మార్కెట్లోకి కోటక్ ప్రీమియర్ పెన్షన్ ప్లాన్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో : కోటక్ లైఫ్ ఇన్య్సూరెన్స్ చీఫ్ రిస్క్ ఆఫీసర్ సునీల్ శర్మ బుధవారమిక్కడ ప్రీమియర్ పెన్షన్ ప్లాన్‌ను ప్రవేశ పెట్టారు. ప్రస్తుతం దేశ జనాభాలో 53 శాతం మందికి పెన్షన్ ప్లాన్స్ లేవని.. దీన్ని కోటక్ ప్రీమియర్ పెన్షన్ ప్లాన్ లక్ష్యంగా పెట్టుకుందని చెప్పారు. ‘‘35 ఏళ్ల వ్యక్తి 60 ఏళ్లకు ప్రీమియర్ పెన్షన్ ప్లాన్‌ను తీసుకుంటే.. ఏటా రూ.75 వేలు పదేళ్ల పాటు చెల్లించాడనుకుంటే.. అతనికి 60 ఏళ్లకు ప్రీమియం రూ.30.8 లక్షలవుతుంది.
అంటే ఆ వ్యక్తి జీవితాంతం ఏటా రూ.2.4 లక్షలు పెన్షన్‌ను పొందుతాడని’’ ప్రీమియర్ పెన్షన్ ప్లాన్ గురించి ఉదహరించారు. తొలి ఐదేళ్లు ప్రతి ఏటా 5 శాతం బోనస్ వస్తుందని.. ఒకవేళ ఆ వ్యక్తి అర్థంతరంగా మరణిస్తే ఒక్క ప్రీమియం చెల్లించినా సరే 105 శాతం ప్రీమియం బెనిఫిట్ అందుతుందని పేర్కొన్నారు.