ఇక కేవైసీ ఒకే ఒకసారి ఇస్తే చాలు... | NSE group firm, CERSAI unveil online C-KYC registry | Sakshi
Sakshi News home page

ఇక కేవైసీ ఒకే ఒకసారి ఇస్తే చాలు...

Published Thu, Aug 4 2016 1:49 AM | Last Updated on Mon, Sep 4 2017 7:40 AM

ఇక కేవైసీ ఒకే ఒకసారి ఇస్తే చాలు...

ఇక కేవైసీ ఒకే ఒకసారి ఇస్తే చాలు...

కేంద్రీకృత సర్వీసును ప్రారంభించిన ఎన్‌ఎస్‌ఈ
న్యూఢిల్లీ: ఎన్‌ఎస్‌ఈకు చెందిన డాట్‌ఈఎక్స్,  సెంట్రల్ సర్వర్ సెర్సాయ్ సంస్థలు ఆన్‌లైన్ సెంట్రలైజ్డ్ నో యువర్ కస్టమర్ (సీ-కేవైసీ) రికార్డ్ రిజిస్ట్రీని ప్రారంభించాయి. దీనివల్ల కస్టమరు బ్యాంకుకో, డీమ్యాట్ ఖాతాకో ఇలా ఏదో ఒకదానికి ఒకసారి నో యువర్ కస్టమర్ వివరాలిస్తే చాలు. అప్పుడొక సెంట్రలైజ్డ్ నంబరు కేటాయిస్తారు. ఆ తరవాత కే వైసీ వివరాలు ఎవరికివ్వాలన్నా... ఆ నంబరు ఇస్తే సరిపోతుంది. ఆ నంబరు తీసుకున్న ఆర్థిక సంస్థ ఆన్‌లైన్లో చెక్ చేసుకోవచ్చు కూడా.  కేవైసీ ప్రాసెస్‌ను, కేవేసీ రికార్డ్‌లను సమర్థవంతంగా వినియోగించుకోవడం లక్ష్యాలుగా ‘సీ-కేవైసీ’ని అందుబాటులోకి తెచ్చామని సెర్సాయ్ తెలిపింది.

Advertisement
Advertisement