్డారు.