
రూప్‌మంత్ర బ్రాండ్ అంబాసిడర్‌గా ప్రీతిజింటా
దివీస హెర్బల్ కేర్ ప్రముఖ రూప్ మంత్ర క్రీమ్‌కు బాలీవుడ్ నటి ప్రీతిజింటా బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరించనున్నారు. ఈ సందర్భంగా ముంబైలో జరిగిన ఒక విలేకరుల సమావేశంలో పాల్గొన్న ప్రీతిజింటా, దివిస హెర్బల్ కేర్ సహ వ్యవస్థాపకులు సంజీవ్ జునేజాలను చిత్రంలో చూడవచ్చు. ప్రముఖ హెర్బల్ బ్రాండ్‌కు అంబాసిడర్‌గా వ్యవహరించడం పట్ల సంతోషంగా ఉందని ప్రీతిజింటా ఈ సందర్భంగా పేర్కొన్నారు. కంపెనీ ప్రతి ప్రొడక్ట్ విజయం వెనుకా సిబ్బంది కృషి ఉందని జునేజా అన్నారు.